ఏటూరునాగారం మండలం

తెలంగాణ ములుగు జిల్లా లోని మండలం

ఏటూరునాగారం మండలం, తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లాకు చెందిన మండలం.[1][2] ఇది సమీప పట్టణమైన వరంగల్ నుండి 107 కి. మీ. దూరంలో ఉంది. 2016 పునర్వ్యవస్థీకరణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేరిన ఈ మండలం, 2019 లో చేసిన మరో పునర్వ్యవస్థీకరణలో ములుగు జిల్లాలో భాగమైంది.[3][4] ప్రస్తుతం ఈ మండలం ములుగు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 38  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 15 నిర్జన గ్రామాలు. ఈ మండల ప్రధాన పరిపాలనా కేంద్రం, ఏటూరునాగారం

ఏటూరునాగారం
—  మండలం  —
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, ఏటూరునాగారం స్థానాలు
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, ఏటూరునాగారం స్థానాలు
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, ఏటూరునాగారం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°28′37″N 80°19′44″E / 18.477004°N 80.328827°E / 18.477004; 80.328827
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ములుగు జిల్లా
మండల కేంద్రం ఏటూరునాగారం
గ్రామాలు 23
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 341 km² (131.7 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 41,153
 - పురుషులు 20,312
 - స్త్రీలు 20,841
అక్షరాస్యత (2011)
 - మొత్తం 55.57%
 - పురుషులు 68.38%
 - స్త్రీలు 42.01%
పిన్‌కోడ్ {{{pincode}}}

గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 41,153 - పురుషులు 20,312- స్త్రీలు 20,841.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 341 చ.కి.మీ. కాగా, జనాభా 29,937. జనాభాలో పురుషులు 14,829 కాగా, స్త్రీల సంఖ్య 15,108. మండలంలో 7,494 గృహాలున్నాయి.[5]

జిల్లా మార్పులు

మార్చు

వరంగల్ జిల్లా నుండి జయశంకర్ జిల్లాకు

మార్చు

లోగడ ఏటూరునాగారం గ్రామం/ మండలం వరంగల్ జిల్లాలో, ములుగు రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ఏటూరునాగారం మండలాన్ని (1+38) ముప్పైతొమ్మది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలు లోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.[6]

జయశంకర్ జిల్లా నుండి ములుగు జిల్లాకు

మార్చు

2019 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం ములుగు జిల్లాను ఏర్పాటు చేసింది. మరో 8 మండలాలతో పాటు ఏటూరు నాగారం మండలాన్ని కూడా కొత్త జిల్లాలోకి చేర్చారు.[2][7]

పర్యాటక ప్రదేశాలు

మార్చు

గ్రామ విశేషాలు

మార్చు

ఏటారునాగారం ఓ చిన్న పట్టణంగా పేర్కొనవచ్చు. లక్నవరం (జంపన్న) ఉపనది గోదావరిలో కలిసే ప్రదేశంలో ఉన్న ఈ ఊరు ప్రకృతి సోయగాల మధ్య అలరారుతూ ఉంటుంది. ఇక్కడ ఐటీడీఏ ఉంది. గిరిజన జనాభా ఎక్కువగా కలిగిన ఈ ప్రాంతానికి ఏటూరునాగారం ఓ ముఖ్య కేంద్రం. అనేక ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. మావోయిస్టులకు ఒకప్పుడు పెట్టని కోటగా ఉన్న ఈ ప్రాంతంలో అనేక విధ్వంసాలు కూడా జరిగాయి. ఏటూరునాగారం పోలీసుస్టేషన్ పేల్చివేత, తుపాకులగూడెం బస్సు పేల్చివేత వంటి దారుణ మారణహోమాలు కూడా ఉన్నాయి.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు

గమనిక:నిర్జన గ్రామాలు 15 (పదిహేను) పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. 2.0 2.1 https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/MULUGU.PDF
  3. "ములుగు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  4. https://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/MULUGU.PDF
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  6. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-26. Retrieved 2017-12-02.
  7. "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 Feb 2019. Retrieved 17 Feb 2019.

వెలుపలి లంకెలు

మార్చు