ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్

ఐఆర్ఎన్ఎస్ఎస్-1H అను కృత్రిమ ఉపగ్రహం భారత దేశ అంతరిక్షప్రయోగ సంస్థ అయిన ఇస్రో తయారుచేసిన ఉపగ్రహం.ఇది భారతీయ నావేగేషణ్ వ్యవస్థకు చెందిన ఉపగ్రహం.నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థకు సంబంధించి ఇస్రో ఇప్పటివరకు 7 ఉపగ్రహాలను ప్రయోగించింది.నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థకు లోని ఐఆర్ఎన్ఎస్ఎస్-1A అను ఉపగ్రహంలో లోపం ఏర్పడి అందులోని మూడు రుబీడియం అణు గడియారాలు పని చెయ్యడం లేదు. దాని లోటును భర్తీ చెయ్యుటకై, ఐఆర్ఎన్ఎస్ఎస్-1H ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్దమైనది. ఈఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో వున్నటు వంటి సతీస్ థావన్ అంతరిక్షప్రయోగ కేంద్రం నుండి ప్రయోగిస్తున్నారు. ఇస్రో ఉపగ్రహ ప్రయోగ నౌకల పొదిలోని, అత్యంత విశ్వాసనీయమైన PSLV శ్రేణికి చెందిన, XL రకానికి చెందిన పీఎస్ఎల్వి-సీ39ఉపగ్రహ వాహక నౌక ద్వారాఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ఉపగ్రహన్ని ఆగస్టు 31 న 18:59 గంటలకు ప్రయోగించుటకు సన్నాహాలు మొదలైనవి.అయితే ఉపగ్రహవాహక నౌక అనుకున్న రీతిలో ఉపగ్రహన్ని కక్ష్యలో ప్రవేశ పెట్తనందున ప్రయోగం విఫలం అయ్యింది.

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1

నావిక్ ఉపగ్రహ వ్యవస్థ

మార్చు

భారతదేశపు ఈ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థను నావిక్ అని నామకరణ చేసారు.ఇది జల వాయు భూమార్గాల ప్రయాణ వ్యవస్థను పరి పరివేక్షిస్తుంది.వాహనాల ప్రయాణ మార్గాలను గుర్తించడం, విపత్తులను గుర్తించి ముందస్తు సమాచారం చేరవేయ్యడం.విపత్తు రక్షణ చర్యలు చేపట్టడం వంటివి, సరిహద్దు ప్రాంతాల పరివేక్షణ వంటి సేవలు ఈ నావిక్ ఉపగ్రహ వ్యవస్థ వలన లభించును.నావిక్ (‘NavIC’ (Navigation with Indian Constellation) అను పేరు భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీగారు పెట్టారు.

ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహ వ్యవస్థకు చెందిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1A ను 1జులై2013 న, ఐఆర్ఎన్ఎస్ఎస్-1B ని 2014 ఏప్రిల్ 4న, ఐఆర్ఎన్ఎస్ఎస్-1Cని 2014 అక్టోబరు 16 న, ఐఆర్ఎన్ఎస్ఎస్-1Dని2015 మార్చి 28న, ఐఆర్ఎన్ఎస్ఎస్-1E ని2016 జనవరి 20న, ఐఆర్ఎన్ఎస్ఎస్-1F ను 2016 మార్చి 10న, ఐఆర్ఎన్ఎస్ఎస్-1G ని 2016 ఏప్రిల్ 28 న అంతరిక్షకక్ష్యలో ప్రవేశ పెట్టారు.అందులో ఐఆర్ఎన్ఎస్ఎస్-1A ఉపగ్రహంలో లోపం ఏర్పడి, అందులోని మూడు రుబీడియం అణు గడియారాలు పని చెయ్యనందున, దాని స్థానంలో ఐఆర్ఎన్ఎస్ఎస్-1H ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టుచున్నారు. నావిక్ వ్యవస్థ లోని 7 ఉపగ్రహాల తయారికి 420 కోట్ల రూపాయలు వ్యయం అయ్యింది.[1]

ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహ వ్యవస్థకు చెందిన ఉపగ్రహాల్లో మూడు ఉపగ్రహాలు భూస్థిర కక్ష్యలో, మిగిలిన నాలుగు ఉపగ్రహాలు భూఅనువర్తిత కక్ష్యలో, భూమధ్య రేఖకు 29 డిగ్రీల వాలుతంలో భూమిచుట్టు పరిభ్రమిస్తున్నవి, ప్రదక్షిణలుచేస్తున్నవి.ఈ వ్యవస్థను అమెరికా GPS వ్యవస్థకు సరితూగు సామర్ధ్యం పాటవం కల్గి ఉంది.ఇది S-బాండ్, L5 నావిగేషన్ సిగ్నల్సును ఉపయోగించుచున్నది.ఈ వ్యవస్థ సేవలు భారతదేశ సరిహద్దును దాటి1,500కిలోమీటర్ల మేర పర్యవెక్షిస్తుంది.[2]

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ వివరాలు

మార్చు

ఈ ఉపగ్రహం బరువు 1,425 కిలోలు.

ఉపగ్రహంలోని ఉపకరణాలు/పేలోడు

మార్చు

ఉపగ్రహం రెండురకాల ఉపకరణాల సమూదాయాన్నికలిగిఉన్నది. అందులో ఒకటి దిక్సూచి (navigation payload) సంబంధించింది. రెండవది రెంజింగ్ (ranging) ఉపకరణాలు కలిగి ఉన్నాయి. నావిగేసన్ కు సంబంధించిన ఉపకరణాలు కలిగిన విభాగం ఓడల/నౌకల, విమాన తదితర యానాలకు సంబంధించిన దిక్సూచి సమాచారాన్ని వినియోగదారులకు పంపిణి చేస్తుంది. నావిగేసన్ కు సంబంధించిన ఉపకరణాలు L5- బ్యాండ్ (1176.45MHZ), S-బ్యాండ్ (2492.028 MHZ ) లో పనిచేయును. నావిగేసన్ కు సంబంధించిన ఉపకరణాలలో అత్యంత కచ్చితమైన సమయాన్ని చూపించు రుబీడియం పరమాణు గడియారం అమర్చబడింది.

రెంజింగ్ (ranging) ఉపకరణాలభాగం C-బ్యాండ్ ట్రాన్స్‌పాండరును కల్గి, ఉపగ్రహం యొక్క కచ్చితమైన రేంజి తెలుపుతుంది.ఇదిభూమిపై దిశానిర్దేశం అందించగల ప్రాంత పరిధిని నిర్ధారిస్తుంది. లేజరు రెంజింగుకై కార్నర్ క్యూబ్ రెట్రోరేఫ్లేక్టరును ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఈలో పొందుపరచారు. ఉపగ్రహం రెండు వైపుల రెండు సౌరపలకలను అమర్చారు. ఇవి 1660 వ్యాట్ ల విద్యుత్తును ఉత్పత్తి చెయ్యును. దీనికి 90 అంపియర్ అవర్ సామర్ధ్యమున్న లిథియం-అయాన్ బ్యాటరిని అనుసంధానించారు. ఉపగ్రహం 440 న్యూటను శక్తిగల అపోజి మోటరును, 22 న్యూటను శక్తిగల 12 త్రస్టరులను కలిగి ఉంది.

ప్రయోగ ఫలితం

మార్చు

పిఎస్‌ఎల్‌వి-సీ39 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం విఫలం అయ్యింది.అనుకున్న విధంగా అగస్టు 31 సాయంత్రం 7:00 గంటలకు రాకెట్ నింగిలోకి ఎగిసీంది.మొదటి రెందు దశలు సజావుగా జరిగాయి.కాని మూడవ డశలో ఉపగ్రహం చుట్టు రక్షణగా అమర్చిన ఉష్ణకవచ్గం రాకెట్ నుండి వేరుపడలేదు.ఈ కారణం చేత రాకెట్ ఉష్ణరక్షక కవచంలో వుండిపోయ్యి కక్ష్యలో ప్రవేశించలేకపోయినది.[3]

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు/ఆధారాలు

మార్చు
  1. "Isro to launch back-up navigation satellite on 31 August". livemint.com. Retrieved 2017-08-29.
  2. "Indian Regional Navigation Satellite System". spaceflight101.com. Archived from the original on 2017-08-28. Retrieved 2017-08-29.
  3. "పీఎస్‌ఎల్వీ-సీ39 ప్రయోగం విఫలం". sakshi.com. 2017-09-01. Archived from the original on 2017-09-03. Retrieved 2017-09-01.