ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సీ ఉపగ్రహం
ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ ఉపగ్రహాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తయారు చేసింది. ఇతర దేశాల మీద ఆధారపడకుండా భారతదేశం కూడా స్వంత ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థను కలిగి ఉండుటకై ఇండియన్ రిజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్ఎన్ఎస్ఎస్ ) అనే ప్రణాళికను చేపట్టింది. ఈ ప్రణాళికలో భాగంగా మొత్తం ఏడు నావిగేషన్ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. భారతదేశ తీరప్రాంతానికి చెందిన నౌకాయాన, విమానయాన, వాహన గమనాలను, ఉపగ్రహ వ్యవస్థ ద్వారా పర్యవేక్షణ చెసే ఈ ప్రణాళికకు అవసరమైన ఉపగ్రహాలను రూప కల్పన చేసి, తయారు చేసి, వాటిని అంతరిక్షములో నిర్దేశిత కక్ష్యలో ప్రవేశ పెట్టే బాధ్యత ఇస్రో తీసుకుంది.
మిషన్ రకం | నావిగేసన్ |
---|---|
ఆపరేటర్ | ఇస్రో |
COSPAR ID | 2014-061A |
SATCAT no. | 40269 |
మిషన్ వ్యవధి | పది సంవత్సరాలు[1] |
అంతరిక్ష నౌక లక్షణాలు | |
బస్ | I-1K |
తయారీదారుడు | ISRO Satellite Centre Space Applications Centre |
లాంచ్ ద్రవ్యరాశి | 1,424.5 కిలోగ్రాములు (3,140 పౌ.)[1] |
శక్తి | 1,660 watts[1] |
మిషన్ ప్రారంభం | |
ప్రయోగ తేదీ | 15 October 2014, 20:02 UTC |
రాకెట్ | పిఎస్‌ఎల్‌వి ఉపగ్రహ వాహకనౌక=XLరకం |
లాంచ్ సైట్ | సతిష్ థవన్ అంతరిక్ష కేంద్రం FLP |
కాంట్రాక్టర్ | ఇస్రో |
కక్ష్య పారామితులు | |
రిఫరెన్స్ వ్యవస్థ | భూకేంద్రిత కక్ష్య |
రెజిమ్ | Geostationary |
రేఖాంశం | 83° East[1] |
Perigee altitude | 35,697 కిలోమీటర్లు (22,181 మై.)[2] |
Apogee altitude | 35,889 కిలోమీటర్లు (22,300 మై.)[2] |
వాలు | 4.78 degrees[2] |
వ్యవధి | 1436.12 minutes[2] |
ఎపోచ్ | 23 జనవరి 2015, 21:16:09 UTC[2] |
ఈ నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగ వరుస క్రమంలో మొదట 2013 జూలైలో ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఏ ఉపగ్రహాన్ని, 2014 ఏప్రిల్ లోఐఆర్ఎన్ఎస్ఎస్-1బి ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఏ ఉపగ్రహాన్ని పిఎస్ఎల్ వి-సీ22 అను ఉపగ్రహ వాహకనౌక ద్వారా, ఐఆర్ఎన్ఎస్ఎస్-1బి ఉపగ్రహాన్నిపిఎస్‌ఎల్‌వి-సీ24 ఉపగ్రహ వాహకనౌక ద్వారా కక్ష్యలో ప్రవేశ పెట్టడం జరిగింది.
ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ నిర్మాణ వివరాలు
మార్చుప్రయోగ సమయంలో, ఇంధన సమేతంగా ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ ఉపగ్రహం బరువు 1425.4కిలోలు. ఈఉపగ్రహం యొక్క సౌష్టవనిర్మాణంలో, పొందికలో, ఉపకరణాల అమరికలో అంతకు ముందు నిర్మించి, కక్ష్యలోకి పంపిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఏ,, ఐఆర్ఎన్ఎస్ఎస్-1బి ఉపగ్రహాలను పోలి ఉంటుంది. ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ ఉపగ్రహం భౌతిక కొలతలు 1.58 మీటర్లు x 1.50 మీటర్లు x 1.50మీటర్లు. ఈ ఉపగ్రహ జీవితకాలం 10 సంవత్సరాలు.
ఉపగ్రహంలోని ఉపకరణాలు/పేలోడులు
మార్చుఉపగ్రహం రెండురకాల ఉపకరణాల సమూదాయాన్నికలిగి ఉంది.అందులో ఒకటి దిక్సూచి (navigation payload) సంబంధించింది. రెండవది రేంజింగ్ (ranging) ఉపకరణాలు కలిగి ఉన్నాయి. నావిగేషన్ కు సంబంధించిన ఉపకరణాలు కలిగిన విభాగం ఓడల/నౌకల, విమాన తదితర యానాలకు సంబంధించిన దిక్సూచి సమాచారాన్ని వినియోగదారులకు పంపిణి చేస్తుంది.నావిగేషన్ కు సంబంధించిన ఉపకరణాలు L5- బ్యాండ్ (1176.45MHZ), S-బ్యాండ్ (2492.028 MHZ ) లో పనిచేస్తాయి. నావిగేషన్ కు సంబంధించిన ఉపకరణాలలో అత్యంత కచ్చితమైన సమయాన్ని చూపించే రుబీడియం పరమాణు గడియారం అమర్చబడింది.
రేంజింగ్ (ranging) ఉపకరణాలభాగం C-బ్యాండ్ ట్రాన్స్‌పాండరును కల్గి, ఉపగ్రహం యొక్క కచ్చితమైన రేంజిని తెలుపుతుంది. ఇదిభూమిపై దిశానిర్దేశం అందించగల ప్రాంత పరిధిని నిర్ధారిస్తుంది. లేజరు రేంజింగుకై కార్నర్ క్యూబ్ రెట్రోరేఫ్లేక్టరును ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీలో పొందుపరచారు. ఉపగ్రహం రెండు వైపుల రెండు సౌరపలకలను అమర్చారు. ఇవి 1660 వ్యాట్ ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి.దీనికి 90 అంపియర్ అవర్ సామర్ధ్యమున్న లిథియం-అయాన్ బ్యాటరిని అనుసంధానించారు. ఉపగ్రహం 440 న్యూటను శక్తిగల అపోజి మోటరును, 22 న్యూటను శక్తిగల 12 థ్రస్టరులను కలిగి ఉంది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ పూర్తి వ్యవస్థ భూతల, ఆకాశ, సాగరాల్లో దిక్సూచి సేవలందిస్తుంది. విమానాలు, ఓడల గమనాన్ని ఎపటికప్పుడు పర్యవేక్షించేందుకు ఉపయోగపడుతుంది. విపత్తుల సమయంలో బాధితులకు సహాయకారిగా పనిచేస్తుంది. భారతదేశం చుట్టూ 1,500 కి.మీ దాకా విస్తరించిన ప్రాంతంలో సేవలందిస్తుంది.
ఇప్పటివరకు అమెరికా (జీపీయస్), రష్యా (గ్లోనాస్), ఐరోపా (గెలీలియో), చైనా (బేయ్‌డోవ్), జపాన్ (క్వాసీజెనిత్) లు మాత్రమే స్వంత నావిగేషన్ వ్యవస్థలను కలిగి ఉన్నాయి. త్వరలో భారతదేశంకూడా వాటి వరుసలో చేరబోతున్నది
- ఇప్పటివరకు జీపీఎస్‌ఎస్ సేవలకోసం విదేశీ ఉపగ్రహాలపై ఆధారపడాల్సివస్తోంది. ఫలితంగా సున్నితమైన సైనిక సమాచారానికి రక్షణ ఉండదు. దేశీయ దిక్సూచి వ్యవస్థ ద్వారా భద్రతతో కూడిన నావిగేషన్ సాధ్యమవుతుంది.
- పౌర, సైనిక అవసరాలకు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపయోగపడుతుంది. వ్యక్తిగత రవాణాలో గమ్యాన్ని చేరేందుకు దిశానిర్దేశంతోపాటు ఎంతసమయంలో చేరటానికి వీలుంటుందో తెలుస్తుంది.
- వైద్యరంగంలో మెడికల్ ఎమర్జెన్సీకి ఎంతగానో ఉపకరిస్తుంది. ట్రాఫిక్‌లేని మార్గాలపై సమాచారం అందుతుంది.
- పర్వతారోహణ, బోటింగ్ వంటి వాటికి ఉపగ్రహ నావిగేషన్ ఉపకరిస్తుంది.
- సుదూరప్రాంతాల్లో ఉన్న మానవరహిత వాతావరణకేంద్రాలు, సీస్మిక్ కేంద్రాలపై సమాచారాన్ని సేకరించటానికీ ఇది ఉపకరిస్తుంది.
- విమానయానంలో దీన్ని ఉపయోగించడం ద్వారా కచ్చిత ల్యాండింగ్, టేక్‌ఆఫ్‌తోపాటు, విమాన ప్రమాదాల్లో వేగంగా సహాయం అందించటానికి, అదే విధంగా ఇంధన నష్టాన్ని నివారించటానికి వీలవుతుంది.
ఉపగ్రహ ప్రయోగ వివరాలు
మార్చుఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, నెల్లూరు జిల్లాలోని, శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం లోని, మొదటి ప్రయోగ వేదిక నుండి ప్రయోగించారు. పిఎస్ఎల్ వి-సీ26 అను XLశ్రేణికి/రకానికి చెందిన ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఉపగ్రహాన్ని 2014 అక్టోబరు 16, గురువారం నాడు భారతీయ కాలమాన ప్రకారం 01:32గంటలకు ప్రయోగించి, విజయ వంతంగా కక్ష్యలోకి పంపారు. ఉపగహ వాహకనౌక వేదిక నుండి బయలు దేరిన 20 నిమిషాలతరువాత, విజయవంతంగా ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. 499.63కిమీ ఎత్తులో, 9.604 కి.మీ/సెకను వేగంతో ఉపగ్రహం కక్ష్యలోకి నెట్టబడింది. ఇది పిఎస్‌ఎల్‌వి వాహకశ్రేణికి చెందిన, వరుస విజయాల్లో 27వ విజయవంతమైన ప్రయోగం.[4] మొదట 282.56 కి, మీ పెరిజీ,20,670 కి.మీ అపొజి దూరంతో భూఅనువర్తిత బదిలీ కక్ష్యలో ప్రవేశ పెట్టబడిన ఉపగ్రహన్ని తరువాత, భూస్థిర కక్ష్యలోకి బదిలీ చేసారు.
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు/ఆధారాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 "PSLV-C26/IRNSS-1C" (PDF). Archived from the original (PDF) on 21 అక్టోబరు 2014. Retrieved 16 October 2014.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 "IRNSS 1C Satellite details 2014-061A NORAD 40269". N2YO. 23 January 2015. Retrieved 25 January 2015.
- ↑ "Isro successfully launches navigation satellite IRNSS-1B". livemint.com. Retrieved 2016-02-05.
- ↑ "Isro successfully launches navigation satellite IRNSS 1C". timesofindia.indiatimes.com. Retrieved 2016-02-08.