ఒక మనసు గొట్టిముక్కల వెంకట రామరాజు రచన, దర్శకత్వంలో 2016లో విడుదలైన తెలుగు సినిమా.[1] నాగసౌర్య, నీహారిక కొణిదెల ముఖ్య తారాగణంగా విడుదలైన ఈ సినిమాలో నీహారిక సినీరంగంలో మొదటిసారి ప్రవేశం చేసింది.[2][3][4] ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2016 జూన్ 24న విడుదలైంది.[5]

ఒక మనసు
పిలిం పోస్టరు
దర్శకత్వంగొట్టిముక్కల వెంకట రామరాజు
రచనగొట్టిముక్కల వెంకట రామరాజు
స్క్రీన్ ప్లేగొట్టిముక్కల వెంకట రామరాజు
కథగొట్టిముక్కల వెంకట రామరాజు
నిర్మాతమధుర శ్రీధర్ రెడ్డి
డా.కృష్ణ భట్ట, ఎ.అభినయ్
తారాగణంనాగ సౌర్య
నీహారిక కొణిదెల
సంగీతంసునీల్ కష్యప్
నిర్మాణ
సంస్థలు
మధుర ఎంటర్‌టైన్‌మెంట్
టీవీ9 & కె.కె.ఎన్.కె.టి.వి
విడుదల తేదీ
2016 జూన్ 24 (2016-06-24)
దేశంభారతదేశము
భాషతెలుగు

కథ మార్చు

సూర్య (నాగశౌర్య) రాజకీయ నాయకుడు కావాలన్న ఆశతో విజయనగరంలో సెటిల్‌మెంట్స్ చేస్తూ తిరిగే అబ్బాయి. సూర్య మామయ్య ఎమ్మెల్యే కావటంతో ఏ రోజుకైనా సూర్యను కూడా ఎమ్మెల్యేగా గెలిపించాలని కలకంటుంటాడు సూర్య తండ్రి (రావు రమేష్). విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో హౌస్ సర్జన్‌గా చేస్తున్న సంధ్య (నీహారిక), సూర్యని తొలి చూపులోనే ఇష్టపడుతుంది. తరువాత ఆ ఇద్దరి పరిచయం ప్రేమగా మారుతుంది. అదే సమయంలో తన రాజకీయ అవసరాల కోసం ఓ పెద్ద సెటిల్‌మెంట్ ఒప్పుకున్న నాగశౌర్య చిక్కుల్లో పడతాడు. నమ్మకద్రోహం కారణంగా కోర్టు కేసులో ఇరుక్కుని మూడేళ్లపాటు జైలులో ఉంటాడు. ఆ తరువాత బెయిల్ వచ్చినా కేసు మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మరోసారి సంధ్యకు దగ్గరవుతాడు సూర్య. కానీ తన తండ్రి కలను నెరవేర్చటం కోసం ఈ సారి సంధ్యకు శాశ్వతంగా దూరం కావలసిన పరిస్థితి వస్తుంది. మరి సూర్య నిజంగానే సంధ్యను దూరం చేసుకున్నాడా.? సూర్య వదిలి వెళ్లిపోవటానికి సంధ్య అంగీకరించిందా..? అన్నదే మిగతా కథ.[6][7]

తారాగణం మార్చు

సౌండ్‌ట్రాక్ మార్చు

ఈ సినిమా ఆడియోలో తొమ్మిది ట్రాక్స్ ఉన్నాయి. వీటిని సునీల్ కశ్యప్ కంపోజ్ చేసారు. ఈ సినిమా పాటలను రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల రవికుమార్ రచించారు. ఈ సినిమా సంగీతం 2016 మే 8 న ప్రారంభమైనది. ఈ వేడుక మెగా కుటుంబం నుండి నాగేంద్రబాబు, రామచరణ్, వరుణ్ తేజ్, సాయిధరం తేజ్, అల్లు అర్జున్ వంటి అతిధుల సమక్షంలో జరిగింది.[9]

ఈ ఆల్బం ప్రేక్షకుల నుండి మంచి స్పందనలను అందుకుంది.[10]

క్రమసంఖ్య పేరుగీత రచనగాయకులు నిడివి
1. "ఓ మనసా (Male)"  రామజోగయ్య శాస్త్రియాజిన్ నాజర్, 04:54
2. "హృదయమా"  రామజోగయ్య శాస్త్రివిజయ్ యేసుదాస్, స్వేతా మోహన్ 04:04
3. "నిన్న లేనంత"  భాస్కరభట్ల రవికుమార్వెదల హేమచంద్ర, రమ్య బెహరా 03:34
4. "చిరుగాలి ఆగిపోవే"  రామజోగయ్య శాస్త్రివెదల హేమచంద్ర, సమీరా భరద్వాజ్ 04:09
5. "ఓ మనసా (Female)"  రామజోగయ్య శాస్త్రిశ్రేయ ఘోషల్ 04:54
6. "ఏమిటో ఈ క్షణం"  భాస్కరభట్ల రవికుమార్వెదల హేమచంద్ర, ప్రణవి 04:58
7. "నీ మనసున"  రామజోగయ్య శాస్త్రివిజయ్ ప్రాకాష్ 04:19
8. "అమృత వర్షిణి (Instrumental)"     02:56
9. "ఓ మనసా (Instrumental)"     03:43
37:31

మూలాలు మార్చు

  1. "Straight from the heart:'Oka Manasu' director Rama Raju"
  2. "Meet ‘Mega Princess’ Niharika Konidela"
  3. "Nagababu’s daughter Niharika’s debut film is ready"
  4. "Waiting for Niharika"
  5. "'Oka Manasu' clears censor board; Madhura Sreedhar reveals release date of Naga Shourya-Niharika-starrer"
  6. 'ఒక మనసు' మూవీ రివ్యూ : June 24, 2016
  7. "Oka Manasu Review". Retrieved 4 July 2016.
  8. http://www.idlebrain.com/movie/archive/okamanasu.html
  9. "Ram Charan attends Oka Manasu audio"
  10. http://www.indiaglitz.com/oka-manasu-telugu-music-review-20656.html

ఇతర లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ఒక_మనసు&oldid=3801196" నుండి వెలికితీశారు