మణిపూర్ ప్రోగ్రెసివ్ సెక్యులర్ అలయన్స్
మణిపూర్ ప్రోగ్రెసివ్ సెక్యులర్ అలయన్స్ (గతంలో సెక్యులర్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్, సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్) అనేది భారతదేశంలో ఒక రాజకీయ కూటమి. కూటమిలో 18 పాయింట్ల ఉమ్మడి ఎజెండా ఆధారంగా ఆరు పార్టీలు ఉన్నాయి.[1]
మణిపూర్ ప్రోగ్రెసివ్ సెక్యులర్ అలయన్స్ | |
---|---|
Chairperson | ఒక్రామ్ ఇబోబి సింగ్ |
స్థాపన తేదీ | 2020 జూన్ 17 |
ప్రధాన కార్యాలయం | మణిపూర్ |
కూటమి | ఇండియా కూటమి |
లోక్‌సభ స్థానాలు | 0 / 2
|
రాజ్యసభ స్థానాలు | 0 / 1
|
శాసన సభలో స్థానాలు | 5 / 60
|
ఏర్పాటు
మార్చుసెక్యులర్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్
మార్చుప్రతిపక్ష నాయకుడు, మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ సెక్యులర్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్‌ను స్థాపించాడు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ దీని ఏర్పాటుకు అంగీకరించింది. భారతీయ జనతా పార్టీ నుండి ముగ్గురు శాసనసభ సభ్యులు, నేషనల్ పీపుల్స్ పార్టీకి నలుగురు, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ నుండి ఒకరు, మణిపూర్‌లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నుండి ఒక స్వతంత్రుడు వైదొలిగిన తరువాత 2020, జూన్ 17న సెక్యులర్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ స్థాపించబడింది.
2020, జూన్ 18న, భారత జాతీయ కాంగ్రెస్ మణిపూర్‌లో భావసారూప్యత గల పార్టీల కూటమిని ఏర్పాటు చేసిందని, మెజారిటీని నిరూపించుకోవడానికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని సింగ్ చెప్పారు.[2] మణిపూర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సెక్యులర్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ మణిపూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లాతో సమావేశమైంది. మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్‌ను తొలగించాలని కూడా సెక్యులర్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ కోరింది.[3] అయితే తర్వాత కూటమి పని చేయలేదు & 2020లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సెక్యులర్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ విఫలమైంది.
మణిపూర్ ప్రోగ్రెసివ్ సెక్యులర్ అలయన్స్ నిర్మాణం
మార్చుతర్వాత 2022 మణిపూర్ శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కొత్త భాగస్వాములతో సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూటమిని రీబ్రాండ్ చేసింది. కాంగ్రెస్ సీపీఐ, సీపీఐ(ఎం), ఫార్వర్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ & జనతాదళ్ (సెక్యులర్) తో పొత్తు పెట్టుకుంది. 2022, ఫిబ్రవరి 5న కాంగ్రెస్ మణిపూర్ ఇంచార్జి జైరాం రమేష్ కొత్త కూటమిని మణిపూర్ ప్రోగ్రెసివ్ సెక్యులర్ అలయన్స్ లేదా కేవలం మణిపూర్ ప్రోగ్రెసివ్ సెక్యులర్ అలయన్స్ అని పిలుస్తామని ప్రకటించాడు.
ప్రస్తుత సభ్యులు
మార్చుసంఖ్య | పార్టీ | చిహ్నం | ప్రస్తుత అసెంబ్లీలో ఎమ్మెల్యేలు |
---|---|---|---|
1 | భారత జాతీయ కాంగ్రెస్ | 5 | |
2 | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | 0 | |
3 | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | 0 | |
4 | ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ | 0 | |
5 | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ | 0 | |
మొత్తం | 5 |
మణిపూర్ అసెంబ్లీలో సభ్యులు
మార్చుమణిపూర్ శాసనసభలో ఫ్రంట్‌కు 5 మంది సభ్యులు ఉన్నారు.
నియోజకవర్గం | సభ్యుని పేరు | పార్టీ | |
---|---|---|---|
ఖుండ్రక్పం | తోక్చోమ్ లోకేశ్వర్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
తౌబల్ | ఓక్రమ్ ఇబోబి సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
వాంగ్ఖేమ్ | కైషమ్ మేఘచంద్ర సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
ఖంగాబోక్ | సుర్జాకుమార్ ఓక్రం | భారత జాతీయ కాంగ్రెస్ | |
సుగ్ను | కంగుజం రంజిత్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
మార్చు- ↑ "Six-party alliance, including Congress, CPI, Forward Bloc, named Manipur Progressive Secular Alliance". The Economic Times. Retrieved 2022-02-13.
- ↑ ANI. "Requested special Assembly session to prove majority, says Manipur CLP leader". BW Businessworld (in ఇంగ్లీష్). Retrieved 2021-05-11.
- ↑ Kundu, Indrajit (18 June 2020). "Manipur: Congress stakes claim to form govt, wants Assembly Speaker removed". India Today. Retrieved 21 June 2020.