ఎన్. గోపి
ఆచార్య ఎన్. గోపి (జ. జూన్ 25, 1950) తెలుగు పండితుడు, కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగానికి అధ్యక్షుడిగాను, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపసంచాలకునిగాను పనిచేశాడు. నాలుగు ఫంక్తులు మొత్తం 20 నుండి 25 అక్షరాలతో సాగే నానీలు అనే సూక్ష్మ కవితా పద్ధతిని తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టాడు.[1][2]
ఆచార్య ఎన్.గోపి | |
---|---|
![]() | |
జననం | ఎన్.గోపాల్ 1950 జూన్ 25 |
ఇతర పేర్లు | ఎన్.గోపాల్ |
వృత్తి | ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగానికి పూర్వపు అధ్యక్షుడు , పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపసంచాలకులు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలుగు పండితుడు, కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత |
జీవిత భాగస్వామి | ఎన్. అరుణ |
గోపి జూన్ 25, 1950లో యాదాద్రి - భువనగిరి జిల్లా భువనగిరిలో జన్మించాడు.[3] ఈయన పూర్తిపేరు ఎన్.గోపాల్.[4] అధ్యాపక వృత్తిలో చాలా ఏళ్లు పనిచేశాడు. ఇతని భార్య ఎన్.అరుణ కుడా పేరు పొందిన కవయిత్రి. పదవీ విరమణ చేసేటప్పడికి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగంలో డీన్ గా పనిచేశాడు. గోపీ దాదాపు ముప్ఫై పుస్తకాలు దాకా ప్రచురించాడు. అందులో 11 కవితా సంకలనాలు కూడా ఉన్నాయి.
రచనలుసవరించు
- కవిత్వం
- తంగేడుపూలు (1976)
- మైలురాయి (1982)
- చిత్రదీపాలు (1989)
- వంతెన (1993)
- కాలాన్ని నిద్రపోనివ్వను (1998)
- చుట్టకుదురు (2000)
- ఎండపొడ (2002)
- జలగీతం (2002) - దీర్ఘకావ్యం
- నానీలు (2002)
- మరో ఆకాశం (2004)
- అక్షరాల్లో దగ్ధమై (2005)
- మళ్ళీ విత్తనంలోకి (2014)
- విమర్శనా గ్రంథాలు
- వేమన (1980)
- వేమనవాదం (1979)
- వ్యాసనవమి (1987)
- వేమన పద్యాలు - పారిస్ ప్రతి (1990)
- జ్ఞానదేవుడు
- గవాక్షం (1995)
- సాలోచన-పీఠికలు (1989)
- నిలువెత్తు తెలుగుసంతకం సినారె వ్యక్తిత్వం
ఇవేకాక నాలుగు యాత్రాగ్రంథాలు (ట్రావెలాగ్లు), అనేక అనువాదాలు
పురస్కారాలుసవరించు
- తంగెడు పూలు కవితా సంపుటికి 1980లో కృష్ణశాస్త్రి అవార్డు
- మైలురాయి కవితాసంపుటికి 1982లో ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం
- మైలురాయికి తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం
- చిత్రదీపాలు కవితాసంపుటికి సినారె కవితాపురస్కారం
- చిత్రదీపాలు కవితాసంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమకవితాసంపుటి బహుమతి (1990)
- 2006 సంవత్సరానికి సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి శివానంద ఉత్తమ సిటిజన్ అవార్డ్
- దాశరథి సాహితీ పురస్కారం (2017) - తెలంగాణ ప్రభుత్వం[5]
మూలాలుసవరించు
- ↑ Short Poems By Jean Elizabeth Ward పేజీ.3
- ↑ "ఈనాడు సాహిత్యంలో నానీలపై డాక్టర్ మణిగోపాల్ వ్యాసం". Archived from the original on 2010-06-12. Retrieved 2009-03-28.
- ↑ http://www.museindia.com/showauth12.asp?id=771[permanent dead link]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-06-12. Retrieved 2009-10-18.
- ↑ Telangana Today (22 July 2017). "Acclaimed poet Gopi conferred with Dasarathi Sahiti Puraskar". Archived from the original on 27 July 2018. Retrieved 27 July 2018.