ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ
ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ 2021లో విడుదల కానున్న తెలుగు వెబ్ సిరీస్. పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ బ్యానర్ పై నీహారిక కొణిదెల నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు మహేష్ ఉప్పాల దర్శకత్వం వహించాడు. సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ, తులసీ, నరేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను కింగ్ అక్కినేని నాగార్జున విడుదల చేయగా,[1] వెబ్ సిరీస్ నవంబర్ 19న జీ5 లో విడుదల కానుంది.
ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ | |
---|---|
![]() | |
దర్శకత్వం | మహేష్ ఉప్పాల |
రచన | మహేష్ ఉప్పాల మానసా శర్మ |
నిర్మాత | నీహారిక కొణిదెల |
తారాగణం | సంగీత్ శోభన్ సిమ్రాన్ శర్మ తులసి నరేశ్ రాజీవ్ కనకాల |
ఛాయాగ్రహణం | రాజు ఎదురొలు |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | పీకే. దండి |
నిర్మాణ సంస్థ | పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 19 నవంబర్ 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ సవరించు
హరిదాస్ (వీకే నరేష్), రుక్మిణి (తులసి) దంపతులకు ఓ కుమారుడు మహేష్ (సంగీత్ శోభన్) ఇంజనీరింగ్ పూర్తి చేసి ఏ పని చేయకుండా నిర్లక్ష్య జీవితాన్ని గడిపే యువకుడు. మహేష్ తన వీధిలో ఉండే కీర్తి (సిమ్రాన్ శర్మ)ని ప్రేమిస్తుంటాడు. అకస్మాత్తుగా అతని తండ్రి మరణించడంతో అతని కుటుంబాన్ని పోషించే బాధ్యత అతడిపై పడుతుంది. అప్పుడే తన తండ్రి (నరేష్) రూ.25 లక్షల బ్యాంకు రుణం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈఎంఐ కట్టడం కోసం తప్పనిసరిగా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మహేష్ తన తండ్రి తీసుకున్న అప్పు తీర్చగలడా ? మహేశ్ తండ్రి ఆ రుణం ఎందుకు తీసుకున్నాడు? అప్పుడు మహేష్ ఏం చేశాడు? చివరకు ఏమైంది? అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులు సవరించు
- సంగీత్ శోభన్ - మహేష్ [3]
- సిమ్రాన్ శర్మ
- తులసి
- నరేశ్
- రాజీవ్ కనకాల
- గెటప్ శ్రీను
- వీర శంకర్
- ‘టెంపర్’ వంశీ
సాంకేతిక నిపుణులు సవరించు
- బ్యానర్: పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్
- నిర్మాత: నీహారిక కొణిదెల [4]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహేష్ ఉప్పాల
- కథ, మాటలు: మానసా శర్మ
- సంగీతం: పీకే. దండి
- సినిమాటోగ్రఫీ: రాజు ఎదురొలు
- ఎడిటర్ : ప్రవీణ్ పూడి
- పాటలు: శ్రీమణి
మూలాలు సవరించు
- ↑ TV9 Telugu (9 November 2021). "నాగార్జున చేతుల మీదుగా విడుదలైన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ట్రైలర్." Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
- ↑ Eenadu (20 November 2021). "రివ్యూ: ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
- ↑ Eenadu (31 October 2021). "అందరి నోటా ఒకటే మాట.. మహేశ్.. మహేశ్.. మహేశ్..! - telugu news oka chinna family story teaser released by nani". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
- ↑ TV9 Telugu (13 November 2021). "ప్రతి క్యారెక్టర్ ను ఆచితూచి ఎంపిక చేశాం.. 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' గురించి నిహారిక." Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.