ఎలియనేషన్ సిద్ధాంతం

నాటకం లోని పాత్రలు ముందుకొచ్చి ప్రేక్షకులతో మాట్లాడుతూ, రసానుభూతి నుంచి వారిని బయటకు తీసుకువచ్చే ప్రక్రియని ఎలియనేషన్ అంటారు.[1] బెర్టోల్ట్ బ్రెహ్ట్ దీనిని రూపొందించాడు. 1936 లో ప్రచురించిన "చైనీస్ యాక్టింగ్ లో పరాయీకరణ ప్రభావాలను" అనే వ్యాసంలో బ్రెచ్ మొట్టమొదటిగా ఈ పదాన్ని ఉపయోగించాడు.

రంగస్థలంపై జరిగే సన్నివేశం, సంభాషణల్లో ప్రేక్షకులు తాదాత్మ్యం చెందకుండా ప్రతిక్షణం తాను నాటకాన్ని చూస్తున్నాననే భావాన్ని ప్రేక్షకుడికి విధిగా కలిగించాలి. అతడి తాదాత్మ్యనికి విచ్ఛిత్తి జరగాలి. అప్పుడే ప్రేక్షకునిలో ఆలోచన మొలకెత్తుతుంది. అదే ఎలియనేషన్ సిద్ధాంతం. ప్రేక్షకుడు నాటకాన్ని చూసి ప్రదర్శనానంతంరం నోరు మూసుకొని వెళ్లిపోయేవాడుకాదు, అతనికి ఆలోచనలు ఉంటాయి, ఆ ఆలోచనలకు పదును పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పడంలో ఎలియనేషన్ చాలా ఉపయోగపడుతుంది.[2]

ఎలియనేషన్ సిద్ధాంతంలో వచ్చిన నాటికలుసవరించు

  1. మరో మొహెంజొదారో (ఎన్.ఆర్.నంది) [3]
  2. లా-వొక్కింతయులేదు (డి. ప్రభాకర్)
  3. నీలి దీపాలు (కె. చిరంజీవి)
  4. తూర్పురేఖలు, జంతర మంతర్‌ మామూళ్ళు (డాక్టర్‌ అత్తిలి కృష్ణారావు)
  5. దొరా నీ సావు మూడింది (ఆచార్య మొదలి నాగభూషణశర్మ)
  6. ఢిల్లీ పట్నం చూడరబాబు (జయప్రకాశ్‌)
  7. రుద్రవీణ, చీమ కుట్టిన నాటకం, మనుషులోస్తున్నారు జాగ్రత్త (యండమూరి వీరేంద్రనాథ్)
  8. దారితప్పిన ఆకలి (పరుచూరి వెంకటేశ్వరరావు)
  9. తాజీ, ఉప్పెనొచ్చింది (డీన్ బద్రూ)
  10. రోజూ చస్తున్న మనిషి (వై.ఎస్. కృష్ణేశ్వరరావు
  11. బొమ్మలాట (నడిమింటి నరసింగరావు)
  12. గంగిరెద్దాట (సత్యానంద్‌)
  13. బహురూపి (శిష్ట్లా చంద్రశేఖర్‌)
  14. ఈహామృగం, చీకటింట్లో నల్లపిల్లి (అంబటి చలపతిరావు)
  15. అడవి దివిటీలు (వంగపండు ప్రసాదరావు)
  16. ఓనమాలు, ఎడారి కోయిల (వల్లూరి శివప్రసాద్‌)
  17. యక్షగానం (ఎం. వి. ఎస్. హరనాథ రావు)
  18. చింతచెట్టు (వారాల కృష్ణమూర్తి)
  19. ఉప్పు కప్పురంబు (డా. కందిమళ్ళ సాంబశివరావు)

వంటి నాటికలేకాకుండా ఇంకా వస్తూనే ఉన్నాయి.[4]

మూలాలుసవరించు

  1. యండమూరి జాలగూడు. "నాటకంతోనేను." www.yandamoori.com. Archived from the original on 31 ఆగస్టు 2016. Retrieved 3 August 2017.
  2. తెలుగు నాటకరంగం నూతన ధోరణులు - ప్రయోగాలు, (పుట. 436), రచన. డా. కందిమళ్ళ సాంబశివరావు
  3. ఆంధ్రజ్యోతి. "తెలుగు ప్రయోగ నాటక పితామహుడు". Retrieved 6 August 2017.[permanent dead link]
  4. విశాలాంధ్ర. "తెలుగు నాటక పదర్శనల్లో 'జానపద కళారూపాలు'". Retrieved 3 August 2017.[permanent dead link]