ఏషియన్ పెయింట్స్
ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ (Asian Paints Ltd) 1942 సంవత్సరంలో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఉంది.ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలతో కలిసి పెయింట్ లు, కోటింగ్ లను తయారు చేయడం, పంపిణీ చేస్తుంది. పెయింట్స్, హోమ్ ఇంప్రూవ్ మెంట్ విభాగాలలో కంపెనీ ఇంటీరియర్, బాహ్య గోడలు, మెటల్ ఫినిషింగ్ లు,వుడ్ ఫినిష్ ల వాటికి డెకరేటివ్ కోటింగ్ లను, వాటర్ ప్రూఫింగ్,వాల్ స్టిక్కర్లు; మెకనైజ్డ్ టూల్స్, జిగురులు, మాడ్యులర్ కిచెన్లు, శానిటరీ వేర్, గృహఅలంకరణ ఉత్పత్తులు, శానిటైజర్లు, ఉపరితల క్రిమిసంహారకాలు, ఫర్నిచర్, ఫర్నిషింగ్స్, లైటింగ్స్, ఎనామెల్స్,థిన్నర్లు ఏషియన్ పెయింట్స్, ఆప్కో కోటింగ్స్, ఏషియన్ పెయింట్స్ బెర్గర్, ఏషియన్ పెయింట్స్ కాజ్వే, ఎస్సిఐబి పెయింట్స్, టౌబ్మన్స్, కడిస్కో ఏషియన్ పెయింట్స్ కింద డీలర్లు, రిటైల్ దుకాణాల ద్వారా కంపెనీ తన ఉత్పత్తులను అందిస్తుంది, అలాగే ఆన్లైన్ షాప్ asianpaints.com లో తన అమ్మకాలను చేస్తుంది.[3]
దస్త్రం:Asian paints logo.svg | |
రకం | పబ్లిక్ |
---|---|
ISIN | INE021A01026 |
పరిశ్రమ | రసాయనాలు |
స్థాపన | 1 ఫిబ్రవరి 1942 |
స్థాపకుడు |
|
ప్రధాన కార్యాలయం | , |
సేవ చేసే ప్రాంతము | ప్రపంచవ్యాప్తంగా |
కీలక వ్యక్తులు |
|
ఉత్పత్తులు | |
రెవెన్యూ | ₹29,481 crore (US$3.7 billion) (2022)[2] |
₹4,271 crore (US$530 million) (2022)[2] | |
₹3,053 crore (US$380 million) (2022)[2] | |
Total assets | ₹22,984 crore (US$2.9 billion) (2022)[2] |
Total equity | ₹13,811 crore (US$1.7 billion) (2022)[2] |
ఉద్యోగుల సంఖ్య | 7,160 (2021)[2] |
వెబ్‌సైట్ | www |
చరిత్ర
మార్చుఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ ఫిబ్రవరి 1, 1942 న స్థాపించబడింది ప్రస్తుతం భారతదేశం అతిపెద్ద, ఆసియాలో మూడవ అతిపెద్ద పెయింట్ కంపెనీగా ఉంది. ఏషియన్ పెయింట్స్ 17 దేశాలలో పనిచేయడం, 65కు పైగా దేశాలలో వినియోగదారులకు సేవలను అందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా 25 పెయింట్ తయారీ సౌకర్యాలతో ఉంది. ఏషియన్ పెయింట్స్ 1967 సంవత్సరం నుంచి మార్కెట్ లో అతి పెద్ద పరిశ్రమగా నిలిచింది. ఈ సంస్థ తన భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పింది. అవి భాండుప్ (మహారాష్ట్ర), కస్నా (ఉత్తర ప్రదేశ్), శ్రీపెరంబుదూర్ (తమిళనాడు), అంక్లేశ్వర్ (గుజరాత్), పటాన్ చెరు (తెలంగాణ ), రోహ్ తక్ (హర్యానా) లలో ఉన్నాయి. భారతదేశంలోని అన్ని ప్లాంట్ లు, రీజనల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లు, వెలుపల ప్రాసెసింగ్ సెంటర్ లు, శాఖలను (బ్రాంచీలను) ఇంటిగ్రేట్ చేయడం కొరకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి కంపెనీ అత్యాధునిక సప్లై ఛైయిన్ సిస్టమ్ ని కలిగి ఉంది. భారతదేశంలోని అన్ని కంపెనీ పెయింట్స్ ప్లాంట్లు, రెండు కెమికల్ ప్లాంట్లు, 18 ప్రాసెసింగ్ సెంటర్లు, 350 ముడిపదార్థాలు, మధ్యంతర గూడ్స్ సప్లయర్ లు, 140 ప్యాకింగ్ మెటీరియల్ వెండర్ లు, 6 రీజనల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లు, 72 డిపోలు ఉన్నాయి.ఏషియన్ పెయింట్స్ అనుభవజ్ఞులైన రీసెర్చ్, అభివృద్ధి ( R&D) సమూహముతో హై-ఎండ్ ఎక్స్ టీరియర్ ఫినిష్డ్, వుడ్ ఫినిష్ లను ఇన్-హౌస్ లో విజయవంతంగా అభివృద్ధి చేయగలిగింది, దీనిని ఇంతకు ముందు దేశంలోకి దిగుమతి చేసుకోబడింది. ఈ ప్రొడక్ట్ లు ప్రస్తుతం ఏషియన్ పెయింట్స్ ఎలాస్టోమెరిక్ హై-స్ట్రెచ్ ఎక్స్ టీరియర్ పెయింట్, ఏషియన్ పెయింట్స్ PU వుడ్ ఫినిష్ కింద వరసగా మార్కెట్ చేయబడుతున్నాయి. ఈ సంస్థకు మూడు అనుబంధ సంస్థలు ఉన్నాయి, అవి దక్షిణ పసిఫిక్ ద్వీపాలలో ఏషియన్ పెయింట్స్ అనుబంధ సంస్థ ఆప్కో కోటింగ్స్. ఈ సంస్థ ఆస్ట్రేలియా, ఫిజీ, టోంగా, సోలమన్ దీవులు, వనాటులలో ఆప్కో కోటింగ్స్ బ్రాండ్ పేరుతో పనిచేస్తుంది.[4]
అవార్డులు
మార్చుఏషియన్ పెయింట్స్ కంపెనీ అభివృద్ధిలో దేశ, విదేశీ సంస్థలలో అవార్డులు కంపెనీకి లభించినవి.[4]
- ఏషియన్ పెయింట్స్ 2011, 2012, 2013 సంవత్సరాల్లో ఫోర్బ్స్ మ్యాగజైన్ లో ఆసియా ఫ్యాబ్ 50 లిస్ట్ ఆఫ్ కంపెనీస్ లో చేర్చబడింది.
- కోటింగ్స్ వరల్డ్ - టాప్ కంపెనీస్ రిపోర్ట్ 2013 (జూలై 2013 సంచిక) ద్వారా ఏషియన్ పెయింట్స్ ప్రపంచంలోని టాప్ పెయింట్ కంపెనీల్లో 13వ స్థానంలో నిలిచింది.
- మార్చి 2012లో, ఏషియన్ పెయింట్స్ 2011లో ఉత్తమ గవర్నెడ్ కంపెనీగా ఏషియన్ సెంటర్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ & సస్టెయినబిలిటీ అవార్డును ప్రదానం చేసింది.
- ఏషియన్ పెయింట్స్ పి ఎం మూర్తి,( పూర్వ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్) భారతదేశంలోని ప్రముఖ బిజినెస్ దినపత్రికల్లో ఒకటైన బిజినెస్ స్టాండర్డ్ (మార్చి 2011) నుంచి ' సి ఇ ఓ ఆఫ్ ది ఇయర్' అవార్డును అందుకున్నాడు.
- ఏషియన్ పెయింట్స్ ఏషియన్ సెంటర్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ & సస్టైనబిలిటీ (ఫిబ్రవరి 2011) నుండి ఉత్తమ ఆడిట్ కమిటీ అవార్డును అందుకుంది.
- ఏషియన్ పెయింట్స్ ప్రపంచంలో 10వ అతిపెద్ద డెకరేటివ్ పెయింట్ కంపెనీ.
- భారతదేశంలోని అన్ని ఏషియన్ పెయింట్ ప్లాంట్లకు బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ ద్వారా 'స్వోర్డ్ ఆఫ్ ఆనర్' పురస్కారం లభించింది. ఈ అవార్డు ప్రపంచవ్యాప్తంగా భద్రతలో పటిష్టమైన చర్యలకు పరిగణించబడుతుంది.
- ఫోర్బ్స్ గ్లోబల్ మ్యాగజైన్, యుఎస్ఎ 2002, 2003లో ఏషియన్ పెయింట్స్ 200 'బెస్ట్ స్మాల్ కంపెనీస్ ఆఫ్ ది వరల్డ్'గా, 2005లో ఆసియా టాప్ 200 'అండర్ ఎ బిలియన్ ఫర్మ్స్'లో ఒకటిగా నిలిచింది.
- కోటింగ్స్ వరల్డ్ - టాప్ కంపెనీస్ రిపోర్ట్ 2006 ద్వారా ప్రపంచంలోని టాప్ పెయింట్ కంపెనీల్లో 24వ స్థానంలో నిలిచింది.
- ఆసియాలోని ప్రముఖ ఫైనాన్షియల్ మ్యాగజైన్లలో ఒకటైన ది అసెట్ 2002, 2005 సంవత్సరాల్లో కార్పొరేట్ గవర్నెన్స్ లో ప్రముఖ భారతీయ కంపెనీల్లో ఏషియన్ పెయింట్స్ కు స్థానం కల్పించింది.
- 2003లో ఎర్నెస్ట్ & యంగ్ 'ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ - మాన్యుఫ్యాక్చరింగ్' అవార్డు లభించింది.
- బిటి-హెవిట్ సర్వే ద్వారా రేటెడ్ బెస్ట్ ఎంప్లాయర్, 2000 బ్లూస్ట్ ఆఫ్ ది బ్లూ చిప్స్ బై హిందూ బిజినెస్ లైన్; ET-BT సర్వే, 2000 ద్వారా ఉద్యోగుల సంక్షేమ, ఇతర పథకాలకు ఉద్యోగులు పనిచేయడానికి ఇష్టపడే సంస్థగా ఉన్నది.
కంపెనీ లాభాలు
మార్చుఏషియన్ పెయింట్స్ కంపెనీ 2021-22 సంవత్సరానికి రూ.4,247.87 కోట్లు కాగా, గత ఏడాది రూ.4,089.67 కోట్లుగా ఉంది. గత సంవత్సరం, ప్రస్తుత సంవత్సరానికి 3.9% వృద్ధి చెందింది.[5]
మూలాలు
మార్చు- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Business Insider
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "Asian Paints Limited Financial Statements". Moneycontrol.com. Retrieved 23 February 2022.
- ↑ "Asian Paints Limited (ASIANPAINT.NS) Company Profile & Facts - Yahoo Finance". finance.yahoo.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-08-23.
- ↑ 4.0 4.1 "Asian Paints: Reports, Company History, Directors Report, Chairman's Speech, Auditors Report of Asian Paints - NDTV". www.ndtv.com (in ఇంగ్లీష్). Retrieved 2022-08-23.
- ↑ "Directors Report of Asian Paints Ltd. Company". Goodreturn (in ఇంగ్లీష్). Retrieved 2022-08-23.