ఏది చరిత్ర? (పుస్తకం)

TeluguBookCover EdiCharitra MVR Sastry.jpg

ఏది చరిత్ర? ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్రను ఒక కొత్త కోణంలోంచి చూపిన చరిత్ర పుస్తకం. ఎం.వి.ఆర్.శాస్త్రి రచించిన ఈ పుస్తకం, శతాబ్దాలుగా చరిత్ర పేరుతో వ్యాప్తిలో ఉన్న అనేక విషయాలను ఆధారాల సహితంగా, సాధికారికంగా తప్పులుగా చూపిస్తుంది. ఆంధ్రభూమి దినపత్రిక లో ఏది చరిత్ర పేరుతో వచ్చిన అనేక వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం. ఆర్యుల కాలం నుండి మొగలుల దాకా, భారతదేశ చరిత్ర లోని ముఖ్య ఘట్టాలను విశ్లేషిస్తూ ఇప్పటి వరకూ ప్రచారంలో ఉన్న చరిత్రను విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ ఈ పుస్తకం సాగుతుంది.

ముఖ్య విషయాలుసవరించు

రచయిత గురించిసవరించు

ఎం.వి.ఆర్.శాస్త్రి ప్రముఖ సంపాదకుడు, చరిత్ర రచయిత, కాలమిస్టు. ఈయన 1952 ఏప్రిల్ 22న కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో జన్మించాడు. 1975లో ఆంధ్రజ్యోతి పత్రికలో విలేకరిగా, 1978 నుంచి 1990 వరకూ ఈనాడు దినపత్రికలో వివిధ హోదాల్లో అసిస్టెంట్ ఎడిటర్ స్థాయి వరకూ పనిచేశాడు. 1990 నుంచి 1994 వరకూ ఆంధ్రప్రభ దినపత్రికకు సంపాదకునిగా పనిచేశాడు. 1994 నుండి ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకుడిగా పనిచేస్తున్నాడు. 18 సంవత్సరాలుగా ఉన్నమాట, 14 సంవత్సరాలుగా వీక్ పాయింట్ శీర్షికలను నిర్వహిస్తున్నాడు. రచయితగా ఈయన మన చదువులు, ఉన్నమాట, వీక్ పాయింట్, ఏది చరిత్ర? ఇదీ చరిత్ర, 1857, మన మహాత్ముడు, కాశ్మీర్ కథ, కాశ్మీర్ వ్యథ, ఆంధ్రుల కథ తదితర గ్రంథాలు రచించాడు.[1]

సంబంధిత రచనలుసవరించు

ఈ పుస్తకానికి కొనసాగింపుగా ఆధునిక చరిత్ర గురించి 'ఇదీ చరిత్ర పేరుతో ఇదే రచయిత రచించాడు.

ప్రచురణ వివరాలుసవరించు

ఈ పుస్తకాన్ని మొదటగా 2003 ఏప్రిల్ లో అజోవిభొకందాళం ఫౌండేషను వారు ప్రచురించారు. రెండో కూర్పు 2004 మార్చి లో వచ్చింది. మూడవ కూర్పును దుర్గా పబ్లికేషన్సు వారు 2006 మార్చిలో ప్రచురించారు.

పుస్తకం మూడవ కూర్పు దాని మలి పుస్తకం ఇదీ చరిత్ర తో పాటు విడుదలైంది. ప్రచురణకర్తల పొరపాటు వలన కొన్ని పుస్తకాలు అట్ట ఏది చరిత్ర తోటీ, లోపల ఇదీ చరిత్ర పేజీలతోను విడుదల అయ్యాయి. కొనేటపుడు జాగ్రత్తగా గమనించి కొనుక్కోవాలి.

విమర్శలుసవరించు

  1. ఉన్నమాట పుస్తకంలో రచయిత గురించి శీర్షికన రాసిన వివరాలు