ఎన్.గోపాలకృష్ణ తెలుగు సినిమా దర్శకులు, రచయిత. ఆయన లక్ష్మణరేఖ అనే తెలుగు సినిమా ద్వారానే అందరికీ సుపరిచితులు. వివిధ అంశాలపై పలు గ్రంథాలను వెలువరించిన ఆయన ఋషుల గురించి రాసిన గ్రంథం చాలా విలువైనది.[1]

జీవిత విశేషాలు మార్చు

ఆయనది తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట గ్రామం. ఆయన అక్టోబరు 27, 1942 న తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం లో జన్మించారు. ఆయన తండ్రి ఉపాధ్యాయునిగా పనిచేసేవారు. ఆయన ఇంటర్మీడియట్ అమలాపురం లోనూ, బి.ఎస్.సి రాజమండ్రి లో చేసారు. ఆయనకు ఉన్నత పాఠశాలలో చదివేటప్పుడే నాటకాలపై అభిరుచి ఉండేది. సినిమాలపై కూడా ఆసక్తి ఉండేది. క్రమంగ సినిమా మేకింగ్ పైన, నటన పైనా ఆయనకు ఆసక్తి పెరిగింది. ఆయన ఆసక్తిని గమనించిన ఆయన స్నేహితుడు "దంతవేదాంతం" అనే నాటకంలో స్త్రీ పాత్ర వేయమని సలహా యిచ్చారు. ఆయన ఆ పాత్రలో మొట్టమొదట నటించారు. అది సక్సెస్ కావడంతో "బెస్ట్ హీరోయిన్ ఆఫ్ ది కాలేజ్" అనే అవార్డు ఆయనకు వచ్చింది.[2]

సినీరంగ ప్రవేశం మార్చు

ఆయన కళాశాల హాస్టల్ లో ఉన్నప్పుడు అదే హాస్టల్ లో ఉన్న చంద్రమోహన్ తో స్నేహం ఏర్పడింది. చంద్రమోహన్ ఆడవేషాలు వేయమని అడిగేవాడు. గోపాలకృష్ణ ఆడవేషాలు వేస్తే దానికే తరువాత పరిమితమయిపోతారనే భయంతో తరువాత ఆడ వేషాలకు ఒప్పుకోలేదు. నాటకాలలో పేరు రావడంతో సినిమాలలో ట్రై చేయ్యమని మిత్రులు సలహాలు ఇస్తూ ఉండడంతో ఆయన సెకండ్ యియర్ పూర్తి కాకుండానే చెన్నై వెళ్ళిపోయారు. అద్దార నారాయణరావు అనే హాస్యనటుడు ఆయనకు దూరపు చుట్టం. ఆయన ద్వారా రాజబాబు తో పరిచయం జరిగింది. అద్దార నారాయణ రావు గారు డిగ్రీ పూర్తి అయిన తర్వాత వస్తే అవకాశాలు చూడవచ్చని సలహా యివ్వడంతో మరలా కళాశాలలో చేరి మూడవ సంవత్సరం కూడా పూర్తిచేసారు. తరువాత మరలా చెన్నై వెళ్ళి నారాయణరావుని కలిసారు. ఆయన ఆసక్తిని గమనించిన ఆయన దర్శకత్వ శాఖలో చేరమని సలహా యిచ్చాడు. ఆయన దర్శకుడు తాపీ చాణక్య వద్ద అప్రంటిస్ గా అవకాశం వచ్చేటట్లు చేసారు. "వారసత్వం" సినిమా పూర్తి కావడంతో చాణక్య గారి వద్ద సినిమాలు లేకపోవడంతో ఆయన దర్శకుడు వి. మధుసూదనరావు దగ్గర చేరారు. "వీరాభిమన్యు" చిత్రంలో పనిచేసారు. వీరాభిమన్యు చిత్రం తరువాత మధుసూధనరావు దగ్గర మంచికుటుంబం, ఆస్తిపరులు, లక్ష్మీనివాసం, తదితర చిత్రాలకు పనిచేసారు. ఆ తరువాత ఆయన కమలాకర కామేశ్వరరావు, డి,యోగానంద్, కె.విశ్వనాథ్, వరప్రసారరావు, వంటి చాలా మంది దర్శకుల దగ్గర 14 సంవత్సరాలపాటు అసోసియేట్ దర్శకునిగ పనిచేసారు. ఎన్.టి రామారావుతో ఎక్కువగా చిత్రాలలో పనిచేయడం వలన ఆయనతో ఎక్కువగా గోపాలకృష్ణ గారికి సన్నిహిత్యం లభించింది.[2]

 
లక్ష్మణ రేఖ (1975 సినిమా)

దర్శకునిగా మార్చు

తెలుగులో ఎన్.గోపాలకృష్ణ (లక్ష్మణరేఖ గోపాలకృష్ణ) దర్శకత్వంలో వెలువడిన తొలి చిత్రం ‘లక్ష్మణ రేఖ’ జయసుధ కు కూడా తొలి చిత్రమే. అది 1975లో ఆయనకు గుర్తింపు తెచ్చేలా చేసింది. [3] ఆయన మొదటి చిత్రం 'లక్ష్మణరేఖ' కావడంతో అందరూ ఆయనని 'లక్ష్మణరేఖ గోపాలకృష్ణ' అని పిలిచేవారు.[4]

దర్శకత్వం వహించిన చిత్రాలు:

స్వర్గానికినిచ్చెనలు - 1977

మరో సీత కథ – 1979

బలేకాపురం – 1980

చిన్నారిచిట్టిబాబు – 1980

పార్వతి మళ్లీ పుట్టిం ది– 1981

రాజస్థాన్ రౌడీలు – 1982

ఫిలింస్టార్ – 1983

బలే అమ్మాయిలు – 1996

అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2015 మార్చు

లక్ష్మణరేఖ గోపాలకృష్ణ రూపొందించిన గ్లోబల్‌ ఫిలిం ఫ్రటెర్నిటి ప్రపంచ సినిమా జెండాను ప్రెంచ్‌ దర్శకులు గెేబ్రిలీ బ్రిన్‌ ఎన్‌ విడుదల చేసి రూపకర్త గోపాలకృష్ణను అభినందించారు. తనతో ఈ జెండాను తీసుకొని వెడతానని ప్యారిస్‌లో ప్రదర్శిస్తామని అన్నారు. అలాగే గోపాలకృష్ణ రచించిన గాన, స్వర మాంత్రికులు సంగీత దర్శకులు గాయకులపై రచించిన పుస్తకాన్ని ఓపెన్‌ ఫోరమ్‌లో ఇంటర్నేషనల్‌ ఫిలింఫెస్టివల్‌ డైరెక్టర్‌ సెంథిల్‌ రాజన్‌ విడుదల చేశారు. తెలుగు పుస్తకం ‘ఇఫి’లో విడుదల చేయడం గొప్ప విషయమని రచయితను అభినందించారు.[5]

 • లక్ష్మణరేఖ గోపాలకృష్ణ రూపొందించిన గ్లోబల్‌ ఫిలిం ఫ్రటెర్నిటి ప్రపంచ సినిమా జెండాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ( TELUGU BOOK OF RECORDS ) గుర్తింపు వివరాలకు వెబ్ సైట్ లో చూడగలరు :
 • http://www.telugubookofrecords.com/home/first-to-design-a-flag-for-the-world-cinema/

రచనలు మార్చు

 • మనఋషులు
 • రఘుపతి వెంకయ్య సినీవారసులు [6]
 • బాలల హక్కులు
 • బాల సంజీవని
 • గరుత్మంతుడు - హన్మంతుడు
 • మన ఋషులు
 • తస్మాత్ జాగ్రత్త
 • గోమాత ప్రగప్రతికిచేయూత
 • గోగీత
 • గో విలాపం
 • వందేగోమాతరం,
 • గోసంహిత
 • గోమాత వైభవం
 • విజ్ఞాన శాస్త్రం
 • మోక్షమార్గం
 • బాల విజ్ఞాన సర్వస్వం
 • ధర్మప్రవే ప్రశిక - శుభప్రదం ప్ర (టి.టి.డి.పాఠాలు)
 • శాకాహారం - మాంసాహారం
 • గరుత్మంతుడు – హనుమంతుడు
 • గోగీతామృతం పురాణాలలో గోమాత కథలు
 • భారత కీర్తిత్రయం త్ర మహిళా స్వాతంత్ర్య సమరయోధులు
 • ఎన్. గోపాలకృష్ణ (లక్ష్మణరేఖ) రచించిన సినిమా గ్రం థాలు:
 • Pioneers of Indian Cinema – 2011
 • Birth of Cinema - 2013.
 • భారతీయ సినిమా మహనీయులు – 2014
 • తెలుగు సినిమా (1961-2011) - 2011
 • కె.బి. తిలక్ – 2018 (శ్రేయోశ్రే భిలాషి)
 • రఘుపతి వెంకయ్య సినీ వారసులు -2013
 • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీతలు – 2011
 • వెండితెర వెనుక నవ్వించే నటవీరులు
 • స్వర గాన మాంత్రికులు
 • అవార్డ్స్ (AWARDS):
 • దాదాసాహెల్ ఫాల్కే అకాడమీ ముంబాయి పురస్కారం జ్యూరీమెంబర్
 • సాహిత్యశ్రీ : అఖిల భారత భాషా సాహిత్య సమ్మేళన్- భూపాల్
 • భారత భాషాభూషణ్: అఖిల భారత భాషా సమ్మేళన్ - భూపాల్
 • AP Govt. Tax Exemption Film ‘Bhale Ammayilu’ (Telugu Film)
 • Delegate to International Film Festivals of India, Goa (From 2003 to 2015)
 • AP Film 2004 నంది అవార్డు
 • పింగళి వెంకయ్య అవార్డు
 • ఎన్.టి.ర్ అవార్డు
 • అవయవదానం - Anakapally Film Society Award
 • 2006 తెలుగు చలనచిత్ర వత్ర జ్రోత్సవం
 • 2006 Digital Films Fourm (For India) Award – Kaamadhenu
 • 2006 Suchitra Banglore International Film Festival Kaamadhenu
 • 2006 Children Film Society of India Kaamadhenu Short Film Golden Jubilee Film Festival Kaamadhenu Short Film
 • 2007 Hyderabad International Film Festival - Kaamadhenu Documentary Film
 • 2007 IFFC Award Kaamadhenu Documentary Film
 • 2009 CMS International Film Festival – Bharat Keerthi Moorthulu (Doc. Film.) YSR నాటక పోటీలు 2010.
 • 2012 Vatavaran Film Award
 • SICA Awards 2010, 2011, 2012
 • NTR AWARD 2013
 • International Children Film Festival - 2013
 • Save Temples.org. International Film Festival
 • 2014 (Chairman) 2014 Jyoti Rao Phule Seva Ratna Award At Delhi
 • 2017 Shanti Bharat – Sikharam Arts Theaters, Hyderabad. Award Presented at Delhi.
 • 2017 ప్రపం ప్ర చ తెలుగు మహాసభలు నందినాటక సప్తాహం కమిటీ.
 • 1999 తెలుగు ఆంధ్రప్రధ్రదే ప్రశ్ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ జర్నల్ (ఎడిటర్ & పబ్లిషర్)
 • సౌత్ ఇండియన్ సినీ టెక్నీషియన్స్ అసోసియేషన్ - మాజీ ఎడిటర్ & పబ్లిషర్.
 • పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ– హైదరాబాద్ – గెస్ట్ ఫ్యాకల్టీ
 • డా॥ డి. రామానాయుడు ఫిలిం ఇనిస్టిట్యూట్ – హైదరాబాద్ – గెస్ట్ ఫ్యాకల్టీ ఫౌండర్ (Foundar) టి.వి. & ఫిలిం ఇనిస్టిట్యూట్ ఆఫ్ భాగ్యనగర్ - ప్రిన్సిపాల్, నిర్వహణ. ఆంధ్రప్రధ్రదే ప్రశ్ ఫిలిం, టి.వి. డ్రామా కార్పోరేషన్ - పానల్ ప్రొడ్యూసర్.
 • ఫౌండర్ రఘుపతి వెంకయ్య అకాడమీ సెక్రెటరీ అఖిల భారత భాషా సాహిత్య సమ్మేళన్ - మాజీ అధ్యక్షులు (ఆంధ్రప్రధ్రదే ప్రశ్)
 • ETV - మాజీ సీనియర్ నిర్మాత
 • AIR - రచయిత (ప్రోగ్రామ్స్, నాటికలు), ప్రెజంటర్.
 • Door Darshan Kendra - ఇంటర్వ్యూలు

 • నంది అవార్డులు పొందిన లఘుచిత్రాలు (ఆంధ్రప్రధ్రదే ప్రశ్ ప్రభు ప్ర త్వం):
 • కామధేను - 2008
 • ఫ్రీడమ్ పార్క్- 2010
 • అవయవదానం - 2011
 • పర్యావరణ పరిరక్షణ - మన బాధ్యత 2013 (Pollution Control – Citizens Responsibility (English)
 • స్వఛ్ భారత్ (Swatcha Bharat)
 • భారత కీర్తిమూర్తులు 2013 (Pride of India)
 • రక్తదానం గోతులాభారం
 • కల్పవృక్షం

SPL. AWARDS:

AP Govt. Tax Exemption Film 'Bhale Ammayilu' (Telugu Film)

Delegate to International Film Festivals of India, Goa (From 2003 to 2015).

మూలాలు మార్చు

 1. మన ఋషులు(Mana Rushulu) By Lakshmana Rekha N. Gopalakrishna - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2017-09-09. Retrieved 2017-11-17.
 2. 2.0 2.1 సినిమాలో హీరోగా నటించాలనుకున్నాను- ఎన్.గోపాలకృష్ణ - నవ్య మ్యాగజైన్ - 30 మే 2012[permanent dead link]
 3. "My article about జయసుధ 22-5 -1016న హరివిల్ లు (మన తెలం గాణా". Vskesavarao's Blog (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-08-01. Retrieved 2017-11-17.
 4. "అదే రాజబాబు గొప్పతనం!." ap7am.com. Retrieved 2017-11-17.[permanent dead link]
 5. "అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2015 | Telangana Magazine". magazine.telangana.gov.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2017-11-17.
 6. రఘుపతి వెంకయ్య - సినీ వారసులు(Raghupathi Venkaiah Cine Varasulu) By Lakshmana Rekha N. Gopalakrishna - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige.[permanent dead link]

ఇతర లింకులు మార్చు