నందిత శ్వేత
నందిత శ్వేత (శ్వేత శెట్టి) భారతీయ చలనచిత్ర నటి. తమిళ, తెలుగు చిత్రాలలో నటించింది. కన్నడ చిత్రం నంద లవ్స్ నందిత సినిమాతో శ్వేత తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. తరువాత 2012లో తమిళంలో వచ్చిన అట్టకతి అనే కామెడీ చిత్రంలో నటించింది. 2016లో తెలుగులో వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా హర్రర్ కామెడీ చిత్రంతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది.
నందిత శ్వేత | |
---|---|
జననం | శ్వేత శెట్టి[1] 30 ఏప్రిల్ 1989 |
విద్యాసంస్థ | క్రైస్ట్ విశ్వవిద్యాలయం[2] |
వృత్తి | సినిమా నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2008 - ప్రస్తుతం |
వ్యక్తిగత జీవితం
మార్చునందిత 1989, ఏప్రిల్ 30న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది.[3] తండ్రి వ్యాపారవేత్త, తల్లి గృహిణి. నందితకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు.[4]
సినిమా ప్రస్థానం
మార్చు2006లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తరువాత ఉదయ మ్యూజిక్ ఛానల్ లో వీజేగా తన కెరీర్ ను ప్రారంభించింది. 2008న కన్నడ చిత్రం నంద లవ్స్ నందిత చిత్రంలో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఈ చిత్రంలో ఆమె పాత్రకు నందిత అని పేరు ఉండడంతో, ఆ పేరునే తన స్క్రీన్ పేరుగా పెట్టుకుంది. 2012లో పా. రంజిత్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం అట్టకతి లో తొలిసారిగా నటించింది. ఈ సినిమాలోని నటనకు ప్రశంసలు అందుకుంది. దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వం వహించిన ఎతిర్ నీచల్ చిత్రంలో అథ్లెట్‌గా నటించింది.[5] ఇదర్కుతనే ఆసైపట్టై బాలకుమార అనే హాస్య చిత్రంలో విజయ్ సేతుపతి పక్కన చెన్నై అమ్మాయి కుముత పాత్రలో నటించింది.
2014లో శ్వేత నటించిన ముందాసుపట్టి, నలనుమ్ నంధినియుమ్, అయిందామ్ తలైమురాయి సిధా వైధియా సిగమని, 2015 లో ఉప్పు కరువాడు, పులి, 2016లో అంజల, ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే చిత్రాలు విడుదలయ్యాయి. తెలుగులో ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది. 2017 డిసెంబరులో ఉల్కుతు చిత్రం విడుదలైంది. కలకలప్పు 2లో అతిథి పాత్రలో నటించింది. ఆ తరువాత కాతిరుప్పోర్ పట్టియాల్, అసురవాధం [6] రెండు తెలుగు సినిమాలు, శ్రీనివాస కళ్యాణం, బ్లఫ్ మాస్టర్ విడుదలయ్యాయి.
నటిగా
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనికలు. |
---|---|---|---|---|
2008 | నంద లవ్స్ నందిత | నందిత | కన్నడ | |
2012 | అట్టకతి | పూర్ణిమ | తమిళం | |
2013 | ఎతిర్ నీచల్ | వల్లి | ||
ఇదర్కుతనే ఆసైపట్టై బాలకుమార | కుముధ | |||
2014 | ముందాసుపట్టి | కలైవానీ | ||
నలనుమ్ నంధినియుమ్ | నందిని | |||
అయిందామ్ తలైమురాయి సిధా వైధియా సిగమని | నందిని | |||
2015 | పులి | పుష్ప | అతిథి పాత్ర | |
ఉప్పు కరువాడు | పూంగుజాలి | |||
2016 | అంజల | ఉత్తర | ||
ఎక్కడికి పోతావు చిన్నవాడా | అమల/పార్వతి | తెలుగు | ||
2017 | ఉల్కుతు | కడలరాసి | తమిళం | |
2018 | కలకలప్పు 2 | నందిత | అతిథి పాత్ర | |
కాతిరుప్పోర్ పట్టియాల్ | మేగల | |||
అసురవాధం | మహా | |||
శ్రీనివాస కళ్యాణం | పద్దు | తెలుగు | ||
బ్లఫ్ మాస్టర్ | అవని | |||
2019 | ప్రేమకథా చిత్రమ్ 2 | నందు | ||
దేవి 2 | సారా | తమిళం | ||
అభినేత్రి 2 | తెలుగు | |||
7 | రమ్య | తెలుగు, తమిళం | ||
కల్కి | అసిమా ఖాన్ | తెలుగు | ||
2020 | తానా | నివేదా | తమిళం | |
ఐపిసి 376 | తెలుగు | పోస్ట్ ప్రొడక్షన్ | ||
కబటదారి | తమిళం | చిత్రీకరణ | ||
2021 | కపటధారి | తెలుగు | ||
అక్షర | తెలుగు | |||
2022 | జెట్టి | తెలుగు | ||
2023 | హిడింబ | ఆధ్య | తెలుగు | |
రారా పెనిమిటి | తెలుగు[7] | |||
రణం | మధుమిత/మధు | తమిళ్ | ||
మంగళవారం | ఎస్.ఐ మాయా | తెలుగు | ||
2024 | రాఘవరెడ్డి | తెలుగు | ||
ఓఎంజీ | తెలుగు |
సింగిల్స్
మార్చుసంవత్సరం | పాట | భాష | గమనికలు |
---|---|---|---|
2020 | "మన్సారా సోలు" | తమిళం | నటిగా |
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా
మార్చుసంవత్సరం | సినిమా | నటి | ఫుట్ నోట్స్ |
---|---|---|---|
2019 | దబాంగ్ 3 | సోనాక్షి సిన్హా | కన్నడ, తమిళ, తెలుగు వెర్షన్లకు [8] |
అవార్డులు
మార్చుసినిమా | అవార్డులు | వర్గం | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|
అట్టకతి | జయ టీవీ మూవీ అవార్డులు | ఉత్తమ తొలి నటి | గెలుపు | [9] |
ఎతిర్ నీచల్ | 3వ సిమా అవార్డులు | ఉత్తమ సహాయ నటి | గెలుపు | [10] |
61 వ ఫిలింఫేర్ దక్షిణ భారత అవార్డులు | ఉత్తమ సహాయ నటి-తమిళం | ప్రతిపాదించబడింది | ||
ముందాసుపట్టి | ఎడిసన్ అవార్డులు | ఉత్తమ రెట్రో నటిగా ఎడిసన్ అవార్డు | గెలుపు | |
ఎక్కడికి పోతావు చిన్నవాడా | 64 వ ఫిలింఫేర్ అవార్డులు సౌత్ | ఉత్తమ సహాయ నటి- తెలుగు | గెలుపు | [11] |
మూలాలు
మార్చు- ↑ "'I Will be Playing a Comedian'". The New Indian Express. Archived from the original on 2016-05-13. Retrieved 2020-08-21.
- ↑ "Nanditha Shwetha Interview". Youtube.
- ↑ "Playing Innocent: The Nandita Sweta Interview". Silverscreen.in. Archived from the original on 2015-04-20. Retrieved 2020-08-21.
- ↑ "Archived copy". Archived from the original on 2015-05-05. Retrieved 2020-08-21.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ Jeshi, K. (4 October 2012). "A good start". Chennai, India: The Hindu. Archived from the original on 17 అక్టోబరు 2012. Retrieved 21 August 2020.
- ↑ "Asuravadham press meet gallery".
- ↑ Sakshi (9 April 2023). "సింగిల్ క్యారెక్టర్‌తో సినిమా.. రారా పెనిమిటి అంటున్న నందిత శ్వేత". Archived from the original on 26 April 2023. Retrieved 26 April 2023.
- ↑ https://timesofindia.indiatimes.com/entertainment/tamil/movies/news/nandita-swetha-dubs-for-sonakshi-in-dabangg-3/articleshow/72816306.cms
- ↑ "Nandita Swetha, best Debut actress 2012". Times of India. Retrieved 21 August 2020.
- ↑ "Nandita signs her next with Kaali and Ramdoss".
- ↑ "Best Actor in a Supporting Role (Female): Nandita Swetha". Timesofindia.indiatimes.com.
ఇతర లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నందిత శ్వేత పేజీ