మంజీరా నది
మంజీరా (మరాఠీ: मांजरा; కన్నడ: ಮಂಜೀರ), గోదావరి యొక్క ఉపనది. మహారాష్ట్రలో దీనిని మాంజ్రా లేదా మాంజరా అని కూడా వ్యవహరిస్తారు. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. మహారాష్ట్రలోని బీఢ్ జిల్లా, పటోడా తాలూకాలోని బాలాఘాట్ పర్వతశ్రేణి యొక్క ఉత్తరపు అంచుల్లో 823 మీటర్ల ఎత్తున పుట్టి, గోదావరి నదిలో కలుస్తుంది. ఈ నది యొక్క పరీవాహక ప్రాంతం 30,844 చ.కి.మీ.లు[1]
మంజీరా (మహారాష్ట్రలో మంజీరా నది) | |
---|---|
స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ |
భౌతిక లక్షణాలు | |
మూలం | |
• స్థానం | మహారాష్ట్ర, భారతదేశం |
సముద్రాన్ని చేరే ప్రదేశం | గోదావరి నది |
• స్థానం | కందకుర్తి,తెలంగాణ,భారతదేశం |
పొడవు | 724 కి.మీ. (450 మై.) |
పరీవాహక ప్రాంతం | 30,844 కి.మీ2 (11,909 చ. మై.) |
ప్రవాహం | |
• స్థానం | కంధకుర్తి |
మంజీరా నది సాధారణంగా తూర్పు, ఆగ్నేయంగా మహారాష్ట్రలోని ఉస్మానాబాద్, కర్ణాటకలోని బీదర్, తెలంగాణలోని మెదక్ జిల్లాల గుండా 512 కిలోమీటర్లు ప్రవహించి, సంగారెడ్డి వద్ద దిశను మార్చి ఉత్తరంగా ప్రవహిస్తుంది. ఆ దిశగా మరో 75 కిలోమీటర్లు ప్రవహించి నిజామాబాదు జిల్లాలో ప్రవహిస్తుంది. 102 కిలోమీటర్ల దిగువ నుండి ఇది మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుగా ఉంది. ఈ నది యొక్క జన్మస్థానం నుండి గోదావరిలో కలిసే దాకా మొత్తం 724 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. 823 మీటర్ల ఎత్తు నుండి 323 మీటర్లకు దిగుతుంది. మంజీరా నది యొక్క ప్రధాన ఉపనదులు, తిర్నా నది. ఘర్నీ, దేవన్ నది, తవర్జా, కారంజ నది, హలయి, లెండీ, మనర్ నది. ఉపనదులతో సహా మంజీరా నది యొక్క మొత్తం పరీవాహక ప్రాంతం 30,844 చ.కి.మీ.లు. పరీవాహక ప్రాంతంలో సాలీనా 635 మి.మీ.ల వర్షపాతం కురుస్తుంది.[2] పరీవాహక ప్రాంతం మహారాష్ట్రలో 15,667 చ.కి.మీ.లు కర్ణాటకలో 4,406 చ.కి.మీ.లు, తెలంగాణలో 10,772 చ.కి.మీ.లు విస్తరించి ఉంది.[1]
ఈ నది మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో ప్రవహించి, నైరుతి దిక్కునుండి నిజామాబాదు జిల్లాలో ప్రవేశించి, రెంజల్ మండలములోని కందకుర్తి గ్రామం వద్ద గోదావరిలో కలుస్తుంది. మంజీరానది పై, ఇదివరకటి బాన్స్‌వాడ బ్లాక్ లోని అచ్చంపేట గ్రామం వద్ద నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణము జరిగింది. ఈ ప్రాజెక్టులో భాగముగా 35 M.V.A.ల స్థాపక సామర్ధ్యము కలిగిన జలవిద్యుత్ కేంద్రము కూడా ఉంది.
నదిపై ప్రాజెక్టులు
మార్చుమంజీరా నది యొక్క నీటిని వినియోగించుకోవటానికి మొట్టమొదట నిర్మించిన ప్రాజెక్టు మెదక్ జిల్లాలోని ఘన్‌పూర్ ఆనకట్ట. ఈ ఆనకట్ట ద్వారా నీటిని మళ్ళించి మెదక్ జిల్లాలోని ఐదు వేల ఎకరాలకు నీరు అందించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కుడి కాలువ (మహబూబ్ నహర్)ను కూడా నిర్మించారు. 1904లో నిర్మించబడిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 18 లక్షల రూపాయలు ఖర్చయ్యింది. ఆ తరువాత ఈ ప్రాజెక్టు మరింతగా సద్వినియోగ పరచుకొనేందుకు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదుర్ ఎడమ కాలువ (ఫతే నహర్)ను నిర్మించాడు. ఘన్‌పూర్ ఆనకట్ట యొక్క ప్రస్తుత ఆయకట్టు 30 వేల ఎకరాలు.మరియు ఈ నదిపై సింగూరు వద్ద బాగారెడ్డి ప్రాజెక్టు నిర్మించడం జరిగింది.ఇది మంజీర నదిపై అతిపెద్ద మొదటి ప్రాజెక్టు సికింద్రాబాద్ జంట నగరాలకు త్రాగునీరు మరియు మెదక్ జిల్లాలో సాగునీరు విద్యుత్ కేంద్రం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం
సంగారెడ్డి జిల్లా కలుబుగూర్ వద్ద వద్ద మంజీర డ్యాం దీనిపై నిర్మించడం జరిగింది.నిజామాబాద్ మెదక్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో నిజాంసాగర్ నిర్మించడం జరిగింది ఇది మంజీర నదిపై రెండవ అతిపెద్ద ప్రాజెక్టు