మొగలిగుండ్ల బాగారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు.[1]

ఎం.బాగారెడ్డి

మాజీ ఎమ్మెల్యే , మాజీ ఎంపీ
నియోజకవర్గం మెదక్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 17 జూన్‌ 1930
మలిచల్మ గ్రామం , జహీరాబాద్ మండలం , మెదక్ జిల్లా , తెలంగాణ రాష్ట్రం
మరణం 4 జూన్‌ 2004
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి యశోద రెడ్డి
సంతానం ఒక కుమార్తె , ఇద్దరు కుమారులు(మోగిలిగుండ్ల జైపాల్ రెడ్డి)
నివాసం హైదరాబాద్

జననం, విద్యాభాస్యం మార్చు

ఎం.బాగారెడ్డి 17 జూన్‌ 1930లో తెలంగాణ రాష్ట్రం , మెదక్ జిల్లా , జహీరాబాద్ మండలం , మలిచల్మ గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా అందుకున్నాడు.

రాజకీయ జీవితం మార్చు

 1. మలిచల్మ గ్రామ సర్పంచ్‌[2]
 2. 1957 నుండి 1972 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యుడు
 3. 1957 నుండి 1962 జహీరాబాద్‌ శాసనసభ్యుడు
 4. 1962 నుండి 1964 మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్
 5. 1962 నుండి 1967 - జహీరాబాద్‌ శాసనసభ్యుడు
 6. 1967 నుండి 1972 - జహీరాబాద్‌ శాసనసభ్యుడు
 7. 1972 నుండి 1978 - జహీరాబాద్‌ శాసనసభ్యుడు
 8. 1978 నుండి 1983 - జహీరాబాద్‌ శాసనసభ్యుడు
 9. 1978 నుండి 1983 - రాష్ట్ర పంచాయతీరాజ్, భారీ పరిశ్రమలు, రెవెన్యూ శాఖ మంత్రి [3]
 10. 1983 నుండి 1985 - జహీరాబాద్‌ శాసనసభ్యుడు
 11. 1984 - ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్
 12. 1985 నుండి 1989 - ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత
 13. 1985 నుండి 1989 - జహీరాబాద్‌ శాసనసభ్యుడు
 14. 1989 నుండి 1991 - మెదక్‌ లోక్‌సభ ఎంపీ
 15. 1991 నుండి 1996 - మెదక్‌ లోక్‌సభ ఎంపీ
 16. 1996 నుండి 1998 - మెదక్‌ లోక్‌సభ ఎంపీ
 17. 1998 నుండి 1999 - మెదక్‌ లోక్‌సభ ఎంపీ

ఆయన చివరిసారి 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆలె నరేంద్ర చేతిలో ఓడిపోయాడు.[4][5]

మరణం మార్చు

ఎం.బాగారెడ్డి 4 జూన్‌ 2004లో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్య పొందుతూ మరణించాడు.[6]

మూలాలు మార్చు

 1. Eenadu (29 October 2023). "అంచెలంచెలుగా.. అత్యున్నతంగా." Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
 2. EENADU (26 April 2024). "పంచాయతీ నుంచి లోక్‌సభకు." Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
 3. BBC News తెలుగు (31 October 2018). "ఇందిరాగాంధీ: మెదక్ అంటే ఎందుకంత అభిమానం?". Archived from the original on 28 జూలై 2021. Retrieved 28 July 2021.
 4. Sakshi (28 March 2019). "ప్రజా నాయకుడు". Archived from the original on 28 జూలై 2021. Retrieved 28 July 2021.
 5. News18 Telugu (10 March 2019). "మెదక్ పార్లమెంటు స్థానం.. దిగ్గజనేతల రాజకీయ ప్రస్థానం". Archived from the original on 28 జూలై 2021. Retrieved 28 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 6. Zee News (4 June 2004). "Congress leader Bagareddy dead" (in ఇంగ్లీష్). Archived from the original on 28 జూలై 2021. Retrieved 28 July 2021.

http://loksabhaph.nic.in/writereaddata/biodata_1_12/3392.htm