ఎగువ రెడ్డిపల్లి

ఎగువ రెడ్డిపల్లి కడప జిల్లా పుల్లంపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం, రెడ్డిపల్లి-చెరువుకు, రంగంపల్లి చెరువుకు దగ్గరగా ఉంటుంది. ఈ గ్రామానికి రెండు వైపులా నదులు ఉన్నాయి. ఈ గ్రామంలో ఉన్న నరసింహ స్వామి కొండ చాలప్రసిద్ధి గాంచింది.

ఎగువ రెడ్డిపల్లి
—  రెవిన్యూయేతర గ్రామం  —
ఎగువ రెడ్డిపల్లి is located in Andhra Pradesh
ఎగువ రెడ్డిపల్లి
ఎగువ రెడ్డిపల్లి
అక్షాంశరేఖాంశాలు: 14°03′35″N 79°13′07″E / 14.059644°N 79.218670°E / 14.059644; 79.218670
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అన్నమయ్య
మండలం పుల్లంపేట
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

దేవాలయాలు

మార్చు

శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం:- ఎగువరెడ్డిపల్లె గ్రామ సమీపంలోని గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2014, జూన్-23, సోమవారం నుండి ప్రారంభించారు. 24వ తేదీ మంగళవారం నాడు స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ గ్రామోత్సవం టి.కమ్మపల్లి, బలిజపల్లి, క్రిష్ణంపల్లి, బోటుమీదపల్లి గ్రామాలగుండా సాగింది. 25వ తేదీ బుధవారం ఉదయం 10-00 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ, అభిషేకాలు నిర్వహించి, అనంతరం విగ్రహ ప్రతిష్ఠను చేపట్టినారు. ఈ సందర్భంగా, ధ్వజస్తంభ ప్రతిష్ఠను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమానికి తరలివచ్చిన భక్తులకు అన్నదానం కార్యక్రమం చేపట్టినారు. []

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు