ఎకిమిడిన్ అనేది ఒక ఆల్కలాయిడ్.ఇది ఎచియం పినినానా, ఎచియం ప్లాంటజినియం మరియు ఇతర జీవులlO కనిపించే సహజ ఉత్పత్తి.[1]ఎకిమిడిన్ అనేది 3 C-7 ఐసోమర్‌లలో ఒకటి, ఇది గతంలో ఎచిమిడిన్ మాత్రమే కలిగి ఉంటుందని తప్పుగా భావించిన క్లస్టర్‌ కు చెందినది.ఎకిమిడిన్ మరియు దాని ఐసోమర్లు వైపర్స్ బగ్లోస్ (ఎచియం ప్లాంటజినియం) నుండి వేరుచేయబడిన పైరోలిజిడిన్ ఆల్కలాయిడ్స్.పైరోలిజిడిన్ ఆల్కలాయిడ్స్ (PAs) అనేది పైరోలిజిడిన్ నిర్మాణాన్ని కలిగి ఉన్న సహజంగా సంభవించే మొక్కల యొక్క టాక్సిన్స్(విష స్వభావం వున్న రసాయన సమ్మేళనాలు).[2]మొక్కలను తీనే జీవులకు వ్యతిరేకంగా రక్షణ యంత్రాంగంగా మొక్కల ద్వారా PAలు ఉత్పత్తి చేయబడతాయి.అవి సహజంగా సంభవించే ఆల్కలాయిడ్స్ యొక్క అతిపెద్ద తరగతికి చెందినవి, మరియు అనేక రకాల వృక్ష జాతులలో కనిపిస్తాయి.హెపాటోటాక్సిసిటీకి మందులతో అధిక స్థాయిలో వినియోగించినప్పుడు PAలు ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను కలిగిస్తాయి.[2]ఎకిమిడిన్ ((+)-ఎచిమిడిన్) అనేది మీడ్‌ను(తేనె సారాయి) ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే తేనెలో కనుగొనబడిన ప్రధాన ఆల్కలాయిడ్.[3]

ఎకిమిడిన్ 2 D సౌష్టవం

లభ్యత

మార్చు

ఎకిమిడిన్ ఆల్కలాయిడ్, ఎచియం రౌవోల్ఫీ,మరియు ఎచియం హారిడం మొక్కలనుండి లభిస్తుంది.[4] ఎచియం రౌవోల్ఫీ(Echium rauwolfii) అనేది బోరాగినేసి కుటుంబానికి చెందిన పుష్పించే మొక్క.[5]దీని స్థానిక పరిధి ఉత్తరఆఫ్రికా నుండి అరేబియన్ ద్వీపకల్పం వరకు వ్యాపించి వున్నది.[6]

భౌతిక దర్మాలు

మార్చు
లక్షణం/గుణం మితి/విలువ
అణు సూత్రం C20H31NO7[7]
అణు భారం 397.5 గ్రా/మోల్[7]
సాంద్రత 1.3±0.1 గ్రా/సెం.మీ3[8]
ద్రవీభవన ఉష్ణోగ్రత >133°C[9]
మరుగు స్థానం 535.7±50.0°C[8]
వక్రీభవన గుణకం 1.565[8]
బాష్ప పీడనం 0.0±3.2 మి.మీ/పాదరసమ్,25°Cవద్ద[8]
బాష్పీకరణ ఉష్ణశక్తి 93.4±6.0 కి.జౌల్స్/మోల్[8]
  • ఎచిమిడిన్ పైరోలిజైన్‌లకు సంచించిన ఆల్కలాయిడ్.
  • ఇది ఘన స్థితిలో వుండే పదార్థం.రంగులేదు.[10].
  • నీటిలో కరుగుతుంది.
  • క్లోరోఫామ్,మిథనాల్ లో (కొద్దిగా) కరుగుతుంది.[9]

ఉపయోగాలు

మార్చు
  • ఎచిమిడిన్ ప్రస్తుతం అనేక ఉత్పత్తులలో పైరోలిజిడిన్ ఆల్కలాయిడ్స్ విషపూరిత పరిమితులను నిర్ణయించడానికి ప్రమాణంగా ఉపయోగించబడుతుంది; అందువల్ల, దాని స్వచ్ఛత చాలా ముఖ్యమైనది.[11]

ఇవి కూడాచవండి

మార్చు

క్షారమయం

మూలాలు

మార్చు
  1. "Echimidine". .pharmacompass.com. Retrieved 2024-04-04.
  2. 2.0 2.1 "ECHIMIDINE". plantaanalytica.com. Retrieved 2024-04-04.
  3. "Echimidine". medchemexpress.com. Retrieved 2024-04-04.
  4. "Pyrrolizidine Alkaloids from Echium rauwolfii and Echium horridum (Boraginaceae)". researchgate.net. Retrieved 2024-04-04.
  5. "Echium rauwolfii". Tropicos. Retrieved 2024-04-04.
  6. "Echium rauwolfii Delile | Plants of the World Online | Kew Science". Plants of the World Online. Retrieved 2020-03-27.
  7. 7.0 7.1 "Echimidine". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-04-04.
  8. 8.0 8.1 8.2 8.3 8.4 "Echimidine". chemspider.com. Retrieved 2024-04-04.
  9. 9.0 9.1 "ECHIMIDINE". chemicalbook.com. Retrieved 2024-04-04.
  10. "Physical and chemical properties" (PDF). carlroth.com/. Retrieved 2024-04-04.
  11. "Isolation of Echimidine and Its C-7 Isomers from Echium plantagineum L. and Their Hepatotoxic Effect on Rat Hepatocytes". ncbi.nlm.nih.gov. Retrieved 2024-04-05.