వి.వి.యెస్.లక్ష్మణ్

క్రికెట్ ఆటగాడు

వంగిపురపు వెంకట సాయి లక్ష్మణ్ నవంబర్ 1, 1974లో హైదరాబాదులో జన్మించాడు. లక్ష్మణ్ భారతదేశ క్రికెట్ జట్టు సభ్యుడిగా పలు విజయాలు అందించిన అద్భుతమైన ఆటగాడు. లక్ష్మణ్ ఇంతవరకు 127 టెస్టు మ్యాచ్‌లకు, 86 వన్డే మ్యాచ్‌లకు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. టెస్టులలో 16 శతకాలు, వన్డేలలో 6 శతకాలు సాధించాడు. టెస్టులలో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 281 పరుగులు. భారతీయ దేశవాళ్హీ క్రికెట్ లో లక్ష్మణ్ హైధరాబాధ్ జట్టుకు, ఇంగ్లాద్ ధేశవాళ్హీ క్రికెట్ లో లాంకషైర్ తరపున ప్రాతినిధ్యం వహింఛాదు. 2008 లో జరిగిన మొట్టమొదటి ఐపిఎల్లో దక్కన్ చార్జర్స్ జట్టుకు లక్ష్మణ్ నాయకత్వం వహించాడు. 2011 లో లక్ష్మణ్ కు పద్మ శ్రీ పురస్కారం దక్కింది.

వి.వి.యెస్.లక్ష్మణ్
1999 లో లక్ష్మణ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
వంగిపురపు వెంకట సాయి లక్ష్మణ్
పుట్టిన తేదీ (1974-11-01) 1974 నవంబరు 1 (వయసు 49)
హైదరాబాదు
మారుపేరువెరీ వెరీ స్పెషల్
ఎత్తు6 అ. 1 అం. (185 cమీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి వాటం ఆఫ్ స్పిన్
పాత్రటాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 209)1996 నవంబరు 20 - దక్షిణాఫ్రికా తో
చివరి టెస్టు2012 జనవరి 24 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 112)1998 ఏప్రిల్ 9 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2006 డిసెంబరు 3 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1992–2012హైదరాబాదు క్రికెట్ జట్టు
2007–2009లాంకషైర్
2008–2010దక్కన్ చార్జర్స్
2011కొచ్చి టస్కర్స్ కేరళ
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 134 86 267 173
చేసిన పరుగులు 8,781 2,338 19,730 5,078
బ్యాటింగు సగటు 45.97 30.76 51.64 34.54
100లు/50లు 17/56 6/10 55/98 9/28
అత్యుత్తమ స్కోరు 281 131 353 153
వేసిన బంతులు 324 42 1,835 698
వికెట్లు 2 0 22 8
బౌలింగు సగటు 63.00 34.27 68.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/2 3/11 2/42
క్యాచ్‌లు/స్టంపింగులు 135/– 39/– 277/1 74/–
మూలం: ESPNcricinfo, 2012 జనవరి 30

కెరీర్ ఆరంభము

మార్చు

1996 సంవత్సరంలో దక్షిణాప్రికా జట్టుతో అహ్మదాబాదులో ఆడిన టెస్ట్ క్రికెట్ట్ మ్యాచ్ లో యాభై పరుగులు చేసి అరంగ్రేట్రం చేశాడు. కాని తరువాత లక్ష్మణ్ భారత అంతర్జాతీయ జట్టులో స్థానం నిలుపుకోలేకపోయాడు. 1997 సంవత్సరంలో దక్షిణ ఆఫ్రికాతో ఓపెనింగ్ చేయడానికి పంపబడ్డాడు, కాని విఫలం అయ్యాడు. ఇలా మూడు సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్టులో స్థానం స్థిరంగా నిలుపుకోలేకపోయాడు. జనవరి 2000 సంవత్సరంలో భారత్ ఆస్ట్రేలియాకు జరిగిన సీరిస్ లో ఆస్ట్రేలియా జట్టుతో సిడ్నీలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో 167 పరుగులు చేసి తన సత్తా చూపాడు.

లక్ష్మణ్ అత్యుత్తమ ప్రదర్శనలు

మార్చు

లక్ష్మణ్ ఆట తీరు నాటకీయంగా ఈ సిరీస్ లో మారిపోయింది, ముంబయిలో జరిగిన మొదటి టెస్ట్ లో లక్ష్మణ్ 20, 12 పరుగులు చేసాడు. సచిన్ టెండుల్కర్ మినహా మిగతా అందరూ సరిగా ఆడలేకపోయారు. భారత్ ఈ టెస్ట్ లో పది వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయినా తరువాత 2001లో జరిగిన కలకత్తాలో జరిగిన రెండవ టెస్ట్ లో అత్యంత ఒత్తిడిలో ఆస్ట్రేలియా పైన ఫాలోఆన్ ఆడుతూ అసాధారణ రీతిలో 281 పరుగులు చేయడము లక్ష్మణ్ కు పేరుప్రఖ్యాతలు తెచ్చింది. ఈ క్రమంలో అతడు చాలా కాలం క్రితం సునీల్ గవాస్కర్ సాధించిన 236 (నాటౌట్) పరుగుల రికార్డును అధిగమించాడు.[1] వీరేంద్ర సెహ్వాగ్ 2004లో పాకిస్తాన్తో ముల్తాన్లో 309 పరుగులు చేసేవరకు ఈ రికార్డు పదిలంగా కొనసాగింది. కలకత్తాలో జరిగిన ఈ టెస్ట్‌లో రాహుల్ ద్రావిడ్‌తో కలిసి 376 పరుగుల రికార్డు భాగస్వామ్యము సాధించాడు. లక్ష్మణ్ ఈ ఇన్నింగ్స్ మంచి పరిణామానికి దారి తీసింది. అంతకు ముందు టెస్టును ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయినప్పటికి మిగిలిన 2 టెస్టులు గెలిచి స్టీవ్ వా యొక్క " చివరి సరిహద్దు" కలను వమ్ము చేసాడు. ప్రదర్శన భారత క్రికెట్ లో ఒక ఇతిహాసంగా నిలిచిపోయింది. ప్రపంచంలోని అత్యద్భుత ప్రదర్శనలలో ఆరవదిగా విజ్డన్ పత్రిక గుర్తించింది.[2] తర్వాత కొన్ని సంవత్సరాలు లక్ష్మణ్ స్థానము ఒక రోజు పోటీ లకు, టెస్ట్ లకు పదిలం చేసుకున్నాడు. తర్వాత అతను తన ఆట తీరును ఇండియా ఆస్ట్రేలియా పర్యటన వరకు కొనసాగించాడు. ఇక్కడ అతను మూడు వన్డే, రెండు టెస్టు శతకాలు సాధించాడు. అతడు ఆస్ట్రేలియా పైన అడిలైడ్లో 148 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్ లో రాహుల్ ద్రవిడ్తో మరోసారి 300 పరుగుల భాగస్వామ్యము సాధించాడు. రెండు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా పై వారి సొంత గడ్డ పై గెలవడానికి ఈ ఇన్నింగ్స్ ఉపయోగపడింది. అతను సిడ్నీ టెస్ట్ లో 178 పరగులు చేసి సచిన్ తో కలిసి మరోసారి 300 పరుగుల భాగస్వామ్యము సాధించాడు.ఈ కారణము వలన ఇయాన్ చాపెల్ లక్ష్మణ్ ను " చాలా చాలా ప్రత్యేకమైన లక్ష్మణ్ ( very very special laxman ) అని వర్ణించాడు.

ఇటీవలి ఆటతీరు

మార్చు

కాని లక్ష్మణ్ ఆటతీరు ఆస్ట్రేలియా పర్యటన నుండి తగ్గుతూ వచ్చింది. 2004 మార్చిలో పాకిస్తాన్ పర్యటన నుండి జింబాబ్వే ( ఐసిసి ర్యాంకింగ్స్ లో చివరి స్థానంలో ఉన్న దేశము) తో సాధించిన ఒక సెంచరీతో సహా కేవలము మూడు సెంచరీలు మాత్రమే సాధించాడు. అతను తన 2004లో అభిమాన ఆస్ట్రేలియాతో మన దేంలో జరిగిన సీరీస్ లో ముంబయిలో జరిగిన టెస్ట్ లో 69 పరుగులు సాధించినా చాలా తడబడ్డాడు. ఆ టెస్ట్ భారత్ గెలిచినప్పటికి సిరీస్ కోల్పోయింది. ముంబయిలో మార్చి 2006లో ఇంగ్లాండుతో మొదటి టెస్ట్ లో లక్ష్మణ్ సున్నా పరుగులు చేసి స్థానము కోల్పోయాడు. తిరిగి గాయము కారణముగా సచిన్ గైర్హాజరీ కారణముగా వెస్టిండీస్ పర్యటనలో స్థానము సాధించి మూడవ టెస్ట్ లో శతకము సాధించాడు. గ్రెగ్ ఛాపెల్ 2005లో కోచ్ గా వచ్చిన తర్వాత లక్ష్మణ్ యొక్క నాశిరకం ఫీల్డింగ్, అతని ఆటతీరు వన్డే లకు సరిపోకపోవడం వలన వన్డే ల నుండి తొలగింపబడ్డాడు. ఇది 2004 మొదట్లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ లతో 14 గేములలో 4 శతకాలు, ఆస్ట్రేలియాతో ఒకే వారములో విబి సీరీస్ లో సాధించిన 3 సెంచరీలు కలుపుకుని, మరుగునపరిచింది. నవంబరు 2006లో గంగూలీతో పాటు లక్ష్మణ్ కూడా దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు. లక్ష్మణ్ ఫిబ్రవరి 2004లో జి.ఆర్.శైలజను వివాహమాడెను.

ఇండియన్ ప్రీమియర్ లీగ్

మార్చు

2008 సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ దక్కన్ చార్జర్స్ కు నేతృత్వం వహించాడు. కాని ట్వంటీ-20 ఆటలో తన బ్యాంటింగ్ తీరులో కాని, నాయకత్వం కాని చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సీజన్ పూర్తి కాకుండానే తన నాయకత్వ బాధ్యతలను వైస్ కెప్టెన్ ఆడం గిల్‌క్రిస్ట్కు అప్పగించాల్సి వచ్చింది. చివరికి దక్కన్ చార్జర్స్ చివరి నుంచి రెండో స్థానం మాత్రమే పొందగలిగింది. 2009 సీజన్ ఐ.పి.ఎల్. కొరకు ఏకంగా లక్ష్మణ్‌ను నాయకత్వ బాధ్యతలనుంచి తొలిగించి ఆడం గిల్‌క్రిస్ట్‌కు కట్టబెట్టారు.[3] ఆస్ట్రేలియా జట్టుపై మంచి రికార్డు ఉన్న లక్ష్మణ్‌ను ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటన ముందు తప్పించడం, ఆస్ట్రేలియాకు చెందిన డారెన్ లీమన్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించగానే దక్కన్ చార్జర్స్ ఈ నిర్ణయం తీసుకొనడం లక్ష్మణ్ ఆత్మ విశ్వాసం దెబ్బతీసేందుకేనని అనుమానాలకు తావిస్తోంది.[4]

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. http://ind.cricinfo.com/db/ARCHIVE/2000-01/AUS_IN_IND/SCORECARDS/AUS_IND_T2_11-15MAR2001.html
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-12-01. Retrieved 2007-03-18.
  3. సాక్షి దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, పేజీ29, తేది 30.09.2008.
  4. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, పేజీ 14, తేది 30.09.2008.