ఎస్వీ.కృష్ణజయంతి

ఎస్వీ.కృష్ణజయంతి ప్రఖ్యాతి చెందిన రచయిత్రి. ఈమె కథలు, కవితలు, వ్యాసాలు పలు దిన, వార, మాస పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఈమె 1979, జనవరి 6న బిళ్లా రామారావు, నాగేంద్రమ్మ దంపతులకు గుంటూరులో జన్మించింది[1]. ఈమె ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడింది. ఈమె భర్త యస్వీకృష్ణ కూడా పేరొందిన రచయిత. ఈమె ఎం.ఏ చదివింది. ఈమె రచించిన అనేక కథలు బహుమతులను గెలుచుకున్నాయి. ఈమె రచించిన దృష్టి కథాసంపుటి పై నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ స్థాయి పరిశోధన జరిగింది. ఈమెకు భారత ప్రభుత్వపు సాంస్కృతిక శాఖవారి ఫెలోషిప్ తెలుగు సాహిత్యంలో లభించింది.

ఎస్వీ.కృష్ణజయంతి
Svkrishnajayanti.jpg
ఎస్వీ.కృష్ణజయంతి
జననంజయంతి
(1979-01-06) 1979 జనవరి 6 (వయస్సు 42)
గుంటూరు
వృత్తిగృహిణి
ప్రసిద్ధికథా రచయిత్రి, నవలా రచయిత్రి
మతంహిందూ
భార్య / భర్తయస్వీకృష్ణ
పిల్లలుకృష్ణసంహిత,కృష్ణ అద్వైత
తండ్రిబిళ్లా రామారావు
తల్లినాగేంద్రమ్మ

రచనలుసవరించు

  1. 50వసంతాల తెలుగు కవిత... వస్తువు-రూపం-శిల్పం (విమర్శ)
  2. దృష్టి (కథాసంపుటి)
  3. అభిమాని (నవల)
  4. వ్యూహం (నవల)
  5. పడమటిసూర్యోదయం (కథాసంపుటి)
  6. మరీచిక (కవితాసంపుటి)

50 వరకు కథలు వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. కొన్ని కథలు కన్నడంలోనికి అనువాదమయ్యాయి.

పురస్కారాలు, సత్కారాలుసవరించు

  1. "విందైనవంటకం" కథకు ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక నిర్వ్హహించిన దీపావళి హాస్యకథలపోటీలో ప్రథమ బహుమతి[2]
  2. "పెళ్లికానుక" కథకు నది మాసపత్రిక నిర్వహించిన కథలపోటీలో ప్రథమ బహుమతి
  3. "రెండో శనివారం" కథకు స్వాతి మాసపత్రిక కథల పోటీలో ప్రథమ బహుమతి
  4. "గుణ" కథకు ఆంధ్రప్రభ, అ.జో.వి.భొ.ఫౌండేషన్ వారి కథల పోటీలో ద్వితీయ బహుమతి
  5. "వంశ చరిత్ర"కథకు నది మాసపత్రిక నిర్వహించిన కథలపోటీలో ద్వితీయ బహుమతి
  6. "దృష్టి" కథకు లాయర్ వారపతిక కథల పోటీలో 3వ బహుమతి
  7. "తొలగిన తెర" కథకు సోమేపల్లి సాహితీ పురస్కారం
  8. "తూర్పు సింధూరం" కథకు మల్లెతీగ మాసపత్రిక కథలపోటీలో కన్సొలేషన్ బహుమతి
  9. "గెలుపు" కథకు జాగృతి వారపత్రిక దీపావళి కథలపోటీలో ప్రథమ బహుమతి
  10. "నిర్ణయం" కథకు విశాలాక్షి పత్రిక కథల పోటీలో ప్రత్యేక బహుమతి
  11. "స్త్రీవాద సాహిత్యం" వ్యాసానికి ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక పోటీలలో మూడవ బహుమతి
  12. "స్త్రీచైతన్య కవిత్వం" వ్యాసానికి భావతరంగిణి నిర్వహించిన పోటీలలో ప్రథమ బహుమతి
  13. "నీ కోసం" రచనకు ఆంధ్రభూమి నిర్వహించిన ప్రేమలేఖల పోటీలో ప్రథమ బహుమతి
  14. బెజవాడ యువకలాలు సంస్థచే ఉత్తమకవయిత్రి పురస్కారం
  15. ఉత్తరాంధ్ర కళాకేంద్రం (శ్రీకాకుళం) వారిచే యువకవయిత్రి పురస్కారం

ఇతర విశేషాలుసవరించు

ఈమె ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆథర్స్, వరల్డ్ తెలుగు ఫెడరేషన్, ఆల్ ఇండియా పొయెట్స్ కాన్ఫరెన్స్ మొదలైన సంస్థలలో జీవిత సభ్యురాలిగా ఉన్నది. పలు జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పాల్గొనింది.

మూలాలుసవరించు

  1. వెలువోలు, నాగరాజ్యలక్ష్మి (20 March 2017). "గుంటూరు మహిళలు - కవయిత్రి పరిశోధకురాలు కృష్ణజయంతి". ఆంధ్రజ్యోతి. Retrieved 23 March 2017.
  2. సంపాదకుడు. "దీపావళి హాస్యకథల పోటీ". ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక.