ఎ. గణేష మూర్తి
ఎ. గణేష మూర్తి (1947 జూన్ 10 - 2024 మార్చి 28) ప్రస్తుత 15వ లోక్ సభలో ఎం.డి.ఎం.కె. పార్టీ తరుపున తమిళనాడులోని ఈరోడ్ నియోజకవర్గం నుండి గెలిచి పార్లమెంటులో సభ్యునిగా కొనసాగుతున్నాడు.[1]
బాల్యం
మార్చుగణేష మూర్తి 10 జూనె, 1947లో తమిళ నాడులోని ఈరోడ్ జిల్లా, ఉల్గాపురంలో జన్మించాడు. వీరి తల్లి దండ్రులు అవినషి, శారాదాంబాళ్. ఆయన చెన్నైలోని త్యాగరాజ కళాశాలలో బి.ఎ. ఎకనమిక్స్ చదివాడు.
వ్యక్తిగతం
మార్చు1978 అక్టోబరు 31న బాలమణిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
రాజకీయ ప్రస్తానం
మార్చుగణేష మూర్తి 1989-91 మధ్య కాలంలో తమిళ నాడు శాసన సభలో సభ్యునిగా ఉన్నాడు. 1998లో 12వ లోకసభలో సభ్యునిగా కొనసాగాడు. రెండవ సారి, 2009లో 15వ లోక్ సభలో ఎం.డి.ఎం.కె. పార్టీ తరుపున తమిళనాడు లోని ఈరోడ్ నియోజక వర్గంనుండి గెలిచి పార్లమెంటులో సభ్యునిగా కొనసాగాడు. ఆయన వివిధ పార్లమెంటరీ కమీటిలలో సభ్యుడుగా కూడా పనిచేసాడు.
మరణం
మార్చు2024 భారత సార్వత్రిక ఎన్నికల ముందు 2024 మార్చి 28న 77 ఏళ్ల గణేశమూర్తి కన్నుమూసాడు. ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కకపోవడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు యత్నించి కోయంబత్తూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.[2][3]
మూలాలు
మార్చు- ↑ "Lok Sabha". web.archive.org. 2014-03-11. Archived from the original on 2014-03-11. Retrieved 2024-03-28.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "ఎండీఎంకె ఎంపీ గణేష్ మూర్తి మృతి - Prajasakti". web.archive.org. 2024-03-29. Archived from the original on 2024-03-29. Retrieved 2024-03-29.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Eenadu (28 March 2024). "టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత". Archived from the original on 28 March 2024. Retrieved 28 March 2024.