ఎస్.పి.వై. సురేంద్రనాథ్ ఆర్య

మద్రాసు ప్రెసిడెన్సీ నుండి భారత స్వాతంత్ర్య కార్యకర్త

సింహకులతిపతి పాపనార్య యతిరాజ్ సురేంద్రనాథ్ వోగెలి-ఆర్య, తమిళనాడుకు చెందిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు.

ఎస్.పి.వై. సురేంద్రనాథ్ ఆర్య
జననం
వృత్తిభారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు

తొలి జీవితం

మార్చు

తమిళనాడు రాజధాని మద్రాస్ నగరంలోని తెలుగు మాట్లాడే కుటుంబానికి చెందిన ధనకోటి రాజు నాయుడుకు యతిరాజ్ జన్మించాడు. ప్రాథమిక విద్యను పూర్తిచేసిన ఆర్య కొంతకాలం తీవ్రవాద రాజకీయ కార్యకలాపాలలో పాలుపంచుకున్నాడు. 1897లో బెంగాల్ వెళ్ళి 1906 వరకు అక్కడే గడిపి, విప్లవకారులతో పరిచయాలు ఏర్పర్చుకున్నాడు. తిరిగి వచ్చిన తరువాత బెంగాలీ విప్లవకారుడు సురేంద్రనాథ్ బెనర్జీ స్ఫూర్తితో "సురేంద్రనాథ్" అనే పేరును స్వీకరించాడు. తనను తాను "ఆర్య" లేదా "స్వదేశీయుడు" గా తీర్చిదిద్దుకున్నాడు.

అరెస్టు

మార్చు

తమిళ విప్లవకారుడు సుబ్రహ్మణ్య భారతిలో మద్రాసులో పరిచయం ఏర్పడింది. చెన్నై జన సంగం వ్యవస్థాపకులలో ఒకడిగా ఉన్నాడు. 1908, ఆగస్టు 18న దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయిన ఆర్యకు 11 సంవత్సరాలపాటు జైలు శిక్షను విధించబడింది.

జైలుశిక్ష

మార్చు

బళ్ళారిలో ఆరేళ్ళ కఠిన కారాగార శిక్ష పూర్తయిన తర్వాత 1914లో సురేంద్రనాథ్ ఆర్య జైలు నుండి విడుదలయ్యాడు.[1] జైలులో ఉన్నప్పుడు ఆరోగ్యం క్షీణించడంతో కుష్టు వ్యాధికి గురయ్యాడు.[2] ఆ సమయంలో డానిష్ క్రిస్టియన్ మిషనరీలు చికిత్స అందించాయి, ఆ కృతజ్ఞతతో ఆర్య క్రైస్తవ మతంలోకి మారాడు.[3]

భవిష్యవాణి పరిశోధన కోసం యునైటెడ్ స్టేట్స్ వెళ్ళి, డానిష్ మిషన్ చర్చి మిషనరీగా తిరిగి మద్రాస్‌కు వచ్చాడు.[3] వచ్చిన తరువాత ఒక స్వీడిష్ అమెరికన్ మహిళను వివాహం చేసుకొని, తన పేరుకు "వోగెలి" అని జోడించాడు.[3] 1921లో సుబ్రహ్మణ్య భారతి అంత్యక్రియలకు హాజరైన అతికొద్దిమందిలో ఆర్య ఒకడు, అక్కడ ఆయన తెలుగులోనే స్తుతిని అందించాడు.[3]

తరువాత జీవితంలో

మార్చు

స్వీడిష్ అమెరికన్ భార్యకు విడాకులు ఇచ్చిన ఆర్య, 1920ల చివరలో మళ్ళీ హిందూ మతంలోకి వచ్చాడు.[3] బ్రహ్మో సమాజంలో సభ్యుడిగా చేరి, ఆత్మగౌరవ ఉద్యమానికి తన మద్దతు ఇచ్చాడు.[3] ఈ సమయంలోనే ఇవి రామస్వామి నాయకర్ కి సన్నిహితుడు అయ్యాడు.[3]

ఇతర వివరాలు

మార్చు

2000లో వచ్చిన భారతి తమిళ సినిమాలో నిళల్ గల్ రవి సురేంద్రనాథ్ ఆర్య పాత్రను పోషించాడు.

మూలాలు

మార్చు
  1. Narasaiah, K. R. A. (1–15 March 2012). "Laying traps for freedom-fighters in Pondicherry". 21 (22). {{cite journal}}: Cite journal requires |journal= (help)[permanent dead link]
  2. Sivagnanam, M. P. (1988). History of Freedom Movement in Tamil Nadu: Vidutalai poril Tamilakam. Tamil University. p. 120. ISBN 8170901146, ISBN 9788170901143.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 Padmanabhan, R. A. (1982). "Some Telugu friends of Bharathi". Archived from the original on 2021-09-17. Retrieved 2021-09-17. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "padmanabhan" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు

బయటి లింకులు

మార్చు
  • Sedition in India. 19 August 1908. {{cite book}}: |work= ignored (help)
  • D. Sadasivan (1974). Growth of public opinion in the Madras Presidency (1858-1909). University of Madras. p. 53.