ఎం. శ్రీరంగారావు

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు

ఎం. శ్రీరంగారావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు. 1957లో 2వ లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

ఎం. శ్రీరంగారావు
పార్లమెంట్ సభ్యుడు
In office
1957 - 1962
అంతకు ముందు వారుబద్దం ఎల్లారెడ్డి
తరువాత వారుజె. రమాపతిరావు
నియోజకవర్గంకరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం
In office
=
వ్యక్తిగత వివరాలు
జననం1918, ఆగస్టు 14
అంతర్గావ్, , జగిత్యాల మండలం, జగిత్యాల జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిరాధమ్మ
తల్లిదండ్రులుధర్మారావు

జననం, విద్య

మార్చు

శ్రీరంగారావు 1918, ఆగస్టు 14న తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, జగిత్యాల మండలం, అంతర్గావ్ గ్రామంలో జన్మించాడు. తండ్రిపేరు ధర్మారావు. శ్రీరంగారావు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో బిఎస్సీ, న్యాయవిద్యను చదివాడు.[1]

వ్యక్తిగత జీవితం

మార్చు

శ్రీరంగారావుకు 1943, మే 15న రాధమ్మతో వివాహం జరిగింది. 1943 మే 15;

రాజకీయ జీవితం

మార్చు

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 2వ లోక్‌సభకు (1957-1962) పోటిచేసి పి.డి.ఎఫ్. పార్టీ అభ్యర్థి బద్దం ఎల్లారెడ్డిపై 10,127 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[2]

ఎన్నిక వివరాలు:

  • మొత్తం ఓటర్లు: 7,48,201 (ద్వంద్వ-సభ్య నియోజకవర్గం)
  • ఎం. శ్రీ రంగారావు.. 1,41,680
  • బద్దం ఎల్లారెడ్డి .. 1,31,553
  • గోపాల్ రావు .. 71,341
  • శ్రీపతి సాయిరెడ్డి .. 56,225

నిర్వర్తించిన పదవులు

మార్చు
  • కరువు సహాయక చర్యలు (1938-39)
  • కార్యదర్శి, తాలూకా కాంగ్రెస్ కమిటీ (1951-54)
  • అధ్యక్షుడు, తాలూకా కమిటీ (1954-57)
  • కార్యదర్శి, తాలూకా వ్యవసాయ సహకార సంఘం (1954-57)
  • సభ్యుడు, తాలూకా అద్దె కమిషన్ (1954-56)

మూలాలు

మార్చు
  1. "Members Bioprofile". loksabhaph.nic.in. Archived from the original on 2021-11-23. Retrieved 2021-11-23.
  2. "Members : Lok Sabha". loksabha.nic.in. Archived from the original on 2021-10-09. Retrieved 2021-11-22.