నందమూరి తారకరత్న

తెలుగు నటుడు
(తారకరత్న నుండి దారిమార్పు చెందింది)

నందమూరి తారకరత్న (1983, ఫిబ్రవరి 22 - 2023, ఫిబ్రవరి 18) తెలుగు సినిమా నటుడు. తారకరత్న తెలుగు చిత్రసీమలో ప్రముఖ నటుడు ఎన్.టి.రామారావు మనుమడు. తారకరత్న 2001లో ఒకేసారి 9 సినిమాలు మొదలు పెట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.[2]

తారకరత్న
జననం
నందమూరి ఓబులేసు

(1983-02-22) 1983 ఫిబ్రవరి 22 (వయసు 41)
మరణం2023 ఫిబ్రవరి 18(2023-02-18) (వయసు 39)
వృత్తితెలుగు సినిమా నటుడు
క్రియాశీల సంవత్సరాలు2002 - 2023
జీవిత భాగస్వామిఅలేఖ్య రెడ్డి (కాస్ట్యూమ్‌ డిజైనర్‌) (m.2012) [1]
పిల్లలుఇద్దరు కుమార్తెలు (నిషిక), ఒక కుమారుడు
తల్లిదండ్రులునందమూరి మోహన కృష్ణ, సీత
బంధువులునందమూరి తారక రామారావు (తాత)
నందమూరి బాలకృష్ణ (బాబాయ్)
నందమూరి కళ్యాణ్ రామ్ (పెదనాన్న కుమారుడు)
జూ. ఎన్.టి.ఆర్ (పెదనాన్న కుమారుడు)
దగ్గుబాటి పురంధేశ్వరి (మేనత్త)
నారా చంద్రబాబు నాయుడు (మామయ్య)

బాల్యం

మార్చు

తారకరత్న 1983, ఫిబ్రవరి 22న చెన్నైలో జన్మించిన ఆయన నందమూరి మోహన కృష్ణ ఒక్కగానొక్క కుమారుడు.[3] ఆయన తండ్రి సినిమాటోగ్రాఫర్‌ కాగా తల్లి సీత గృహిణి.

విద్యాభ్యాసం

మార్చు

ఏడో తరగతి వరకు చెన్నైలో నందమూరి తారకరత్న చదువుకున్నాడు. ఆ తరవాత హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్‌లో హైస్కూల్‌ విద్యను అభ్యసించాడు. గుంటూరు విజ్ఞాన్‌ కాలేజీలో ఇంటర్‌, హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ పూర్తిచేసాడు.

చిత్రాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర Ref.
2002 ఒకటో నంబర్ కుర్రాడు బాలు
2002 యువరత్న రత్న
2003 తారక్ తారక రామ్
2004 నం శివుడు
2004 భద్రాద్రి రాముడు రాముడు
2006 పకడై మాసి
2009 అమరావతి శ్రీను
2009 వెంకటాద్రి వెంకటాద్రి నాయుడు
2010 ముక్కంటి
2011 నందీశ్వరుడు నందీశ్వరుడు "నందుడు"
2012 విజేత
2012 ఎదురు లేని అలెగ్జాండర్ అలెగ్జాండర్ [4]
2012 చూడాలని చెప్పాలని
2014 మహా భక్త సిరియాల శివ దత్త / సిరియాల [5]
2015 కాకతీయుడు
2016 ఎవరు శేఖర్ [6]
2016 మనమంతా చిత్రకారుడు
2016 రాజా చెయ్యి వేస్తే మాణిక్
2017 కయ్యూం భాయ్
2021 దేవినేని దేవినేని నెహ్రూ
2022 సారధి సారధి
2022 ఎస్5 నో ఎగ్జిట్ సుబ్బు

వెబ్ సిరీస్

మార్చు

పురస్కారాలు

మార్చు

అస్వస్థత

మార్చు

2023 జనవరి 27న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమవగా అందులో పాల్గొన్న తారకరత్న సొమ్మసిల్లి పడిపోయాడు.[9] ఆయనను వెంటనే దగ్గరలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్‌ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షలలో ఆయన గుండెలో ఎడమవైపు 90శాతం బ్లాక్‌ అయిందని గుర్తించారు. మెరుగైన చికిత్సకోసం బెంగళూరు నుంచి నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు అత్యాధునిక వైద్య పరికరాలతో మరునాడు ఇక్కడకు చేరుకుని ఆయనకు చికిత్సను అందించారు.[10]

అయినా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో పీఈఎస్‌ వైద్యకళాశాల ఆస్పత్రి వైద్యులు ముందుగా సూచించినట్టు తారకరత్న భార్య అలేఖ్య నిర్ణయం మేరకు అదేరాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు ప్రముఖ కార్డియాలజిస్టుల పర్యవేక్షణతో కూడిన అత్యాధునిక సదుపాయాలున్న ప్రత్యేక అంబులెన్స్‌లో ఆయనను తరలించారు.[10]

రెండు రోజులపాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స కొనసాగినా ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని, తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన మెలేనా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు.[11]

ఆయన ఆరోగ్య పరిస్థితిపై జనవరి 30న సాయంకాలం ఆసుపత్రి తాజా బులెటిన్ విడుదల చేసింది. ఇందులో ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, వెంటిలేటర్ పైనే ఉన్నాడని డాక్టర్లు వెల్లడించారు.[12]

2023 ఫిబ్రవరి 2 నాటికి నందమూరి తారకరత్న అస్వస్థతకు గురై వారం రోజులు అయింది. ఆయనకు చికిత్స కొనసాగుతోంది. మెదడుకు సంబంధించి చేసిన సిటీ స్కాన్ పరీక్షల రిపోర్టు రాగా మరికొన్ని పరీక్షలు నిర్వహించారు.[13]

2023 ఫిబ్రవరి 3న తిరిగి తారకరత్న మెదడు స్కానింగ్‌ చేశారు. వచ్చే నివేదిక ఆధారంగా మెదడు పనితీరు తెలిసింది. పరిస్థితిని బట్టి ఆయనను విదేశాలకు తరలించేందుకు సిద్ధమయ్యారు.[14]

2023 ఫిబ్రవరి 16న తిరిగి తారకరత్నకు ఎమ్మారై స్కానింగ్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.[15]

22 రోజులుగా నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్యం 2023 ఫిబ్రవరి 18న అత్యంత విషమంగా మారినట్లు వైద్యులు తెలిపారు.[16]

2023 జనవరి 27న గుండెపోటుకు గురియై బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న 39 ఏళ్ళ తారకరత్న 2023 ఫిబ్రవరి 18 మహాశివరాత్రి పర్వదినాన మరణించాడు.

వంశవృక్షం

మార్చు



సూచికలు

మార్చు
  1. Namasthe Telangana (31 January 2023). "సినిమాని తలపించే రేంజ్‌లో తారకరత్న, అలేఖ్య లవ్‌స్టోరీ..!". Archived from the original on 31 January 2023. Retrieved 31 January 2023.
  2. News18 Telugu (27 January 2023). "తారకరత్నకు మాత్రమే సాధ్యమైన ఈ ప్రపంచ రికార్డు తెలుసా." Archived from the original on 27 January 2023. Retrieved 27 January 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Tarakaratna Biography, Tollywood Actor, Family, Tarakaratna Ramarao Filmography, Awards, Tarakaratna Ramarao Profile, Pictures Archived 2012-10-31 at the Wayback Machine. Altiusdirectory.com. Retrieved on 2013-03-07.
  4. "Eduruleni Alexander Movie Review, Trailer, & Show timings at Times of India". The Times of India. Archived from the original on 23 September 2018. Retrieved 2016-08-24.
  5. 'Bhaktha Siriyala' will be milestone in Tarak's career: Film's director- Telugu News- South Cinema-IBNLive Archived 19 అక్టోబరు 2013 at the Wayback Machine. Ibnlive.in.com (2012-11-07). Retrieved on 2013-03-07.
  6. "Evaru Telugu Movie Review | Evaru Movie Review | Evaru Review and Rating | Evaru Cinema Review | Evaru Film Review | Evaru Movie Review in Telugu | Evaru Review in Telugu | Evaru Telugu Review | Evaru First Day TalK | Evaru Review". 26 August 2016.
  7. TV5 News (30 May 2022). "'9 అవర్స్' వెబ్ సిరీస్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది: తారకరత్న, మధు షాలినీ" (in ఇంగ్లీష్). Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. List of Nandi awards for 2009–2010. newsofap.com
  9. "Taraka Ratna: సినీనటుడు తారకరత్నకు అస్వస్థత.. ప్రమాదమేమీ లేదన్న వైద్యులు". web.archive.org. 2023-01-27. Archived from the original on 2023-01-27. Retrieved 2023-01-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  10. 10.0 10.1 "Taraka Ratna: తారకరత్న హెల్త్‌ అప్‌డేట్‌.. కుప్పం నుంచి బెంగళూరుకు తరలింపు". web.archive.org. 2023-01-28. Archived from the original on 2023-01-28. Retrieved 2023-01-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  11. "అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం". Archived from the original on 2023-01-29. Retrieved 2023-01-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  12. "Actor Nandamuri Tarakaratna Health Condition Is Critical - Sakshi". web.archive.org. 2023-01-30. Archived from the original on 2023-01-30. Retrieved 2023-01-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  13. "Nandamuri Taraka Ratna slowly getting better, but still on ventilator | Telugu Movie News - Times of India". web.archive.org. 2023-02-03. Archived from the original on 2023-02-03. Retrieved 2023-02-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  14. "Tarakaratna: తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే యోచనలో కుటుంబ సభ్యులు: లక్ష్మీనారాయణ". EENADU. Archived from the original on 2023-02-04. Retrieved 2023-02-04.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  15. "Taraka Ratna: తారకరత్న లేటెస్ట్‌ హెల్త్‌ అప్‌డేట్‌.. ఏ ట్రీట్‌మెంట్‌ జరుగుతోందంటే?". web.archive.org. 2023-02-17. Archived from the original on 2023-02-17. Retrieved 2023-02-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  16. "Taraka Ratna: తారకరత్న హెల్త్‌ అప్‌డేట్‌.. ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం". web.archive.org. 2023-02-18. Archived from the original on 2023-02-18. Retrieved 2023-02-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

యితర లింకులు

మార్చు