ప్రధాన మెనూను తెరువు

బాపట్ల లోకసభ నియోజకవర్గం

(బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి. నూతనంగా చేసిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. పునర్విభజన ఫలితంగా పొన్నూరు అసెంబ్లీ సెగ్మెంటు గుంటూరు లోక్‌సభ నియోజకవర్గానికి వెళ్ళగా ఈ నియోజకవర్గానికి కొత్తగా ఒంగోలు నుంచి సంతనూతలపాడు అసెంబ్లీ సెగ్మెంటు కలుపబడింది.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలుసవరించు

నియోజకవర్గపు గణాంకాలుసవరించు

  • 2001 లెక్కల ప్రకారము జనాభా: 17,64,955.
  • ఓటర్ల సంఖ్య: 12,63,207.
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 22.19% మరియు 4.16%

ఎన్నికైన పార్లమెంటు సభ్యులుసవరించు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన లోక్‌సభ సభ్యులు 
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ
1977 పి.అంకినీడు ప్రసాదరావు భారత జాతీయ కాంగ్రెసు
1980 పి.అంకినీడు ప్రసాదరావు భారత జాతీయ కాంగ్రెసు
1984 చిమటా సాంబు తెలుగుదేశం పార్టీ
1989 సలకల బెంజమిన్ భారత జాతీయ కాంగ్రెసు
1991 దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ
1996 ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ
1998 నేదురుమల్లి జనార్ధనరెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
1999 దగ్గుబాటి రామానాయుడు తెలుగుదేశం పార్టీ
2004 దగ్గుబాటి పురంధరేశ్వరి భారత జాతీయ కాంగ్రెసు
2009 పనబాక లక్ష్మి భారత జాతీయ కాంగ్రెసు
2014 మాల్యాద్రి శ్రీరాం తెలుగుదేశంపార్టీ

2004 ఎన్నికలుసవరించు







 

2004 ఎన్నికల ఫలితాలను తెలిపే చిత్రం

  ఇతరులు (0.99%)
భారత సాధారణ ఎన్నికలు: బాపట్ల
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ దగ్గుపాటి పురందరేశ్వరి 411,009 55.88 +12.96
తె.దే.పా డి.రామానాయుడు 317,017 43.10 -12.73
తెరాస చెల్లమల్ల వెంకటరెడ్డి 3,753 0.51
స్వతంత్ర అభ్యర్ది ప్రతిపాటి శ్రీనివాసు 2,159 0.29
స్వతంత్ర అభ్యర్ది ఇంగంటి అప్పారావు 1,434 0.19
మెజారిటీ 93,992 12.78 +25.69
మొత్తం పోలైన ఓట్లు 735,462 77.53 +10.06
కాంగ్రెస్ గెలుపు మార్పు +12.96

2009 ఎన్నికలుసవరించు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున బత్తుల రోశయ్య పోటీచేసారు.[1] కాంగ్రెస్ పార్టీ తరఫున పనబాక లక్ష్మి పోటీ చేసింది.[2]

ఎన్నికల ఫలితాలుసవరించు

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2009 33 బాపట్ల (SC) పనబాక లక్ష్మి స్త్రీ భారత జాతీయ కాంగ్రెస్ 460757 మల్యాద్రి శ్రీరాం పు తె.దే.పా 391419

2014 ఎన్నికలుసవరించు

భారత సార్వత్రిక ఎన్నికలు, 2014: బాపట్ల
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
తె.దే.పా మాల్యాద్రి శ్రీరాం 578,145 48.80 +11.29
వై.కా.పా వరికుటి అమృతపాణి 545,391 46.04 N/A
కాంగ్రెస్ పనబాక లక్ష్మీ 23,072 1.95 -42.20
Pyramid Party of India యల్లమటి రమేష్ 8,414 0.71 N/A
బసపా ద్వారపల్లి ఫిలిపు 8,113 0.68 N/A
AAP ఏడా చెన్నయ్య 3,948 0.33 N/A
JSP ఆర్.డి విల్సన్ 3,657 0.31 N/A
NOTA None of the Above 6,146 0.52 N/A
మెజారిటీ 32,754 2.76 -3.88
మొత్తం పోలైన ఓట్లు 1,184,634 85.04 +6.08
INC పై TDP విజయం సాధించింది ఓట్ల తేడా

నియోజకవర్గపు ప్రముఖులుసవరించు

నేదురుమల్లి జనార్ధనరెడ్డి
డిసెంబర్ 17, 1990 నుండి అక్టోబర్ 9, 1992 వరకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నేదురుమల్లి జనార్థన్ రెడ్డి 1998లో ఒకసారి ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. 1935లో జన్మించిన ఇతడు 1990లలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడిగా చెలామణి అయ్యాడు. ఇతడి భార్య రాజ్యలక్ష్మి ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో కొనసాగుతోంది.
దగ్గుబాటి పురంధరేశ్వరి
ఎన్టీ రామారావు కుమారై అయిన ఈమె 14వ లోక్‌సభకు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించింది. ఈమె ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో మానవవనరుల శాఖా సహాయమంత్రిణిగా కొనసాగుతోంది. 1991లో ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందిన దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఈమె భార్య.
దగ్గుబాటి రామానాయుడు
ప్రముఖ సినీ నిర్మాత అయిన దగ్గుబాటి రామానాయుడు 1999లో బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టాడు. శతాధిక చిత్రాలను నిర్మించి ప్రపంచ రికార్డు సృష్టించి గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించాడు.

మూలాలుసవరించు

  1. సూర్య దినపత్రిక, తేది 18-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009