మధుర శ్రీధర్ రెడ్డి

తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, పంపిణీదారుడు.

మధుర శ్రీధర్ రెడ్డి, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, పంపిణీదారుడు. మధుర ఆడియో కంపెనీ ద్వారా తన సినీ జీవితాన్ని ప్రారంభించి, 2010లో స్నేహగీతం సినిమాతో దర్శకుడిగా మారాడు. ఇట్స్ మై లవ్ స్టోరీ, బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.

మధుర శ్రీధర్ రెడ్డి
జననం
వృత్తితెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, పంపిణీదారుడు
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం

జీవిత విషయాలు

మార్చు

శ్రీధర్ రెడ్డి వరంగల్లో పుట్టి పెరిగాడు. రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ (ఎన్‌ఐటి వరంగల్) నుండి బిటెక్ గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నాడు. మద్రాస్ లోని ఐఐటి నుండి ఎంఎస్ (రీసెర్చ్) పూర్తి చేసి, భారత వైస్ ప్రెసిడెంట్ చేత బంగారు పతకాన్ని అందుకున్నాడు.[1] టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా వంటి అనేక బహుళజాతి కంపెనీలలో పనిచేశాడు.

సినిమారంగం

మార్చు

స్నేహగీతం,[2] ఇట్స్ మై లవ్ స్టోరీ, బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. నీలకంఠ దర్శకత్వంలో వచ్చిన మాయ సినిమా నిర్మాతగా తొలి చిత్రం.

లేడీస్ & జెంటిల్మెన్[3] ఒక మనసు,[4] ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్, ఎబిసిడి: అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ, దొరసాని వంటి చిత్రాలను నిర్మించాడు.

అవార్డులు

మార్చు

స్నేహ గీతం సినిమాకు మధుర శ్రీధర్ రెడ్డి ఉత్తమ తొలి దర్శకుడిగా అవార్డు గెలుపొందాడు. 2015 నంది అవార్డులలో లేడీస్ & జెంటిల్మెన్ సినిమా 3వ ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో నంది అవార్డులను గెలుచుకుంది. 

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
2010 స్నేహగీతం దర్శకుడు ఉత్తమ తొలి దర్శకుడు
2011 ఇట్స్ మై లవ్ స్టోరీ దర్శకుడు
2013 బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ దర్శకుడు
2013 ప్రేమ ఇష్క్ కాదల్ సహ నిర్మాత
2014 మాయ నిర్మాత
2015 లేడీస్ & జెంటిల్మెన్ నిర్మాత
2016 ఒక మనసు నిర్మాత
2017 ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ నిర్మాత
2019 ఎబిసిడి: అమెరికన్ బార్న్ కన్పూజ్డ్ దేశీ నిర్మాత
2019 దొరసాని నిర్మాత
2021 లవ్ లైఫ్ అండ్ పకోడి నిర్మాత

మూలాలు

మార్చు
  1. "Madhura Sreedhar Reddy interview - Telugu Cinema interview - Telugu film director". www.idlebrain.com. Retrieved 6 April 2021.
  2. "Sneha Geetham Review". GreatAndhra. GreatAndhra. 15 Jul 2010. Retrieved 6 April 2021.
  3. Dundoo, Sangeetha Devi (2015-01-30). "Ladies and Gentlemen: Socially disconnected". The Hindu. ISSN 0971-751X. Retrieved 6 April 2021.
  4. India, Metro. "Niharika charges a bomb for Oka Manasu". Metroindia. Archived from the original on 18 జూన్ 2016. Retrieved 6 April 2021.

బయటి లింకులు

మార్చు