ఎనుముల సావిత్రీదేవి

'ఎనుముల సావిత్రీదేవి' ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక రాజకీయ నాయకురాలు. ఈమె తూర్పు గోదావరి జిల్లా నుండి ఎంపిక కాబడిన తొలి మహిళా శాసనమండలి సభ్యురాలు.[1]

ఎనుముల సావిత్రీదేవి
ఆంధ్రప్రదేశ్ శాసనమందలి
In office
1972–1979
శాసనమండలి సభ్యురాలు
వ్యక్తిగత వివరాలు
మరణం2014 అక్టోబరు 17
కాకినాడ
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:Flag of the Indian National Congress.svg

నేపధ్యము మార్చు

ఒడిశాలోని బెర్హంపూర్‌కు చెందిన ఆమె 1941 ప్రాంతంలో జిల్లాలోని ప్రత్తిపాడు ప్రాంతానికి చెందిన రాజా ఎనుముల వెంకట నరసింహారావును వివాహం చేసుకున్నారు. ఆమె తండ్రి రావు బహద్దూర్ నెట్టిమి రామ్మూర్తినాయుడు గంజాం జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. హిందీ, ఆంగ్లభాషల్లో మంచి ప్రావీణ్యం కలిగిన సావిత్రీదేవికి మొదటి నుంచి విద్యపై మక్కువ ఉండేది. వివాహంతో జిల్లాకు వచ్చాక ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఒకప్పుడు పీసీసీ అధ్యక్షునిగా, మంత్రిగా పనిచేసిన మల్లిపూడి పళ్లంరాజు కు ఆమె సమీప బంధువు.

ఆమె సమర్థతను, ఆసక్తిని గమనించిన అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు 1972లో శాసనమండలి సభ్యురాలుగా చేశారు. కమ్యూనిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి మద్దతుదారురాగా నిలిచారు. కొందరు మహిళా ప్రముఖులతో కలిసి అన్నవరం సత్యవతీదేవి మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించారు. కాకినాడ మహిళా సూపర్‌బజార్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. లేడీస్‌క్లబ్ ఏర్పాటులోనూ ఆమె కృషి ఎనలేనిది. గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్ గౌరవ కార్యదర్శిగా, ఎగ్జిబిషన్ సొసైటీ సంయుక్త కార్యదర్శిగా, కన్స్యూమర్ కౌన్సిల్ సభ్యురాలిగా, జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షురాలిగా, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1980 ప్రాంతంలో పంతం పద్మనాభం దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అన్నవరం దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యురాలిగా పనిచేశారు.

మరణము మార్చు

కాకినాడలో కుమారుడైన రిటైర్డ్ ప్రొఫెసర్ మెహర్‌ ప్రకాష్ ఇంట ఉంటున్న ఆమె వృద్ధాప్యం కారణంగా 2014 అక్టోబరు 17న శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "జిల్లాలో తొలి మహిళా ఎమ్మెల్సీ సావిత్రీదేవి కన్నుమూత". Sakshi. 2014-10-19. Retrieved 2023-01-29.

బయటి లంకెలు మార్చు