నాగ శౌర్య

తెలుగు సినిమా నటుడు
(నాగ సౌర్య నుండి దారిమార్పు చెందింది)

నాగశౌర్య ముల్పూరి భారతీయ సినిమా నటుడు. ఎక్కువగా తెలుగు సినిమాలలో నటించాడు. 2011లో సినీ రంగంలోకి ప్రవేశించాడు. అతని మొదటి సినిమా "క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్". జాతీయ బహుమతి పొందిన తెలుగు సినిమా చందమామ కథలులో హాస్య పాత్రను పోషించాడు. తరువాత ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య చిత్రాలలో నటించాడు.[1]

నాగ శౌర్య
అమ్మమ్మగరిల్లు (2018) టీజర్ విడుదల కార్యక్రమంలో శౌర్య
జననం
నాగ శౌర్య ముల్పూరి

22 జనవరి 1989
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుశౌర్య
వృత్తినటుడు, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం
తల్లిదండ్రులుశివలింగ ప్రసాద్‌ (తండ్రి)

వివాహం

మార్చు

నాగశౌర్య బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త, ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టిని నవంబర్ 20న ప్రేమ వివాహం చేసుకున్నాడు.[2]

వృత్తి

మార్చు

నాగ శౌర్య ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో జన్మించాడు. ఆయన అనేక సంవత్సరాలుగా విజయవాడలో నివాసమున్నాడు. తరువాత సినిమాలలో నటించాలనే తన కలను నెరవేర్చుకొనుటకు హైదరాబాదుకు మారాడు.[3] ఆయన సినీరంగంలో ప్రవేశానికి ముందుగా టెన్నిస్ ఆడేవాడు.[3]

ఆయన మొదటి పాత్రలో నటించే ముందు ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు. నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు.[4] అవకాశాలు లేక నిరాశతో తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరాలనుకున్నాడు.[5] అప్పుడు ఆయన వారాహి చలన చిత్రం ద్వారా ప్రకటనను చూశాడు. ఆ ప్రకటనలో అవసరాల శ్రీనివాస్ నిర్మిస్తున్న శృంగార హాస్య చిత్రం ఊహలు గుసగుసలాడే గూర్చి ఉంది. ఆయన ఆ తన ప్రొఫైల్ ను పంపించాడు. ఆయనకు ఆశలు లేనప్పటికి ఆయన అందులోని ముఖ్యపాత్ర కోసం ఎంపిక అయ్యాడు.[5] ఊహలు గుసగుసలాడే చిత్రంలో పనిచేస్తున్నప్పుడే ఆయన "చందమామ కథలు" చిత్రానికి ఎంపికయ్యాడు. ఆ చిత్రం మొదట విడుదల అయ్యింది.[6]

ఊహలు గుసగుసలాడే విడుదలైన రెండు మాసాల తరువాత ఆయన కమర్షియల్ విజయాన్ని సాధించాడు.[3] విశ్లేషకులు ఆయన హాస్యసన్నివేశాలకు సరిపోతాడని అన్నారు.[7] వారు తరువాత సినిమాలకు కచ్చితమైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు.[8] ఆయన మూడవ చిత్రం దిక్కులు చూడకు రామయ్య కూడా శృంగార హాస్య చిత్రం. ఇది త్రిముఖ ప్రేమ కథా చిత్రం. ఈ చిత్రంలో తండ్రి, తనయుడు ఒకే అమ్మాయితో ప్రేమలో పడటం విశేషం.[9] "నాగ శౌర్య కొత్త నటులలో ఉత్తమ నటుడిగా నిరూపించుకున్నాడు" అని హిందూ పత్రిక వ్యాఖ్యానించింది.[10] ఆ సంవత్సరంలో శౌర్య యొక్క చివరి చిత్రం "లక్ష్మీ రావే మా ఇంటికి".[11] ఆయన తరువాత చిత్రం 2015లో విడుదలైన "జాదూగాడు". తరువాత "అబ్బాయితో అమ్మాయి" చిత్రంలో నటించాడు.

2016లో ఆయన నీహారిక కొణిదెలతో కలసి ‎గొట్టిముక్కల వెంకట రామరాజు దర్శకత్వంలో ఒక మనసు చిత్రంలో నటించాడు. తరువాత కళ్యాణ వైభోగమే సినిమాలో నటించాడు.

నటించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2011 క్రికెట్ గర్ల్స్ & బీర్ విక్రమ్ ప్రధాన పాత్రలో అరంగేట్రం
2014 చందమామ కథలు రాజు
ఊహలు గుసగుసలాడే ఎన్. వెంకటేశ్వర "వెంకీ" రావు
దిక్కులు చూడకు రామయ్య మధు
లక్ష్మి రావే మా ఇంటికి సాయి
2015 జాదూగాడు కృష్ణుడు
2016 అబ్బాయితో అమ్మాయి అభి
కల్యాణ వైభోగమే శౌర్య
ఒకా మనసు సూర్య
జ్యో అచ్యుతానంద ఆనంద్ వర్ధన్ రావు
నీ జతలేక అఖిల్
2017 కథలో రాజకుమారి శౌర్య అతిధి పాత్ర
2018 చలో హరి సహ నిర్మాత కూడా [12]
కణం కృష్ణుడు తమిళంలో దియాగా ఏకకాలంలో తీశారు
అమ్మమ్మగారిల్లు సంతోష్
నర్తనశాల రాధా కృష్ణ సహ నిర్మాత కూడా
2019 ఓ! బేబీ విక్రమ్
2020 అశ్వథామ గణ సహ నిర్మాత & కథా రచయిత కూడా
2021 వరుడు కావలెను ఆకాష్ [13] [14]
లక్ష్యం పార్ధు [15]
2022 కృష్ణ బృందా విహారి కృష్ణుడు సహ నిర్మాత కూడా [16]
2023 ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రీకరణ [17]
నారీ నారీ నడుమ మురారీ చిత్రీకరణ [18]
పోలీస్ వారి హెచ్చరిక చిత్రీకరణ [19]
రంగబలి [20]

మూలాలు

మార్చు
  1. "Naga Shourya Debut Movie". Archived from the original on 4 November 2014. Retrieved 5 February 2016.
  2. Andhra Jyothy (20 November 2022). "గ్రాండ్‌గా నాగ శౌర్య - అనూష శెట్టి వివాహం.. వీడియో వైరల్". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  3. 3.0 3.1 3.2 "You need at least 15-20 years to attain stardom : Naga Shaurya". Timesofindia.indiatimes.com. 2014-09-10. Retrieved 2015-04-17.
  4. ఎన్టీఆర్, రామ్, నితిన్, ఇలియానా... అందరూ మా శిష్యులే!, ఈనాడు ఆదివారం సంచిక, 4 జనవరి 2015, పుట. 20-21
  5. 5.0 5.1 "Naga Shourya: The newest kid on the block". Deccanchronicle.com. 2014-06-27. Retrieved 2015-04-17.
  6. "Naga Shourya Interview | Oohalu Gusagusalade Hero | Chandamama Kathalu | Avasarala Srinivas - Interviews". CineGoer.net. 2014-06-30. Archived from the original on 2015-04-18. Retrieved 2015-04-17.
  7. "Oohalu Gusagusalade Movie Review". Timesofindia.indiatimes.com. 2014-06-20. Retrieved 2015-04-17.
  8. "Oohalu Gusagusalade Movie Review | oohalu gusagusalaade telugu movie review | Oohalu Gusagusalade Telugu Review". 123telugu.com. 2014-06-20. Retrieved 2015-04-17.
  9. "I want to do more edgy films, says Naga Shaurya". Timesofindia.indiatimes.com. Retrieved 2015-04-17.
  10. Sangeetha Devi Dundoo (2014-10-10). "Dikkulu Choodaku Ramayya: Of messy romances". Thehindu.com. Retrieved 2015-04-17.
  11. "Rajamouli praises Naga Shourya". 123telugu.com. Retrieved 2015-04-17.
  12. "Photos - Chalo Movie Team Felicitates Nandi and National Award Winners". www.ragalahari.com (in ఇంగ్లీష్). Retrieved 2021-08-15.
  13. TelanganaToday (17 November 2020). "Naga Shaurya gets ready for Varudu Kaavalenu". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-12-18.
  14. "వ‌రుడి కోసం రెడీ అవుతున్న రీతూవ‌ర్మ..వీడియో". ntnews. 2020-11-13. Retrieved 2020-12-18.
  15. "Naga Shaurya heads to Dubai to shoot for his next film Varudu Kaavalenu". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-01-13.
  16. "Naga Shaurya's next with Anish Krishna goes on floors today; Check the actor's upcoming movies". The Times of India (in ఇంగ్లీష్). 2020-10-28. Retrieved 2021-06-24.
  17. "Naga Shaurya's next with Anish Krishna goes on floors today; Check the actor's upcoming movies". The Times of India (in ఇంగ్లీష్). 2020-10-28. Retrieved 2021-01-13.
  18. "Raja Kolusu's film starring Naga Shaurya tentative titled as 'Nari Nari Naduma Murari'? - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-06-24.
  19. "Naga Shaurya on a roll: Announces his next titled 'Police Vari Hecharika' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-08-17.
  20. V6 Velugu (12 May 2023). "రంగబలి..రిలీజ్‌‌కి రెడీ". Archived from the original on 12 May 2023. Retrieved 12 May 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

ఇతర లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=నాగ_శౌర్య&oldid=4195689" నుండి వెలికితీశారు