మాళవిక ఒక తెలుగు సినీ నేపథ్య గాయని.[1] అనేక ప్రేక్షకాదరణ పొందిన పాటలను పాడింది.

మాళవిక
భారతీయ సినీ నేపధ్య గాయని మాళవిక
వ్యక్తిగత సమాచారం
జననంవిశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
వృత్తిగాయని, టెలివిజన్ ప్రయోక్త
వాయిద్యాలుగాత్రం
క్రియాశీల కాలం2001- ఇప్పటివరకు

నేపధ్యము సవరించు

చిరు ప్రాయంలోనే తన తల్లి వద్ద సంగీత శిక్షణ తీసుకున్నది. ఈమె తల్లి ఒక సంగీత ఉపాధ్యాయురాలు. తర్వాత శాస్త్రీయ సంగీతంలో కుమారి మందపాక శారద గారి వద్ద శిక్షణ పొందింది. విశాఖపట్నం లోని లిటిల్ ఏంజెల్స్ పాఠశాల నుండి ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. ఈమె తల్లి కూడా ఇదే పాఠశాలలో సంగీత ఉపాధ్యాయురాలుగా పనిచేసేది.చిన్నప్పటినుండి వీరి ఇంటిలో సంగీత వాతావరణం మధ్య పెరిగింది. చిన్నప్పటినుండి విశాఖపట్నం, చుట్టుపక్కల జరిగిన అనేక పాటలపోటీలలో పాల్గొని అనేక బహుమతులు గెలుచుకున్నది. సినీరంగంలో అవకాశాలు పెరగడంతో వీరి కుటుంబం హైదరాబాదుకి మకాం మార్చింది.

పాడుతా తీయగా లో అవకాశం సవరించు

వ్యక్తిగత జీవితం సవరించు

2013 ఫిబ్రవరి 15న ఈమె వివాహం ఒరిస్సా రాష్ట్రం బరంపురంకు చెందిన కృష్ణ చైతన్యతో జరిగింది.[2]

పాడిన పాటలు సవరించు

పాట చిత్రము భాష సంగీత దర్శకుడు సంవత్సరం
నీ చిలిపీ రూల్ తెలుగు జాన్ గాల్ట్ 2016
వెన్నైలైనా చీకటైనా ప్రేమకథా చిత్రమ్ తెలుగు J.B 2013
రామనవమి షిర్డి సాయి (సినిమా) తెలుగు ఎం. ఎం. కీరవాణి 2012
నిన్ను నాలో దాచుకొన్నా ఓ మనసా తెలుగు 2012
అమ్మా అవనీ రాజన్న తెలుగు ఎం. ఎం. కీరవాణి 2011
కల నిజమైతే , ఎవడబ్బ సొమ్మని మా ఊరి మహర్షి తెలుగు 2011
సన్నాయి మోగింది ఝుమ్మందినాదం (సినిమా) తెలుగు ఎం. ఎం. కీరవాణి 2010
"కలలు కావులే", "తలంబ్రాలతో", "ఐదురోజుల పెళ్ళి" వరుడు తెలుగు మణిశర్మ 2010
ఆంటీ అంకుల్ నందగోపాల్ తెలుగు 2010
హాసిని తెలుగు 2010
ఖలేజా (సినిమా) తెలుగు మణిశర్మ 2010
స్వామి మణికంఠ తెలుగు 2010
నీ పలుకులు సరదాగా కాసేపు తెలుగు 2010
నువ్వంటే తాజ్ మహల్ (2010 సినిమా) తెలుగు 2010
మాయగాడు తెలుగు 2010
నన హృదయ కనసల్లి జొతయల్లి కన్నడ 2010
"అడిగుంటుంది ", "అందమేమొ ఇస్తరాకు " డాన్ శీను తెలుగు 2010
ఏం పిల్లో ఏం పిల్లడో ఏం పిల్లో ఏం పిల్లడో తెలుగు 2010
దమ్మున్నోడు తెలుగు 2010
"నువ్వొక " కోతిమూక తెలుగు 2010
యంగ్ ఇండియా తెలుగు 2010
"కన్నులారా చూద్దాము " సింహా (సినిమా) తెలుగు 2010
గిచ్చి గిచ్చి రంగ ది దొంగ తెలుగు 2010
హైస్కూల్ తెలుగు 2010
"మార్చెయ్ మార్చెయ్ " చేతిలో చెయ్యేసి తెలుగు 2010
"బైలేలె బైలేలె పల్లకి " శుభప్రదం తెలుగు 2010
"నెలలు గారు" ఎవరైనా ఎప్పుడైనా తెలుగు 2009
"నీ మీద నాకు " నచ్చావ్ అల్లుడు తెలుగు 2009
ఒరిజినల్ తెలుగు 2009
బొమ్మాలీ బిల్లా తెలుగు మణిశర్మ 2009
ధీర తెలుగు 2009
"ఎవరు లేరని " ఏక్ నిరంజన్ తెలుగు మణిశర్మ 2009
"చిక్క చిక్క " హనీమూన్ ఎక్స్‌ప్రెస్ కన్నడ 2006
"హైలెస్సా" శ్రీరామదాసు (సినిమా) తెలుగు ఎం. ఎం. కీరవాణి 2006
"నీలి " మిస్టర్ ఎర్రబాబు తెలుగు 2005
"నువ్వు నేను కలిసుంటేనే ","ఒక తోటలో " గంగోత్రి (సినిమా) తెలుగు 2003
"గోదావరిలా " చార్మినార్ (సినిమా) తెలుగు 2003

మూలాలు సవరించు

  1. "Vikramarkudu Music Review". India Glitz. June 7, 2006. Archived from the original on 13 జూన్ 2006. Retrieved 10 August 2011.
  2. http://www.news18.com/news/india/playback-singer-malavika-to-marry-krishna-chaitanya-589437.html

బయటి లంకెలు సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=మాళవిక&oldid=3869897" నుండి వెలికితీశారు