ఎర్ర జిల్లేడు
ఎర్ర జిల్లేడు | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Subfamily: | |
Genus: | |
Species: | C. gigantea
|
Binomial name | |
Calotropis gigantea |
ఎర్ర జిల్లేడు Calotropis gigantea (Crown flower) కెలోట్రోపిస్ (Calotropis) లోని ఒక జాతి మొక్క. ఇవి ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, శ్రీలంక, భారతదేశం, చైనా దేశాలకు చెందినది.[3]
చరిత్ర
మార్చుప్ర పంచవ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతాల్లో విస్తృతంగా సాగు చేయబడుతోంది. దీని 8-15 'పొడవు వరకు పెరుగుతుంది. ఎర్ర జిల్లేడు పువ్వులు తెలుపు . వంకాయ , ఊదా రంగులలో చాలా అరుదుగా ఏర్పడతాయి. ఉష్ణ మండల ప్రాంతాలలో 1000 మీటర్ల ఎటువరకు పెరుగుదల కనిపిస్తుంది . ఒక విధం గా చెప్పాలంటే సముద్ర తీరమంలో తోట కోసం మొక్కలుగా ఉపయోగిస్తుంటారు . అన్ని నెలల్లో పండుతుంది . మొక్కలు మాత్రం ఇసుక నేలలో ఎక్కువ గా పెరుగుతాయి అని చెప్పవచ్చును . ఎర్ర జిల్లేడు పువ్వులు సంవత్సర మొత్తములో కనిపించగలవు. ఎక్కువగా ఎండాకాలం లో మనము చూస్తాము. మందపాటి ఆకులు,చిన్న ఊదా, తెలుపు పువ్వులతో లేత ఆకుపచ్చ మొక్కను గమనించవచ్చు. కొందరు వీటిని మతపరమైన ప్రయోజనాల కోసం ఈ మొక్కను తమ ఇళ్ల ముందు పెంచుతారు. ఈ మొక్కను కలోట్రోపిస్ అని పిలుస్తారు. కలోట్రోపిస్ మొక్క యొక్క ఆకును తీసినప్పుడు పాలు బయటకు వస్తాయి . అందువల్ల ఈ మొక్కలకు మిల్క్వీడ్స్ అని పేరు పెట్టారు. ప్రపంచంలోని అన్ని రకాల పువ్వులలో చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అన్ని పువ్వులు మగ , ఆడ భాగాలను కలిగి ఉంటాయి. మగ భాగాన్ని కేసరం అని పిలుస్తారు, దీనిలో పొడవైన కొమ్మ ఉంటుంది, దానిపై చిన్న గుళిక జతచేయబడుతుంది. ఈ గుళికను పుట్టగా పిలుస్తారు. పుప్పొడి ధాన్యాలను కలిగి ఉంటాయి వీటిని మగ కణాలు అని పిలుస్తారు . పువ్వు యొక్క ఆడ భాగాన్ని పిస్టిల్ అని పిలుస్తారు, ఒక గొట్టాన్ని కలిగి ఉంటుంది, దీనిని స్టైల్ అని పిలుస్తారు ఇతర పువ్వులలో మగ, ఆడ భాగాలు వేరుగా ఉంటాయి. ఎర్ర జిల్లేడు ను హిందీలో ఆక్, తమిళంలో యెరుక్కు, కన్నడలో అర్కాగిడా, తెలుగులో జిల్లెడు అని పిలుస్తారు [4]
ఉపయోగములు
మార్చుఎర్ర జిల్లేడు ఆకులో ఆయుర్వేదిక్ మందుల్లో వివిధ రకములైన తయారీ లో వాడుతారు. వాంతులు,చర్మసంభధిత వ్యాధులలో , కషాయంమూల తయారీ లో , వాత , పిత్త దోష వ్యాధులలో కూడా వినియోగిస్తున్నారు [5] మలేరియా , కీళ్ల నొప్పులు , చెవుల సంభందిత వ్యాధులలో కుడా ఉపయోగిస్తారు.[6]
గ్యాలరీ
మార్చు-
Flowers in Hyderabad, India.
-
Leaves & flowers in Hyderabad, India.
-
Flowers in Hyderabad, India.
-
Flowers & fruits in Hyderabad, India.
-
Flowers and leaves in Kannur భారత దేశము.
మూలాలు
మార్చు- ↑ "Calotropis gigantea - Plant Finder". www.missouribotanicalgarden.org. Retrieved 2020-08-05.
- ↑ "Calotropis gigantea". missouribotanicalgarden.org/. 2020-08-05.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Calotropis gigantea (PROTA) - PlantUse English". uses.plantnet-project.org. Retrieved 2020-08-05.[permanent dead link]
- ↑ Surveswaran, Siddharthan (2015-04-28). "A crown in the flower". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-10-23.
- ↑ Chauhan, Dr Meenakshi (2019-05-10). "Aak, Madar Flower (Calotropis gigantea) - Uses, Benefits and Dosage". Planet Ayurveda (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-05.
- ↑ "Uses of Calotropis procera (Ait.) R. Br. | National Innovation Foundation-India". nif.org.in. Retrieved 2020-08-05.