ఎం.వి. నరసింహారావు
మాదిరెడ్డి వెంకట్ 'బాబ్జీ' నరసింహారావు, (జననం 11 ఆగస్టు 1954) తెలంగాణకు చెందిన భారత మాజీ క్రికెటర్. 1978 నుండి 1979 వరకు 4 టెస్టుల్లో ఆడాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | సికింద్రాబాదు, తెలంగాణ, భారతదేశం | 1954 ఆగస్టు 11|||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | బాబీ రావు | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి బ్యాటింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | లెగ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: [1] |
జననం
మార్చునరసింహారావు 1954, ఆగస్టు 11న తెలంగాణలోని సికింద్రాబాదులో జన్మించాడు.
క్రీడారంగం
మార్చు1978-79లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ లు ఆడటానికి నరసింహారావు ఎంపికయ్యాడు, కాని రెండు టెస్టుల ఆడిన తరువాత తొలగించబడ్డాడు. కిమ్ హ్యూస్ ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన సిరీస్ కోసం తరువాతి సీజన్ లో రెండు టెస్టులు మాత్రమే ఆడాడు. ఈడెన్ గార్డెన్స్ లో ఆస్ట్రేలియాతో జరిగిన 5వ టెస్టులో ఇండియా జట్టు ఓటమి నుండి రక్షించడంలో కీలక పాత్ర పోషించాడు. చివరి రోజున భారత్ గెలవడానికి 247 అవసరమవ్వగా, 123 పరుగులకు 4 వికెట్లు తీశాడు. సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, గుండప్ప విశ్వనాథ్, చేతన్ చౌహాన్ వంటి నలుగురు ముఖ్య బ్యాట్స్ మెన్స్ ఔటవ్వగా, నరసింహారావు అజేయంగా 85 పరుగులు చేసి యశ్‌పాల్ శర్మతో భాగస్వామ్యాన్ని అందించగా, భారత్ 4 వికెట్లకు 200 స్కోరుతో టెస్టు డ్రా గా ముగిసింది.[1] నరసింహారావు ఆడిన చివరి టెస్ట్ మ్యాచ్ ఇది. బౌండరీ దగ్గర ఫీల్డర్‌గా ఉంటూ, ఎనిమిది క్యాచ్‌లు పట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 4124 పరుగులు (సగటు 47.40) చేసి, 218 వికెట్లు (సగటు 24.20) తీసాడు. 2011 ఐసిసి ప్రపంచ కప్ కోసం ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి వచ్చాడు.
ఇతర వివరాలు
మార్చు2012 డిసెంబరులో నరసింహారావు బ్రిటిష్ సామ్రాజ్యపు ప్రతిష్టాత్మక సభ్యునిగా ఎంపికైన మొట్టమొదటి ఇండియన్ క్రికెటర్ నిలిచాడు.[2] పదవీ విరమణ చేసిన తరువాత సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీని స్థాపించాడు. వివిఎస్ లక్ష్మణ్, మిథాలీ రాజ్, బవనక సందీప్, హనుమా విహారీ, తరుణ్ నెతులా వంటి అనేక మంది యువ క్రికెటర్లు ఈ అకాడమీలో శిక్షణ పొందారు.[3]
మూలాలు
మార్చు- ↑ "Calcutta Test Scorecard - Ind/Aus: 1979-80". Cricinfo.com. Retrieved జూలై 22 2021.
{{cite web}}
: Check date values in:|access-date=
(help) - ↑ http://www.thehindu.com/news/cities/Hyderabad/british-high-for-bobjee/article4246168.ece
- ↑ "From Hyderabad to the North West: The fascinating life of Bobby Rao". www.derryjournal.com (in ఇంగ్లీష్). Retrieved జూలై 22 2021.
{{cite web}}
: Check date values in:|access-date=
(help)