ఎక్కడికి పోతావు చిన్నవాడా

ఎక్కడికి పోతావు చిన్నవాడా 2016 తెలుగు సినిమా.[1] చిత్ర విడుదల నవంబరు 1, 2016.[2][3][4][5]

ఎక్కడికి పోతావు చిన్నవాడా
Ekkadiki Pothavu Chinnavada.jpg
దర్శకత్వంవి ఆనంద్
రచనవి ఆనంద్
నిర్మాతపి. వి. రావు
తారాగణంనిఖిల్ సిద్ధార్థ్
నందిత శ్వేత
హెబ్బా పటేల్
ఛాయాగ్రహణంసాయి శ్రీరామ్
కూర్పుచోటా కె. ప్రసాద్
సంగీతంశేఖర్ చంద్ర
నిర్మాణ
సంస్థ
మేఘన ఆర్ట్స్
విడుదల తేదీ
2016 నవంబరు 11 (2016-11-11)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

అర్జున్ (నిఖిల్) ఓ యానిమేష‌న్ కంపెనీలో ప‌నిచేస్తుంటాడు. బాహుబ‌లి యానిమేష‌న్ ట్రూప్‌లో ఉంటాడు. అత‌ని ఫ్రెండ్‌కి సోద‌రుడు కిశోర్ (వెన్నెల కిశోర్‌) కి దెయ్యం ప‌ట్టిన‌ట్టు అనుమానం క‌లుగుతుంది. అందులో నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి అత‌న్ని కేర‌ళ‌లోని మ‌హిషాసుర‌మ‌ర్ధిని గుడికి వెళ్ల‌మంటాడు ఓ స్వామీజీ. ఆయ‌న మాట ప్ర‌కారం అర్జున్‌, కిశోర్ ఇద్ద‌రూ అక్క‌డికి వెళ్తారు. కిశోర్‌కి దెయ్యం ప‌ట్ట‌లేద‌నే విష‌యం తెలుస్తుంది. అక్క‌డే అర్జున్‌కి అమ‌ల (హెబ్బా ప‌టేల్‌)తో ప‌రిచ‌య‌మ‌వుతుంది. నాలుగు రోజులు అత‌నితో స‌ర‌దాగా గ‌డుపుతుంది. దాంతో ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు అర్జున్‌. కానీ ఆమె క‌నిపించ‌కుండా పోతుంది. తీరా ఓ సారి క‌నిపించినా త‌న పేరు అమ‌ల కాదు నిత్య అని చెబుతుంది. అంత‌లోనే `నేను అమ‌ల‌`ని అని అత‌నికి పార్వ‌తి (నందిత శ్వేత‌) ఫోన్ చేస్తుంది. అమ‌ల ఎవ‌రు? అర్జున్ ప్రేమించిన ఆయేషా (అవికా గోర్‌) ఏమ‌యింది? అమ‌ల‌కి ఆయేషాకి సంబంధం ఏంటి? నిత్య‌, పార్వ‌తికి అమ‌ల‌తో ఉన్న ప‌రిచ‌యం ఏంటి? మ‌హిషాసుర‌మ‌ర్ధిని ఆల‌యంలో జ‌రిగింది ఏంటి? ఆత్మ 21 గ్రాములే ఉంటుందా? అది సైంటిఫికిగ్గా ఎలా ప్రూవ్ అయింది? ఒక వ్య‌క్తి బ‌తికి ఉండ‌గా అత‌నిలో మ‌రో ఆత్మ ప్ర‌వేశించ‌డం సాధ్య‌మేనా? స‌నాత‌న ధ‌ర్మం వీటిని గురించి ఏం చెబుతోంది? వ‌ంటి అంశాలు క‌థ‌లో భాగం.

నటులుసవరించు

టీజర్సవరించు

టీజర్ మే 1 2016 న విడుదలైంది.[6]

మూలాలుసవరించు

  1. "Nikhil Siddhartha's next movie titled 'Ekkadiki Pothavu Chinnavada': Its first-look poster revealed".
  2. http://www.filmibeat.com/telugu/movies/ekkadiki-pothavu-chinnavada.html
  3. http://www.ibtimes.co.in/dhruva-ekkadiki-pothavu-chinnavada-ungarala-rambabu-release-dates-revealed-699831
  4. http://www.123telugu.com/mnews/ekkadiki-pothavu-chinnavadas-release-date-locked.html
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-10-20. Retrieved 2016-10-17.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-10-17. Retrieved 2016-10-17.

బయటి లింకులుసవరించు