ఈరోడ్

భారతదేశం లో తమిళనాడు లోని జిల్లా

ఈరోడ్ జిల్లా ఒకప్పుడు " పెరియార్ జిల్లా "గా ఉండేది. ఈ జిల్లా భారతీయ రాష్ట్రాలలో ఒకటైన తమిళనాడు రాష్ట్రం కొంగునాడు పడమటి భూభాగంగా ఉండేది. జిల్లా ప్రధానకేంద్రం ఈరోడ్. జిల్లా " ఈరోడ్ విభాగం " , " గోబిచెట్టి పాలెం విభాగం " అని రెండు విభాగాలుగా పనిచేస్తుంది.ఒకప్పుడు పెరియార్ జిల్లా కోయంబత్తూరు జిల్లాలో భాగంగా ఉంటూ వచ్చింది. 1979 సెప్టెంబర్ 17న పెరియార్ జిల్లాగా అవతరుంచింది. 1986న పెరియార్ జిల్లా పేరు ఈరోడ్ జిల్లాగా మార్చబడింది. గణితమేధావి రామానుజం , పెరియార్ అని పిలువబడిన ఇ.వి రామస్వామి ఈరోడ్ జిల్లాకు చెందినవారే.

ఈరోడ్ జిల్లా

ஈரோடு மாவட்டம்

Irotu district
District
Confluence of the Bhavani and Kaveri Rivers
Confluence of the Bhavani and Kaveri Rivers
Location in Tamil Nadu, India
Location in Tamil Nadu, India
Countryభారత దేశము
రాష్ట్రంతమిళనాడు
ప్రాంతంWestern Tamil Nadu (Kongu Nadu)
ప్రధాన కార్యాలయంErode
Revenue DivisionErode, Gobichettipalayam
ప్రభుత్వం
 • CollectorV K Shanmugam IAS
విస్తీర్ణం
 • మొత్తం2,198 చ. మై (5,692 కి.మీ2)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం2,259,608
 • సాంద్రత1,030/చ. మై. (397/కి.మీ2)
భాషలు
 • అధికారTamil
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
638***
టెలిఫోన్ కోడ్0424 (Erode)
04285 (Gobichettipalayam)
04256 (Bhavani)
04295 (Sathyamangalam)
ISO 3166 కోడ్ISO 3166-2:IN
వాహన నమోదు కోడ్TN 33 (Erode East)
TN 36 (Gobichettipalayam)
TN 56 (Perundurai)
TN 86 (Erode West) [2]
Largest cityErode
లింగ నిష్పత్తిM-51%/F-49% /
అక్షరాస్యత72.96%
Lok Sabha seats3
Vidhan Sabha seats8
Central location:11°15′N 77°19′E / 11.250°N 77.317°E / 11.250; 77.317
Precipitation700 milliమీటర్లు (28 అం.)
Avg. summer temperature35 °C (95 °F)
Avg. winter temperature18 °C (64 °F)
జాలస్థలిwww.erode.tn.nic.in

భౌగోళికంసవరించు

ఈరోడ్ నగరం ఉత్తర సరిహద్దులలో కర్నాటక రాష్ట్రజిల్లాలలో ఒకటి అయిన చామరాజనగర్ జిల్లా, తూర్పు సరిహద్దులో కావేరీ నది నది దాటగానే సేలం, నమక్కల్ , కరూర్ జిల్లాలు ఉన్నాయి. దక్షిణ సరిహద్దులలో తిరుపూర్ జిల్లా , పడమర సరిహద్దులో కోయంబత్తూరు , నీలగిరి జిల్లాలు ఉన్నాయి. భూ అంతర్ఘతంగా ఉపస్థితమై ఉన్న ఈరోడ్ జిల్లా 10 36”, 11 58” ఉత్తర రేఖాశం, 76 49” తూర్పు 77 58 అక్షాన్శాలలో ఉపస్థితమై ఉంది. జిల్లా మధ్యభాగంలో విస్తరించి ఉన్న పడమర కనుమల కారణంగా జిల్లాలో కొండలు గుట్టలు అధికంగా ఉన్నాయి.

 
Western Ghats as seen from Gobichettipalayam

నగరానికి ఆగ్నేయ భూభాగం కావేరీ నదివైపు సాగుతున్న ఏటవాలు మైదానాలు విస్తరించి ఉన్నాయి. జిల్లాలో కవేరీ నది ఉపనదులైన భవానీ, నొయ్యల్, అమరావతి ప్రవహిస్తున్నాయి. నగరానికి ఉత్తరదిశలో ప్రవహిస్తున్న పాలారు నది నరానికి కర్నాటక రాష్ట్రానికి మధ్యప్రవహిస్తుంది. భావానీసాగర్ సాగర్ ఆనకట్ట, కొడివెరి ఆనకట్ట ఈ జిల్లాలోనే ఉన్నాయి. ఈ ఆనకట్టలద్వారా లభ్యమౌతున్న నీటితో పంటకాలువల ద్వారా వ్యవసాయ భూములకు నీరు సరఫరా ఔతుంది. అంతే కాక నదీతీరాలలో ఉన్న సారవంతమైన భూమి జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నది.

గణాంకాలుసవరించు

2011 గణాంకాలను అనుసరించి ఈరోడ్ జిల్లా జనసంఖ్య 2,259,608. 2001 గణాంకాలను అనుసరించి జిల్లాలోని 46.25% నగరీకరణ చేయబడింది. .[3] అలాగే జిల్లా అక్షరాస్యతా శాతం 72.96%. జిల్లాలో ఈరోడ్ నగరం మొదటి స్థానంలో ఉండగా తరువాతి స్థానంలో గోపిచెట్టి పాళయం ఉంది.

ఆర్ధికంసవరించు

ఈరోడ్ జిల్లా ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం. జిల్లాలో పండిస్తున్న ప్రధానపంటలు వడ్లు, మొక్కల పెంపకం, వేరుచనగ, పత్తి, పసుపు, కొబ్బరి తోటలు, చెరుకు మొదలైనవి. తమిళనాడులో పండిస్తున్న పసుపు పంటలో 43% ఈరోడ్ జిల్లాలో పండించబడుతుంది.అందువలన ఈరోడ్ అతి పెద్ద పసుపు ఉత్పత్తి నగరంగా గుర్తించబడుతూ " పసుపు నగరం " అని అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచింది. భారతదేశంలో వంటలలో ఉపయోగించే సుగంధద్రవ్యాలలో ప్రధానమైనది ఆచారవ్యవహారాలలో ప్రథమ స్థానం వహిస్తున్నది విశిష్టమైన ఔషధగుణాలు కలిగినది అయిన పసుపుకు ప్రధాన వాణిజ్యకేంద్రంగా ఈరోడ్ భాసిల్లుతుంది. పసుపును వస్త్రాలకు ఉపయోగించే వర్ణాలలో ఒకటిగా ఉపయోగిస్తున్నారు.ఈరోడ్ నగరం తమిళనాడులో అరటి తోటలకు, కొబ్బరి తోటలకు, శ్వేతవర్ణ పట్టుకు, ప్రసిద్ధి.

గోబిచెట్టిపాళయం కూడా అరటి తోటలకు, కొబ్బరి తోటలకు, పత్తి, పట్టుకు, ప్రసిద్ధి. దేశంలోని మొదటి పట్టు కండెల తయారీ పరిశ్రమ గోబిచెట్టిపాళయంలో స్థాపినబడింది. ఈరోడ్ చేనేత, పవర్‌లూం వస్త్రాల తయారీకి, రెడీమేడ్ దుస్తుల తయారీకి ప్రసిద్ధి చెందింది. భారతదేశ పవర్‌లూం నగరంగా ఈరోడ్ నగరానికి మరొక ప్రత్యేకత ఉంది. చేనేత చీరెలు, దుప్పట్లు, తివాసీలు, లుంగీలు, ప్రింటింగ్ వస్త్రాలు, తుండుగుడ్డలు, పంచలు మొదలైన వాణిజ్యానికి ఈరోడ్ ప్రముఖకేంద్రంగా భాసిల్లుతుంది. 2005లో భవానీ జంకానాను భారతదేశ గియోగ్రాఫికల్ చిహ్నంగా గుర్తించబడింది. చెన్నైమలై కూడా వస్త్రాలకు ప్రాముఖ్యత సంతరుంచుకుంది. పుజై, పులియంపట్టు లలో సండే మార్కెట్లు ప్రత్యేకత కలిగి ఉన్నాయి.12.75 ఎకరాల ప్రదేశంలో నిర్వహించబడుతున్న సండే మార్కేట్ ద్వారా పురపాలకానికి సంవత్సరానికి 23.75 లక్షల ఆదాయం లభిస్తుంది. ఈ సంత తమిళనాడులో రెండవ స్థానంలో ఉంది. తమిళనాడులో పొగాకు ఉత్పత్తికి ఈరోడ్‌కు ప్రాముఖ్యత ఉంది. అందియూరు, మడిచూరు సండే సంతలు పశువుల వ్యాపారానికి ముఖ్యత్వం ఇస్తుంది.

ఆలయాలుసవరించు

  • పరియూర్‌లో ప్రసిద్ధిచెందిన శ్రీ పరియూర్ కొండదు కాళియమ్మన్ ఆలయం ఉంది.
  • పరియూర్‌లో శ్రీ అమరపనీశ్వరర్ ఆలయం కూడా నగరంలోని ముఖ్య ఆలయాలలో ఒకటి.
  • బన్నారిలో ఉన్న శ్రీ బన్నారి అమ్మన్ ఆలయం కూడా ముఖ్యఆలయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.

ఈరోడ్ ప్రధాన కేంద్రం నుండిసవరించు

Sl no పట్టణం దూరం
(కి.మి)
1 భవాని 15
2 గోబిచెట్టి పాలెయం 35
3 పెరుంగుడి 20
4 సత్యమంగళం 65
5 అందియూర్ 30

రాజకీయాలుసవరించు

ఈరోడ్ జిల్లా ఈరోడ్ పార్లమెంటరీ నియోజక వర్గం, నీలగిరి పార్లమెంటరీ నియోజక వర్గం, తిరుపూర్ పార్లమెంటరీ నియోజక వర్గం అని మూడు పార్లమెంటరీ విభాగాలుగా విభజించబడింది. అలాగే జిల్లా అందియూర్, భవాని, భవానీ సాగర్, తూర్పు ఈరోడ్, పడమర ఈరోడ్, గోబిచెట్టిపాళయం, మొదకురుచ్చి, పెరుందురై అని 8 అసెంబ్లీ నియోజక వర్గాలుగా విభజించబడింది.

అసెంబ్లీ
నియోజకవర్గం
రాజకీయాలు
పార్టీ
ఎన్నికచేయబడిన
ప్రతినిధి
అందియూర్ ఎ.ఐ.ఎ.డి.ఎం.కె ఎస్.ఎస్.రమణీధరన్
భవాని ఎ.ఐ.ఎ.డి.ఎం.కె పి.జి. నారాయణన్
భవాని సాగర్ సి.పి.ఐ పి.ఎల్. సుందరం
తూర్పు ఈరోడ్ డి.ఎం.డి.కె వి.సి. చందిరకుమార్
పడమర ఈరోడ్ ఎ.ఐ.ఎ.డి.ఎం.కె కె.వి.రామలింగం
గోపిచెట్టిపాళయం ఎ.ఐ.ఎ.డి.ఎం.కె కె.ఎ.సెంగోట్టయ్యన్
మోదకురుచ్చి ఎ.ఐ.ఎ.డి.ఎం.కె ఆర్.ఎన్.కిట్టుసామీ
పెరుందురై ఎ.ఐ.ఎ.డి.ఎం.కె ఎన్.డి. వెంకటాచలం
లోకసభ
నియోజకవర్గం
రాజకీయ
పార్టీ
ఎన్నికచేయబడిన
ప్రతినిధి
ఈరోడ్ మరుమలర్చి ద్రావిడ మున్నేట్ర కళగం (ఎం.డి.ఎం.కె) ఎ.గణేశమూర్తి
తిరుపూర్ ఎ.ఐ.ఎ.డి.ఎం.కె సి.శివరాం
Nilgiris ద్రావిడ మున్నేట్ర కళగం ( డి.ఎం.కె) ఎ.రాజా
Source: Indian Elections / Election Commission of India.[4][5]

చిత్రమాలికసవరించు

మూలాలుసవరించు

  1. "2011 Census of India" (Excel). Indian government. 16 April 2011.
  2. www.tn.gov.in
  3. "[[Census]] 2001". Archived from the original on 2015-04-25. Retrieved 2014-03-12.
  4. "Election results". Indian Elections. Archived from the original on 2012-12-08. Retrieved 2014-03-12.
  5. "Parties Statistics". Election Commission of India. Archived from the original on 2008-12-18. Retrieved 2014-03-12.

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఈరోడ్&oldid=3571913" నుండి వెలికితీశారు