ఎస్. శివరామ్ (1938 - 2021 డిసెంబరు 03) కన్నడ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. కన్నడ చిత్రాలలో సహాయ నటుడిగా, హాస్యనటుడిగా ప్రసిద్ధి చెందాడు.[1] తన సోదరుడు ఎస్. రామనాథన్‌తో కలిసి రాశి బ్రదర్స్‌ అనే నిర్మాణ సంస్థని స్థాపించి అనేక చిత్రాలను నిర్మించాడు.[2]

ఎస్. శివరామ్
జననం(1938-01-28)1938 జనవరి 28
చూడసంద్ర, భారతదేశం
మరణం2021 డిసెంబరు 4(2021-12-04) (వయసు 83)
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు, దర్శకుడు, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1958-2021
జీవిత భాగస్వామిపద్మ
బంధువులుఎస్. రామనాథన్‌ (సోదరుడు)

జీవిత విషయాలు మార్చు

శివరాం 1938లో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్యనున్న చూడసంద్ర గ్రామంలో, మధ్యతరగతి హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తన స్వగ్రామంలో ప్రాథమిక విద్య పూర్తిచేసిన శివరామ్, టైప్ రైటింగ్ ఇనిస్టిట్యూట్ నడుపుతున్న తన సోదరుడితో కలిసి బెంగళూరుకు వెళ్ళాడు.

సినిమారంగం మార్చు

గుబ్బి వీరన్న నాటక ప్రదర్శనలతో ప్రభావితుడైన శివరామ్ సినిమా నిర్మాణం, నటనపై ఆసక్తి పెంచుకుని నాటకాలలో నటించాడు. 1958లో సినీరంగంలోకి ప్రవేశించి, ఫోటోగ్రాఫర్ బోమన్ డి ఇరానీకి కెమెరా సహాయకుడిగా పనిచేశాడు. 1965లో తొలిసారిగా వెండితెరపై కనిపించాడు.

సినిమాల జాబితా మార్చు

దర్శకుడిగా మార్చు

సంవత్సరం సినిమా తారాగణం భాష
1972 హార్ట్‌బ్రేక్ రాజ్ కుమార్ భారతి

నిర్మాతగా మార్చు

సంవత్సరం సినిమా తారాగణం భాష
1970 గెజ్జపూజ ఊహ కన్నడ
1974 ది ఎపిస్టల్ ఆరతి కన్నడ
1979 నానొబ్బ కళ్ళ రాజ్ కుమార్ కన్నడ
1980 డ్రైవర్ హనుమంతు శివరామ్ కన్నడ

అవార్డులు మార్చు

    • 2013: పద్మభూషణ్ డా. బి. సరోజాదేవి జాతీయ పురస్కారం[3]
    • 2010-11: కర్ణాటక ప్రభుత్వం నుండి డాక్టర్ రాజ్‌కుమార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు[4]

మరణం మార్చు

మెదడు రక్తస్రావం కారణంగా బెంగుళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 83 సంవత్సరాల వయస్సులో 2021, డిసెంబరు 4న మరణించాడు.[5][6]

మూలాలు మార్చు

  1. He’s loved by all
  2. "Veteran director S Ramanathan dead". Archived from the original on 2015-04-02. Retrieved 2021-12-22.
  3. Actor Shivaram stresses need for unity in Kannada film industry
  4. "Puneeth Rajkumar gets best actor award". 6 April 2012.
  5. "Veteran actor Shivaram passes away". The Hindu (in Indian English). Special Correspondent. 2021-12-04. ISSN 0971-751X. Retrieved 2021-12-22.{{cite news}}: CS1 maint: others (link)
  6. "Veteran Kannada actor Shivaram no more". Deccan Herald (in ఇంగ్లీష్). 2021-12-04. Retrieved 2021-12-22.

బయటి లింకులు మార్చు