మొల్లెర పూవయ్య గణేష్ (జననం 1946 జూలై 8) మాజీ భారతీయ ప్రొఫెషనల్ ఫీల్డ్ హాకీ ఆటగాడు, కోచ్. అతను భారత జట్టుకు కెప్టెన్‌గా, కోచ్‌గా కూడా పనిచేసాడు. 1973 లో అతనికి అర్జున అవార్డు లభించింది.

ఎం.పి.గణేష్
వ్యక్తిగత వివరాలు
పూర్తి పేరు మొల్లెర పూవయ్య గణేష్
జననం (1946-07-08) 1946 జూలై 8 (వయసు 78)
సుంటికొప్ప,కొడగు జిల్లా, కర్ణాటక
ఎత్తు 5 అ. 8 అం. (1.73 మీ.)[1]
క్రీడా జీవితము
సంవత్సరాలు Team Apps (Gls)
1965 - 1973 సర్వీసెస్
1974 బొంబాయి
జాతీయ జట్టు
1969 - 1974 భారత జాతీయ హాకీ జట్టు 100+

అతను 1990 హాకీ ప్రపంచకప్‌లో భారత హాకీ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. [2]

వ్యక్తిగత జీవితం

మార్చు

గణేష్ 1946 జూలై 8న కర్ణాటకలోని కొడగు (పూర్వం కూర్గ్ అని పిలిచేవారు) జిల్లాలో జన్మించాడు. అతను ఇండియన్ ఆర్మీలో చేరినప్పుడు హాకీ ఆడుతూ, 1966 - 1973 వరకు హాకీ టోర్నమెంట్లలో ఆడాడు. గణేష్ పాటియాలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ నుండి ఇంగ్లీష్‌లో ఎంఏ, డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్, ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో పిహెచ్‌డి పూర్తి చేశాడు. గణేష్‌కు 5 గురు తోబుట్టువులు (ఒక సోదరి, నలుగురు సోదరులు) ఉన్నారు, వీరిలో ఇద్దరు సోదరులు, MP సుబ్బయ్య, MP కావేరియప్ప జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్, హాకీ రెండింటిలోనూ పేరు సాధించారు.[3]

 
1988, సియోల్ ఒలింపిక్స్, భారత హాకీ జట్టులో కోచ్‌గా MP గణేష్ (ఎడమ నుండి ఆరవ స్థానంలో)

అవార్డులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Evans, Hilary; Gjerde, Arild; Heijmans, Jeroen; Mallon, Bill; et al. "Ganesh Mollerapoovayya". Olympics at Sports-Reference.com. Sports Reference LLC. Archived from the original on 3 December 2016.
  2. "Indian Coaches in Men's Hockey World Cups". hockeypassion.in. Hockey Passion. Retrieved 18 November 2022.
  3. "M. P. Ganesh biodata" (PDF). coorgblossom. Archived from the original (PDF) on 2016-03-03. Retrieved 2013-01-20.
  4. "Padma Awards 2020 Announced". pib.gov.in.
  5. The Hindu Net Desk (26 January 2020). "Full list of 2020 Padma awardees". The Hindu (in Indian English).