ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ ఉపగ్రహం

భారతీయ ఉపగ్రహం

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ (IRNSS-1E) ఉపగ్రహాన్నిభారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తయారు చేసింది. ఈ ఉపగ్రహన్ని భారతీయ క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహవ్యవస్థ (Indian regional navigation satellite system), నౌకయాన, విమానయాన నిర్వహణ, నౌకల యొక్క గమనాగమనమును పర్యవెక్షణ నిమిత్తం నిర్మించారు. అంతకు ముందుకూడా భారతీయ క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహవ్యవస్థ. నౌకయాన నిర్వహణ, నౌకల యొక్క గమనాగమనమును పర్యవేక్షణ నిమిత్తం ఇండియన్ రీజినల్ నావిగేసన్ శాటిలైట్ సిస్టం (IRNSS) శ్రేణికి సంబంధించి నాలుగు ఉపగ్రహాలను ప్రయోగించారు. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ ఐదవ ఉపగ్రహం. ఇండియన్ రీజినల్ నావిగేసన్ శాటిలైట్ సిస్టం (IRNSS) శ్రేనికి సంబంధించి IRNSS-1A, 1B, 1C., 1D ఉపగ్రహాలను విజయవంతంగా, ఇస్రో వారి పిఎస్‌ఎల్‌వి శ్రేణికి చెందిన ఉపగ్రహవాహక నౌకలద్వారా విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టారు.IRNSS-1A ఉపగ్రహాన్ని పిఎస్‌ఎల్‌వి-సీ22 ఉపగ్రహవాహక నౌకద్వారా 2013 జూలైలో, IRNSS-1B ఉపగ్రహన్నిపిఎస్‌ఎల్‌వి-సీ24 ఉపగ్రహవాహక నౌకద్వారా ఏప్రిల్‌2014లో, IRNSS-1C ని పిఎస్‌ఎల్‌వి-సీ26 ఉపగ్రహవాహక నౌకద్వారా 2014 అక్టోబరులో,, IRNSS-1D ఉపగ్రహన్ని పిఎస్‌ఎల్‌వి-సీ27 ఉపగ్రహవాహక నౌకద్వారా 2015 మార్చిలో, శ్రీహరికోటలోని ధావన్ అంతరిక్షప్రయోగ కేంద్రం నుండి ప్రయోగించారు.[2]

ఐఆర్ ఎన్‌ఎస్‌ఎస్-1ఈ ఉపగ్రహం
మిషన్ రకందిక్సూచి వ్యవస్థ (నౌకాయాన, విమానయాన పర్యవేక్షణ వ్యవస్థ)
ఆపరేటర్ఇస్రో
COSPAR ID2016-003A Edit this at Wikidata
SATCAT no.41241Edit this on Wikidata
మిషన్ వ్యవధి12 సంవత్సరాలు
అంతరిక్ష నౌక లక్షణాలు
బస్I-1K
తయారీదారుడుISRO Satellite Centre
Space Applications Centre
లాంచ్ ద్రవ్యరాశి1,425 kilograms (3,142 lb)
శక్తి1,300 watts
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ20 జనవరి 2016 09:31
రాకెట్పిఎస్‌ఎల్‌వి-సీ31 ఉపగ్రహ వాహకనౌక
లాంచ్ సైట్సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం,షార్,శ్రీహరికోట,రెండవ ప్రయోగ కేంద్రం [1]
కాంట్రాక్టర్ఇస్రో
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థGeocentric
రెజిమ్Geosynchronous
 

ఈ ఉపగ్రహన్ని పిఎస్‌ఎల్‌వి శ్రేణికి చెందిన XL రకానికి చెందిన పిఎస్‌ఎల్‌వి-సీ31 ఉపగ్రహవాహకనౌక ద్వారా, శ్రీహరికోట (నెల్లూరుజిల్లాలోని) లో ఉన్న అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి, 2016 జనవరి 20న ప్రయోగించుటకు నిర్ణయించారు.

ఉపగ్రహ వివరాలు మార్చు

ఐఆర్‌ఎన్‌ఎన్‌ఎస్ ఉపగ్రహాలవరుసలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ ఉపగ్రహం 5వ ఉపగ్రహం. దీని బరువు 1425 కిలోలు. మనదేశ అవసరాల నిమిత్తం భారతీయ క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ (ఇండియన్ రీజినల్ వావిగేసన్ శాటిలైట్ సిస్టం) ను 3,425 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం మొత్తం 7 ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్ణయించగా ఇప్పటివరకు 4 ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాలను అంతరిక్షకక్ష్యలో ప్రవేశపెట్టడం జరిగింది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ ఉపగ్రహం 5వ ఉపగ్రహం. ఇంకా మరో రెండు ఐఆర్‌ఎన్‌ఎన్‌ఎస్ ఉపగ్రహాలను ప్రయోగించవలసి ఉంది. ఈ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థ భారతదేశంలో మొత్తంతో పాటు 1,500కి.లో మీటర్ల వరకు పనిచేస్తుంది. ప్రాజెక్టు మొత్తం పూర్తయితే జీపీయస్‌ తరహాలో భారత్‌కు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో విమానాలు, నౌకలు, రోడ్లు మీద వాహనాలకు దిక్సూచి వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోనికి రానున్నది. ఏప్రిల్ నెలాఖరుకు స్వదేశీ నావిగేసన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెస్తామని ఇస్రో అధికారులు ప్రకటించారు.[3]

ఉపగ్రహం యొక్క భౌతిక కొలతలు 1.58X1.5X5 మీటర్లు. ఇంధనం లేకుండా ఉపగ్రహం బరువు 598 కిలోలు. ప్రయోగ సమయంలో ఇంధనంతో సహా బరువు 1425కిలోలు.

ఉపగ్రహంలోని ఉపకరణాలు/పేలోడు మార్చు

ఉపగ్రహం రెండురకాల ఉపకరణాల సమూదాయాన్నికలిగిఉన్నది. అందులో ఒకటి దిక్సూచి (navigation payload) సంబంధించింది. రెండవది రెంజింగ్ (ranging) ఉపకరణాలు కలిగి ఉన్నాయి. నావిగేసన్ కు సంబంధించిన ఉపకరణాలు కలిగిన విభాగం ఓడల/నౌకల, విమాన తదితర యానాలకు సంబంధించిన దిక్సూచి సమాచారాన్ని వినియోగదారులకు పంపిణి చేస్తుంది. నావిగేసన్ కు సంబంధించిన ఉపకరణాలు L5- బ్యాండ్ (1176.45MHZ), S-బ్యాండ్ (2492.028 MHZ ) లో పనిచేయును. నావిగేసన్ కు సంబంధించిన ఉపకరణాలలో అత్యంత కచ్చితమైన సమయాన్ని చూపించు రుబీడియం పరమాణు గడియారం అమర్చబడింది.

రెంజింగ్ (ranging) ఉపకరణాలభాగం C-బ్యాండ్ ట్రాన్స్‌పాండరును కల్గి, ఉపగ్రహం యొక్క కచ్చితమైన రేంజి తెలుపుతుంది.ఇదిభూమిపై దిశానిర్దేశం అందించగల ప్రాంత పరిధిని నిర్ధారిస్తుంది. లేజరు రెంజింగుకై కార్నర్ క్యూబ్ రెట్రోరేఫ్లేక్టరును ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఈలో పొందుపరచారు. ఉపగ్రహం రెండు వైపుల రెండు సౌరపలకలను అమర్చారు. ఇవి 1660 వ్యాట్ ల విద్యుత్తును ఉత్పత్తి చెయ్యును. దీనికి 90 అంపియర్ అవర్ సామర్ధ్యమున్న లిథియం-అయాన్ బ్యాటరిని అనుసంధానించారు. ఉపగ్రహం 440 న్యూటను శక్తిగల అపోజి మోటరును, 22 న్యూటను శక్తిగల 12 త్రస్టరులను కలిగి ఉంది.

ప్రయోగ వివరాలు మార్చు

2016 జనవరి 20న సరిగా 9గంటల 31 నిమిషాలకు గగనం వైపు దూసుకెళ్లిన పిఎస్‌ఎల్‌వి-సీ31 ఉపగ్రహ వాహకనౌక 19 నిమిషాల తరువాత ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్%-1ఈ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టినది. పిఎస్‌ఎల్‌వి-సీ31 ఉపగ్రహ వాహకనౌక పిఎస్‌ఎల్‌వి శ్రేణిలో, 11 వ XL రకానికి చెందిన అంతరిక్షనౌక/కృత్రిమ ఉపగ్రహ ప్రయోగ నౌక. ప్రయోగానంతరం ఇస్రో చైర్మెన్ ఎ.ఎస్.కిరణ్ కుమార్ ప్రయోగం విజయవంతమైనదని ప్రకటించాడు.[4] 

ఈ ప్రయోగానికి సోమవారం (18-01-2016) 48 గంటల కౌంట్‌డౌన్ ప్రారంభించగా, బుధవారం (20-01-2016) ఉదయం 9:31 నిమిషాలకు శ్రీహరికోట లోని సతీష్‌ ధవన్ అంతరిక్ష ప్రయోగవేదిక నుండి పిఎస్‌ఎల్‌వి-సీ31 ఉపగ్రహ వాహకనౌక నింగివైపు దూసుకెళ్లింది. పిఎస్‌ఎల్‌వి-సీ31 ఉపగ్రహ వాహకనౌక మేఘాలను చీల్చుకొంటూ ఆకాశమార్గం వైపు ప్రయాణం సాగించగానే షార్ లో కరతాళధ్వనులు మిన్నంటేలా మార్మొగాయి. 44.5 మీటర్ల పొడవైన ఉపగ్రహ వాహకనౌక పెరిజీ (భూమికి దగ్గరగా) 284.1 కి.మీ, అపోజి (భూమికి దూరంగా) 20,667 కి.మీదూరం ఉండే భూస్థిర బదిలీ కక్ష్య (జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్) లో 19.2 డిగ్రీల వాలులో దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఐఅర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ ఉపగ్రహాన్నిప్రవేశపెట్టినది. మొత్తంమీద 19నిమిషాల 36 సెకన్లలలో ప్రయోగం పూర్తిఅయ్యింది.[3]

కక్ష్య దూరం పెంపు మార్చు

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టుటకై గురు, శుక్ర, శనివారాల్లో (21,22, 2016 జనవరి 23) మూడు విడతలుగా ఆపరేషన్ చేపట్టి 35,827 కిలోమీటర్ల వరకు అపోఝీ (భూమికి దూరంగా),24,618 కిలోమీటర్ల వరకు పెరిజీ (భూమికి దగ్గరగా) ని పెంచారు.ప్రయోగానంతరం కక్ష్యలో ప్రవేశ పెట్టీన ఉపగ్రహాన్ని బెంగళూరు సమీపంలోని హాసన్లో ఉపగ్రహాలనియంత్రణ కేంద్రం నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు తమ అదుపులోకి తీసుకొని విడతల వారిగా కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను చేపట్టారు.శుక్రవారం ( 2016 జనవరి 22) వేకువ జామున రెండో విడతగా 1:29గంటలకు 1515 సెకన్లు, మళ్ళీమూడో విడతగా శనివారం తెల్లవారుజామున ( 2016 జనవరి 23)3:19గంటలకు 1507 సెకన్ల పాటు ఉపగ్రహంలోని ఇంధనాన్ని మందించి కక్ష్యదూరాన్ని విజయవంతంగా పెంచారు.[5] తిరిగి ఇంధనాన్ని మండించి, శనివారం రాత్రి 10:49 గంటలకు భూమికి 35,827 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో భూమధ్యరేఖకు 28.07°డిగ్రీల అక్షాంశంలో ప్రవేశపెట్టారు. ప్రయోగం జరిగిన రోజున జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి చేరిన ఈ ఉపగ్రహాన్ని, ఉపగ్రహంలోని ఇంధనాన్ని మొత్తం మీద నాలుగువిడతలుగా మండించి నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టారు.[6]

ప్రదక్షిణ మార్చు

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ ఉపగ్రహం ఒకసారి ప్రదక్షిణ చేయుటకు పట్టుసమయం 23గంటల 46 నిమిషాలు.

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ లక్ష్యం-సేవలు మార్చు

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్వ్యవస్థ భూతల, ఆకాశ, సాగరాల్లో దిశానిర్దేశ సేవలందింస్తుంది. విమానాలు, ఓడల గమనాన్ని ఎపటికప్పుడు పర్యవేక్షించేందెకు ఉపయోగపడుతుంది. విపత్తుల సమయంలో బాధితులకు సహాయకారిగా పనిచేస్తుంది. భారతదేశం చుట్టూ 1,500 కి.మీ దాకా విస్తరించిన ప్రాంతంలో సేవలందిస్తుంది. ఇప్పటివరకు అమెరికా (జీపీయస్), రష్యా (గ్లోనాస్), ఐరోపా (గెలీలియో), చైనా (బేయ్‌డోవ్), జపాన్ (క్వాసీజెనిత్) లు మాత్రమే స్వంత నావిగేసన్ వ్యవస్థలను కలిగి ఉన్నాయి. త్వరలో భారతదేశంకూడా వాటి వరుసలో చేరబోతున్నది.[7]

 • ఇప్పటివరకు జీపీఎస్‌ఎస్‌ సేవలకోసం విదేశీ ఉపగ్రహాలపై ఆధారపడాల్సివస్తోంది.ఫలితంగా సున్నితమైన సైనిక సమాచారానికి రక్షణ ఉందదు.దేశీయ నావిగేసన్‌ వ్యవస్థ ద్వారా భద్రతతో కూడిన నావిగేసన్‌ సాధ్యమవుతుంది.
 • పౌర, సైనిక అవసరాలకు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపయోగపడుతుంది.వ్యక్తిగత రవాణాలో గమ్యాన్ని చేరేందుకు దిశానిర్దేశంతోపాటు ఎంతసమయంలో చేరటానికి వీలుంటుందో తెలుస్తుంది.
 • వైద్యరంగంలో మెడికల్‌ ఎమర్జెన్సీకి ఎంతగానో ఉపకరిస్తుంది.ట్రాఫిక్‌లేని మార్గాలపై సమాచారం అందుతుంది.
 • పర్వతారోహణ, బోటింగ్ వంటి వాటికి ఉపగ్రహ నావిగేసన్‌ ఉపకరిస్తుంది.
 • సుదూరప్రాంతాల్లో ఉన్న మానవరహిత వాతావరణకేంద్రాలు, సిసీమిక్‌ కేంద్రాలపై సమాచారాన్ని సేకరించటానికీది ఉపకరిస్తుంది.
 • విమానయానంలో దీన్ని ఉపయోగించడంద్వారా కచ్చిత ల్యాండింగ్, టేక్‌ఆఫ్‌తోపాటు, విమాన ప్రమాదాల్లో వేగంగా సహాయం అందించటానికి, అదే విధంగా ఇంధన నష్టాన్ని నివారించటానికి వీలవుతుంది.

ఇవికూడా చూడండి మార్చు

బయటి లింక్లు మార్చు

మూలాలు/ఆధారాలు మార్చు

 1. "PSLV-C31/IRNSS-1E - ISRO". www.isro.gov.in. Archived from the original on 2016-01-14. Retrieved 2016-01-12.
 2. "PSLV-C31/IRNSS-1E". isro.gov.in. Archived from the original on 2016-01-14. Retrieved 2016-01-18.
 3. 3.0 3.1 "ఇక మన జీపీయస్". sakshi.com. Archived from the original on 2016-01-21. Retrieved 2016-01-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 4. "PSLV-C31 launches IRNSS-1E". thehindu.com. Retrieved 2016-01-20.
 5. "ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈకక్ష్యపెంపు". sakshi.com. Archived from the original on 2016-01-24. Retrieved 2016-01-24.
 6. "కక్ష్యలోకి చేరిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ". sakshi.com. Archived from the original on 2016-01-25. Retrieved 2016-01-25.
 7. ఈనాడు దినపత్రిక,తేది21-01.2016,పుటసంఖ్య:2,నెల్లూరు ముద్రితం