ఏడుపాయలు
ఏడుపాయలు ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం మెదక్ జిల్లా, పాపన్నపేట మండలంలోని నాగ్‌సాన్‌పల్లి వద్ద అడవిలో ఉంది.
మెదక్ జిల్లా నుండి 14కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ దుర్గాదేవి అమ్మవారు మహశక్తి అవతారంగా దర్శనం యిస్తారు.
ఏడుపాయల దుర్గా భవానీ గుడిసవరించు
ఈ ఆలయ దర్శనానికి తెలంగాణా,కర్ణాటక, మహారాష్ట్ర సమీప ప్రజలు లక్షల సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ ఉన్న ఏడుపాయలు అనే ప్రదేశంలో మంజీరా నది ఏడుపాయలుగా విడిపోయి ప్రవహిస్తున్న కారణంగా ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చింది.ఈ ప్రదేశ వర్ణన మహాభారతంలో ఉంది.అర్జునుడి మునిమనుమడైన జనమేజయుడు తన తండ్రి పరీక్షిత్తు శాపానికి ప్రతీకారంగా ఇక్కడ సర్పయాగం చేసినట్లు విశ్వసించబడుతుంది. మంజీరా నది మైదానంలో ఇప్పటికీ బూడిద కనిపిస్తుంది. ఏడు పాయల వద్ద నిర్వహించబడే జాతరకు లక్షలాది మంది తరలి వస్తారు.
సర్ప జాతులన్నీ సర్పయాగానికి ఆహుతి అవుతుండటంతో, వాటికి పుణ్యలోకాలు కల్పించడం కోసం గరుత్మంతుడు గంగను ఇక్కడికి తీసుకు వచ్చాడని అంటారు. ఈ కారణంగానే ఇక్కడి మంజీరాను 'గరుడ గంగ' అని పిలుస్తుంటారు. ఈ గంగలో భక్తులు స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబళ్లు చెల్లిస్తూ వుంటారు.[1]
ఈ నదీ తీరంలో ఏడుపాయల దుర్గమ్మ దేవాలయం ఉంది.[2]
మూలాలుసవరించు
- ↑ "ఏడుపాయలు - ఏపి7ఏమ్.కామ్". Archived from the original on 2013-07-15. Retrieved 2014-10-05.
- ↑ ఏడుపాయల దుర్గమ్మ. "వరాలిచ్చే వనదేవత ఏడుపాయల దుర్గమ్మ!". www.ntnews.com. నమస్తే తెలంగాణ. Retrieved 28 October 2017.