ములుగు రెవెన్యూ డివిజను

తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం.

ములుగు రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. ములుగు జిల్లాలోవున్న ఒక రెవెన్యూ డివిజన్ ఇది. ఈ డివిజను పరిపాలనలో 9 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం ములుగు పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం, ములుగు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.

ములుగు రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాములుగు

వివరాలు

మార్చు

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]

పరిపాలన

మార్చు

ములుగు డివిజనులోని మండలాలు:[4]

క్ర.సం ములుగు రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 ములుగు మండలం 19 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)
2 వెంకటాపూర్ మండలం 10 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
3 గోవిందరావుపేట మండలం 14 రెవెన్యూ గ్రామాలు (4 నిర్జన గ్రామాలు)
4 తాడ్వాయి మండలం 73 రెవెన్యూ గ్రామాలు (32 నిర్జన గ్రామాలు)
5 ఏటూరు నాగారం మండలం 38 రెవెన్యూ గ్రామాలు (15 నిర్జన గ్రామాలు)
6 కన్నాయిగూడెం మండలం 25 రెవెన్యూ గ్రామాలు (7 నిర్జన గ్రామాలు)
7 మంగపేట మండలం 23 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు)
8 వెంకటాపురం మండలం 72 రెవెన్యూ గ్రామాలు (27 నిర్జన గ్రామాలు)
9 వాజేడు మండలం 61 రెవెన్యూ గ్రామాలు (18 నిర్జన గ్రామాలు)

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-05-26.
  3. "Revenue Division | Mulugu District, Government of Telangana | India". www.mulugu.telangana.gov.in. Archived from the original on 2021-01-16. Retrieved 2022-05-26.
  4. "ములుగు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-05-26.