ఎస్5 నో ఎగ్జిట్

ఎస్5 నో ఎగ్జిట్ 2022లో తెలుగులో విడుదలైన హారర్‌ థ్రిల్లర్‌ సినిమా.[1] శౌరీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఆదూరి ప్రతాప్‌ రెడ్డి, దేవు శ్యామ్యూల్‌, షేక్‌ రహీమ్‌, మెల్కి రెడ్డి గాదె, గౌతమ్‌ కొండెపూడి నిర్మించిన ఈ సినిమాకు సన్నీ కోమలపాటి దర్శకత్వం వహించాడు. తారకరత్న, ప్రిన్స్, సాయి కుమార్, అవంతికా హరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 డిసెంబర్ 15న విడుదల చేసి, సినిమాను డిసెంబర్ 30న విడుదలైంది.[2]

ఎస్5 నో ఎగ్జిట్
S5 2022.jpg
దర్శకత్వంసన్నీ కోమలపాటి
నిర్మాతఆదూరి ప్రతాప్‌ రెడ్డి
దేవు శ్యామ్యూల్‌
షేక్‌ రహీమ్‌, మెల్కి రెడ్డి గాదె
గౌతమ్‌ కొండెపూడి
నటవర్గంతారకరత్న
ప్రిన్స్
సాయి కుమార్
సునీల్
ఛాయాగ్రహణంగరుడ వేగ అంజి
కూర్పుగ్యారీ బీహెచ్
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
శౌరీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీలు
30 డిసెంబర్ 2022
దేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

ప్రజాసేవ పార్టీ (ఎపిపి) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి సుబ్రహ్మణ్యం నాయుడు (సాయికుమార్) తన కొడుకు సుబ్బు (తారకరత్న) పుట్టిన రోజుకి సికింద్రాబాద్ నుంచి వైజాగ్ ట్రైన్‌లో ఎస్ 5 బోగీ మొత్తం బుక్ చేసి పార్టీ జరుపుకునేలా ఏర్పాటు చేస్తాడు. ఈ బోగీలో సుబ్బు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూంటే (ప్రిన్స్) తన డాన్స్‌ ట్రూప్‌తో పొరపాటున ఎక్కుతారు. ఈ క్రమంలో బోగీ నుండి ఒక్కొక్కరు మాయం అవడమేగాక బోగీకి మంటలంటుకోగా సుబ్బు అతడి స్నేహితులు బయటికి దూకి ప్రాణాలు కాపాడుకుంటారు. బోగీలో కొందరు అదృశ్యమవడం, మంటలంటుకోవడం వెనుక మిస్టరీ ఏమిటి? ఏ తరువాత ఏమి జరిగింది? అనేదే మిగతా సినిమా కథ.[3][4]

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్: శౌరీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాత: ఆదూరి ప్రతాప్‌ రెడ్డి
    దేవు శ్యామ్యూల్‌
    షేక్‌ రహీమ్‌, మెల్కి రెడ్డి గాదె
    గౌతమ్‌ కొండెపూడి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సన్నీ కోమలపాటి
  • సంగీతం: మణిశర్మ
  • సినిమాటోగ్రఫీ: గరుడ వేగ అంజి
  • ఎడిటర్: గ్యారీ బీహెచ్
  • ఆర్ట్: నాగేంద్ర
  • స్టంట్స్: రియల్ సతీష్

మూలాలుసవరించు

  1. Namasthe Telangana (15 December 2022). "ఆకట్టుకునే హారర్‌ థ్రిల్లర్‌". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
  2. Prajasakti (15 December 2022). "30న 'ఎస్ 5 నో ఎగ్జిట్' విడుదల" (in ఇంగ్లీష్). Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
  3. Sakshi (30 December 2022). "'ఎస్‌ 5: నో ఎగ్జిట్‌' రివ్యూ". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
  4. NTV Telugu (29 December 2022). "S5 No Exit Movie Review: ఎస్ 5". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.