బరాక్ ఒబామా

అమెరికా రాజకీయ వేత్త, 44వ అమెరికా అధ్యక్షుడు
(ఒబామా నుండి దారిమార్పు చెందింది)

బరాక్ ఒబామా (జననం 1961 ఆగస్టు 4) [1][2] అమెరికా 44వ అధ్యక్షుడు. అమెరికాకు అధ్యక్షుడైన మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికను సంతతికి చెందిన వ్యక్తి. అమెరికా ఖండం బయట జన్మించి అమెరికా అధ్యక్షుడైన మొట్టమొదటి వ్యక్తి కూడా బరాక్ ఒబామానే. ఆయన హవాయిలోని హొనొలులులో పుట్టారు. కొలంబియా విశ్వవిద్యాలయం, హార్వర్డ్ లా స్కూల్ లలో డిగ్రీ చదువుకున్నారు ఒబామా. ఆయన అక్టోబరు 1992లో మిచెల్ రాబిన్సన్‌ను వివాహం చేసుకున్నారు. హార్వర్డ్ లా రివ్యూకు ఆయన అధ్యక్షునిగా వ్యవహరించారు. లా డిగ్రీ పొందే ముందు ఆయన చికాగోలో కమ్యూనిటీ ఆర్గనైజర్ గా చేశారు. 1992 నుండి 2004 వరకు చికాగో లా స్కూల్ విశ్వవిద్యాలయంలో సివిల్ రైట్స్ అటార్నీగా పనిచేస్తూ రాజ్యాంగ చట్టం గురించి బోధించేవారు. 1997 నుండి 2004 వరకు ఇల్లినొయిస్ సెనేట్ లో పనిచేశారు. 2000 లో యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు డెమొక్రటిక్ ప్రైమరీలో చేశారు.

బరాక్ ఒబామా (2012)
ఒబామా జనవరి 24, 2009న యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా తన మొదటి వారపు ప్రసంగాన్ని సమర్పించారు, అమెరికన్ రికవరీ అండ్ రీఇన్వెస్ట్‌మెంట్ యాక్ట్ ఆఫ్ 2009 గురించి చర్చిస్తున్నారు

2004లో అమెరికా సెనేట్ ఎన్నికల్లో ఆయన గెలవడంతో దేశం దృష్టిని ఆకర్షించారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున గెలిచారు ఆయన. ఆ తరువాత జూలైలో డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ లో ఆయన మాట్లాడారు. 2007లో అధ్యక్షునిగా ప్రచారం మొదలుపెట్టిన ఆయన, తన పార్టీలోని హిల్లరీ క్లింటన్ పై అంతర్గత ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పదవికి టికెట్ సంపాదించారు. ఆ తరువాత అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ మెక్‌కైన్ ను ఓడించి 2009 జనవరి 20న అధ్యక్షునిగా గెలిచారు. అధ్యక్షుని పదవి చేపట్టిన తొమ్మిది నెలల తరువాత 2009 నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు.

మూలాలు

మార్చు
  1. Truth questions Archived 2021-08-04 at the Wayback Machine of "Barak".
  2. "Barak".