ఎం.ఎస్. రాజు
ఎం.ఎస్. రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో మడకశిర నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1]
ఎం.ఎస్. రాజు | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | ఎం. తిప్పేస్వామి | ||
---|---|---|---|
నియోజకవర్గం | మడకశిర | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1982 శింగనమల, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | ఎం.ఎస్. కుళ్లాయప్ప | ||
జీవిత భాగస్వామి | ఉమాదేవి | ||
సంతానం | సందేశ్ మోక్షజ్ఞ, భవ్యకాంత్ కిరీటి | ||
నివాసం | 7-245-A, ఆదర్శ్ కాలనీ, రామ్ నగర్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుఎం.ఎస్. రాజు తొలుత ఎమ్మార్పీఎస్ ఉద్యమంతో ప్రజా ప్రస్థానం ప్రారంభించి ఆ తరువాత టీడీపీలో చేరి ఆ పార్టీ అనుబంధ సంఘం ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యాడు. లోకేష్ జట్టులో సభ్యుడిగా ఉంటూ యువగళం పాదయాత్రలో కీలకంగా వ్యవహరించాడు. ఆయనను 2024 మార్చి 2న బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి,[2] ఆ తరువాత రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలతో ఏప్రిల్ 21న మడకశిర అభ్యర్థిగా ప్రకటించడంతో[3][4] రాజు 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో మడకశిర నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఈర లక్కప్పపై 351 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికల్లో ఎం.ఎస్. రాజుకు 79983 ఓట్లు, లక్కప్పకు 79632 ఓట్లు, మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి సుధాకర్‌కు 17380 ఓట్లు వచ్చాయి.[5][6]
ఆయనను 2024 అక్టోబరు 30న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది.[7]
మూలాలు
మార్చు- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ A. B. P. Desam (2 March 2024). "టీడీపీ బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ఎం.ఎస్.రాజు - పార్టీ విధేయతకు చంద్రబాబు గుర్తింపు !". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
- ↑ TV9 Telugu (21 April 2024). "ఐదుగురు ఔట్.. అభ్యర్థులకు బీఫాంలు అందజేసిన చంద్రబాబు.. లాస్ట్ మినట్‌లో వారికి నో ఛాన్స్." Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Times of India (22 April 2024). "Naidu tweaks candidates' list; Raju to contest from Undi assembly seat". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Madakasira". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ Andhrajyothy (30 October 2024). "టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎంఎస్ రాజు". Retrieved 1 November 2024.