యర్రగుంట్ల
యర్రగుంట్ల (యెర్రగుంట్ల, ఎర్రగుంట్ల), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన పట్టణం, అదేపేరుగల మండలానికి కేంద్రం. ఇది సిమెంట్ ఫ్యాక్టరీలకు ప్రసిద్ధి చెందింది. ఇది జిల్లా కేంద్రమైన కడపకు వాయవ్యంగా 40 కి.మీ. దూరంలో వుంది.
పట్టణం | |
Coordinates: 14°36′N 78°30′E / 14.6°N 78.5°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్ఆర్ జిల్లా |
మండలం | యర్రగుంట్ల మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 5.32 కి.మీ2 (2.05 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 32,574 |
• జనసాంద్రత | 6,100/కి.మీ2 (16,000/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 967 |
ప్రాంతపు కోడ్ | +91 ( 08563 ) |
పిన్(PIN) | 516309 |
Website |
జనగణన గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం యర్రగుంట్ల పట్టణ పరిధిలో మొత్తం 7,957 కుటుంబాలు నివసిస్తున్నాయి. యెర్రగుంట్ల మొత్తం జనాభా 32,574, అందులో 16,558 మంది పురుషులు కాగా,16,016 మంది మహిళలు ఉన్నారు. యెర్రగుంట్ల సగటు సెక్స్ నిష్పత్తి 967. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 3754 మంది ఉన్నారు. ఇది మొత్తం జనాభాలో 12% గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 1963 మగ పిల్లలు కాగా, 1791 మంది ఆడ పిల్లలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం బాలల లింగ నిష్పత్తి 912 గా ఉంది. ఇది రాష్ట్ర సగటు సెక్స్ నిష్పత్తి (967) కన్నా తక్కువ. అక్షరాస్యత రేటు 70.6% గా ఉంది. ఉమ్మడి వైయస్ఆర్ జిల్లా అక్షరాస్యత 67.3% తో పోల్చగా, యెర్రగుంట్ల అక్షరాస్యత ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత రేటు 80.19% ఉండగా, స్త్రీల అక్షరాస్యత రేటు 60.67% గా ఉంది.[2]
పరిపాలన
మార్చుయర్రగుంట్ల నగరపంచాయితీ పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణా సౌకర్యం
మార్చుజాతీయ రహదారి 716 ఈ పట్టణంగుండా పోతుంది. యర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషను, నంద్యాల - యర్రగుంట్ల విభాగానికి, గుంతకల్లు - చెన్నై ఎగ్మోర్ విభాగానికి ఒక జంక్షన్. ఇది గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుంది. డివిజన్‌లోని 'డి'-కేటగిరీ ఉన్న స్టేషన్‌లో ఇది ఒకటి.[3]
పరిశ్రమలు
మార్చు- ఇండియా సిమెంట్స్ - యర్రగుంట్ల
- ఇండియా సిమెంట్స్ - చిలమకూరు
- జువారీ సిమెంట్స్ (ప్రస్తుతం ఇటలీ సిమెంట్ గ్రూప్)
- భారతీ సిమెంట్స్
ప్రత్యేకం
మార్చుఇది కాక నాప రాయి పరిశ్రమకు ప్రసిద్ధి. ఒక థర్మల్ పవర్ స్టేషను కూడా ఉంది.
ప్రధాన వృత్తి
మార్చుఇక్కడ వ్యవసాయం మెట్ట వ్యవసాయం
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
- ↑ "Yerraguntla Population, Caste Data YSR Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-06-25. Retrieved 2020-06-30.
- ↑ https://www.thehindu.com/news/cities/Vijayawada/Nandyal-Yerranguntla-rail-line-commissioned/article14586839.ece