ఎదురులేని అలెగ్జాండర్

ఎదురులేని అలెగ్జాండర్ 2014 వ సంవత్సరంలో విడుదలైన తెలుగు చలనచిత్రం

ఎదురులేని అలెగ్జాండర్ 2014, మార్చి 29 విడుదలైన తెలుగు చలనచిత్రం. పి.ఎల్.కె. ప్రొడక్షన్స్ పతాకంపై పి.ఎల్.కె. రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తారకరత్న, కోమల్ ఝా[1] జంటగా నటించగా, డా. జోస్యాభట్ల శర్మ సంగీతం అందించాడు.[2]

ఎదురులేని అలెగ్జాండర్
ఎదురులేని అలెగ్జాండర్ సినిమా పోస్టర్
దర్శకత్వంపి.ఎల్.కె. రెడ్డి
నిర్మాతపి.ఎల్.కె. రెడ్డి
తారాగణంతారకరత్న, కోమల్ ఝా
సంగీతండా. జోస్యాభట్ల శర్మ
నిర్మాణ
సంస్థ
పి.ఎల్.కె. ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2014 మార్చి 29 (2014-03-29)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం మార్చు

జిన్నభాయ్ (రవిబాబు), కొట్టప్ప (జయప్రకాష్ రెడ్డి) అనే ఇద్దరు విలన్లతో పోరాడుతూ, నగరంలో భూకబ్జా, వ్యభిచారాల అంతం చేసే నిజాయితీగల పోలీసు అధికారి పాత్రను తారకరత్న పోషించాడు. పోలీస్ కమిషనర్ వైజాగ్ నుండి హైదరాబాదుకు బదిలీ చేసినప్పుడు ఆఫీసర్ అలెగ్జాండర్ కనీసం 99 మందిని చంపుతాడు. కోమల్ ఝా పోలీసు అధికారిని ప్రేమించే పాత్రలో నటించింది.

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

 • నిర్మాత, దర్శకత్వం: పి.ఎల్.కె. రెడ్డి
 • సంగీతం: డా. జోస్యాభట్ల శర్మ
 • నిర్మాణ సంస్థ: పి.ఎల్.కె. ప్రొడక్షన్స్

పాటలు మార్చు

ఈ చిత్రానికి డా. జోస్యాభట్ల శర్మ సంగీతం అందించాడు. ఈ పాటలకు మిశ్రమ స్పందన వచ్చింది.

 1. "అలెగ్జాండర్" (గానం: గీతామాధురి, హేమచంద్ర)
 2. "గులేభ కావాలి" (గానం: హేమచంద్ర, మాళవిక)
 3. "వయసు" (గానం: ఎం. ఎం. కీరవాణి, అమృత వర్షిణి)
 4. "కవ్వించిన" (గానం: చైత్ర అంబడిపూడి, ప్రసోబ్)
 5. "వయసు" (గానం: ఉష)

స్పందన మార్చు

 1. టైమ్స్ ఆఫ్ ఇండియా: 1.5/5 రేటింగ్ ఇచ్చింది. "ఈ సినిమాలో అలెగ్జాండర్ పాత్రకు డైలాగ్‌లు ఎక్కువగా ఉన్నాయి" అని రివ్యూ ఇచ్చింది.[1]
 2. ఏపి హెరాల్డ్: ఈ చిత్రం సాంకేతికంగా, సంగీతపరంగా అంత బాగాలేదు. కథనంలో ఆసక్తిని కలిగించడంలో దర్శకుడు కూడా విఫలమయ్యాడని రివ్యూ ఇచ్చింది.[3]

మూలాలు మార్చు

 1. 1.0 1.1 Rao, Ch Sushil (10 May 2016). "Eduruleni Alexander". The Times of India. Retrieved 18 July 2020.
 2. "Tarakaratna as Alexander". Retrieved 18 July 2020.
 3. "Eduruleni Alexander Telugu Movie Review, Rating" (in ఇంగ్లీష్). Retrieved 18 July 2020.