ఎమీ జాక్సన్ (జననం 31 జనవరి 1992)[3][4] బ్రిటన్ కు చెందిన భారతీయ మోడల్, నటి. ఆమె తమిళ,హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది.[5][6] ఆమె తన 16వ ఏటనే మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 2009లో మిస్ టీన్ వరల్డ్ గానూ, 2010లో మిల్ లివర్ పూల్ గానూ నిలిచింది ఎమీ. ఆ తరువాత తమిళ సినీ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ 2010లో తీసిన తమిళ చిత్రం మద్రాసపట్టిణంలో కథానాయిక పాత్రకు ఈమెను ఎంపిక చేశాడు. అలా ఎమీ లండన్ లో మోడల్ గా కెరీర్ కొనసాగిస్తున్న సమయంలోనే, భారత్ లో వివిధ భాషల్లోని సినిమాల్లో నటించడం ప్రారంభించింది. 2012లో  ఆమె నటించిన మొదటి బాలీవుడ్ సినిమా ఏక్ దీవానా థా విడుదలైంది.[7] అదే ఏడాది ఆమె మొదటి తెలుగు సినిమా ఎవడు (సినిమా) విడుదలైంది. ఆ తరువాత 2015లో ఎమీ ప్రభుదేవా దర్శకత్వంలో,అక్షయ్ కుమార్ నటించిన సింగ్ ఈజ్ బ్లింగ్ సినిమాలో నటించింది.

ఎమీ జాక్సన్
అమీ జాక్సన్ 'తాండవం' సంగీత విడుదల సమయంలో.
జననం
ఎమీ లొయిస్ జాక్సన్

(1992-01-31) 1992 జనవరి 31 (వయసు 32)[1]
డౌగ్లస్ , ఐసల్ ఆఫ్ మ్యాన్
వృత్తి
  • నటి
  • ప్రచారకర్త
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం
జీవిత భాగస్వామిఎడ్ వెస్ట్‌విక్ (m. 2024)
తల్లిదండ్రులు
  • అలెన్ జాక్సన్
  • మార్గరెటా జాక్సన్

తొలినాళ్ళ జీవితం, కెరీర్

మార్చు

ఐరిష్ సముద్రం మధ్యలోని ఐస్లే ఆఫ్ మాన్ అనే ద్వీపంలో జన్మించింది ఎమీ. ఆమె తల్లిదండ్రులు బ్రిటీష్ క్రిస్టియన్స్. ఆమె తండ్రి అలన్ జక్సన్, తల్లి మార్గరీటా జాక్సన్. ఆమె అక్క అలిసియా జాక్సన్. ఎమీ జన్మించిన రెండేళ్ళకే వారి కుటుంబం లివర్ పూల్ లోని వూల్టన్ లో వారి స్వంత ఇంటికి మారిపోయింది. ఆమె తండ్రి బిబిసి రేడియో మెర్సిసిడ్ కు నిర్మాత. తన మీడియా కెరీర్ ను కొనసాగించేందుకే లివర్ పూల్ కు మకాం మార్చాల్సి వచ్చింది. సెయింట్ ఎడ్వర్డ్స్ కళాశాలలో చదువుకొంది ఎమీ. ఆ తరువాత ఆంగ్ల భాష, ఆంగ్ల సాహిత్యం, తత్త్వ శాస్త్రం, నీతి శాస్త్రం చదువుకునేందుకు ఆరవ ఫారంలో చేరింది ఎమీ.[8][9][10]

వ్యక్తిగత జీవితం

మార్చు

2024 జనవరి 29న, ఆంగ్ల నటుడు ఎడ్ వెస్ట్‌విక్ తో ఆమె నిశ్చితార్థం జరిగింది.[11] వారు 2024 ఆగస్టు 25న వివాహం చేసుకున్నారు.[12]

నటించిన చిత్రాలు

మార్చు
సూచిక
ఇంకా విడుదలైన సినిమాలను సూచిస్తుంది

చలన చిత్రాలు

సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు
2010 మదరాసపట్టినమ్ ఎమి విల్కిన్సన్ తమిళం తెలుగులో 1947 ఏ లవ్ స్టోరీగా అనువాదమైంది
2012 ఎక్ దీవానా థా జెసీ తెక్కుట్టు హిందీ
తాండవం సారా వినాయగమ్ తమిళం తెలుగులో శివ తాండవంగా అనువాదమైంది
2014 ఎవడు శ్రుతి తెలుగు
2015 ఐ మనోహరుడు దియా తమిళం తెలుగులో అదే పెరుతో అనువాదమైంది
సింగ్ ఈస్ బ్లింగ్ సారా రాణ హిందీ
తంగ మగన్ హేమా డిసౌజా తమిళం తెలుగులో నవ మన్మదుడుగా అనువాదమైంది
2016 గెత్తు నందిని రామానుజం తమిళం
తెఱి అన్నీ తమిళం తెలుగులో పొలిసోడుగా అనువాదమైంది
ఫ్రికీ అలి మేఘా హిందీ
దేవి జన్నిఫర్ తమిళం "చల్ మార్" పాటలో ప్రత్యేక ప్రదర్శన
అభినేత్రి తెలుగు
తూతక్ తూతక్ తూతియా హిందీ
2018 2.0 తమిళం

హిందీ

ది విలన్ ఇంకా ప్రకటించలేదు కన్నడ చిత్రీకరణ జరుగుతుంది
బూగి మ్యాన్ నిమిషా ఆంగ్లం
2024 మిషన్: చాప్టర్ 1 సాండ్రా జేమ్స్
క్రాక్ ప్యాట్రిసియా నోవాక్ హిందీ

బుల్లితెర

సంవత్సరం ధారావాహిక పాత్ర ఇతర వివరాలు
2017- ప్రస్తుతం సూపర్ గర్ల్ ఇమ్రా అర్దీన్ [13]

మూలాలు

మార్చు
  1. "Amy Jackson buys a home in Rajinikanth's hometown, Chennai - Mumbai Mirror". Mumbai Mirror. Archived from the original on 8 అక్టోబరు 2017. Retrieved 8 అక్టోబరు 2017.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 13 జూన్ 2018. Retrieved 8 జూన్ 2018.
  3. "Amy was born today..." www.behindwoods.com. Retrieved 29 జనవరి 2023.
  4. "Amy Jackson to star opposite Akshay Kumar in 'Singh Is Bling' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 29 జనవరి 2023.
  5. "From Liverpool to Bollywood". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 28 మార్చి 2015. Retrieved 29 జనవరి 2023.
  6. "Amy Jackson on starring in Ekk Deewana Tha". BBC. Retrieved 25 ఫిబ్రవరి 2012.
  7. "Amy Jackson is Britain's Bollywood babe". The Sun. London. Retrieved 25 ఫిబ్రవరి 2012.
  8. "Prateik's the sweetest and most caring guy: Amy Jackson". The Times of India. Retrieved 21 జనవరి 2015.
  9. "About Amy". Amy Louise Jackson. Archived from the original on 11 నవంబరు 2010. Retrieved 21 ఆగస్టు 2010.
  10. Sharma, Mukul Kumar (31 జనవరి 2012). "Amy Jackson Biography, Height, Movies and Details". Bollygraph. Retrieved 17 ఫిబ్రవరి 2012.
  11. "Amy Jackson announces engagement with Gossip Girl star Ed Westwick. See dreamy pics from the proposal". Hindustan Times (in ఇంగ్లీష్). 29 జనవరి 2024. Retrieved 29 జనవరి 2024.
  12. "లవ్‌బర్డ్స్‌ కొత్త ప్రయాణం: సిగ్గులమొగ్గైన కొత్త పెళ్లికూతురు అమీ | long time lovebirds AmyJackson and Ed Westwick married now | Sakshi". web.archive.org. 26 ఆగస్టు 2024. Archived from the original on 26 ఆగస్టు 2024. Retrieved 26 ఆగస్టు 2024.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  13. Petski, Denise (25 సెప్టెంబరు 2017). "'Supergirl': Bollywood Actress Amy Jackson To Recur As Saturn Girl". Deadline (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 21 ఫిబ్రవరి 2018.