ఒసామా బిన్ లాదెన్

(ఒసామా బిన్ లాడెన్ నుండి దారిమార్పు చెందింది)

ఒసామా బిన్ లాదెన్ (Osama bin Laden (1957-2011) అల్ ఖైదా అను అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ నాయకుడు. 9/11 దాడుల ప్రధాన సూత్రధారి. ఈ దాడిలో 2, 976 అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 6000+ మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇతను ఒక వైపు అమెరికాకి వ్యతిరేకంగా పోరాడుతూనే మరో వైపు ప్రత్యర్థి ఇస్లామిక్ సంస్థలతో ఘర్షిస్తున్నాడు. మే 2, 2011 తేదీన అమెరికా సైన్యం జరిపిన ఒక ఆపరేషన్ లో ఇతను చనిపోయినట్లు అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించాడు.

కుటుంబ నేపథ్యం

మార్చు

ఒసామా తండ్రి షేక్ మహమ్మద్ మామూలు స్థాయి నుండి బిన్ లాడెన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీని స్థాపించే దశకి ఎదిగాడు. సౌదీలో అది అతి పెద్ద కంపెనీ. ఆయన 22 పెళ్ళిళ్ళు చేసుకుని, 25 మంది కొడుకులకూ, 29 మంది కూతుళ్ళకూ తండ్రయ్యాడు. 23వ వివాహం చేసుకునే నిమిత్తం వెళుతూ విమాన ప్రమాదంలో చనిపోయాడు.
బిన్ లాడెన్ కుటుంబానికీ, సౌదీ రాజుల కుటుంబానికీ సత్సంబంధాలు ఉన్నాయి. ఇస్లామును పటిష్ఠంగా పాటించేవారుగా, దక్షతగల వ్యాపారవేత్తలుగా, ధనవంతులుగా బిన్ లాడెన్ కుటుంబం గుర్తింపు పొందింది.
బిన్ లాడెన్ కుటుంబంలో సంగీతం, నృత్యం ..హరామ్ అంటారు. పుట్టినరోజు వేడుకలు జరపరు.
ఒసామా బిన్ లాడెన్ తల్లి తరుఫు బంధువు నజ్ వా (సిరియన్) ను పెండ్లాడాడు. ఆమెకు 30 ఏళ్లు రాకుండానే వరుసగా 7 మంది కొడుకుల్ని కన్నది. అతను లెబనాన్ లో చదివే రోజుల్లో విలాస పురుషుడేనట. తరువాత ఇస్లాంను కఠినంగా పాటిస్తూ, వ్యక్తిగా ఏ ప్రత్యేకత లేకున్నా, అందరి మన్నన పొందాడు. సౌదీ రాజుల విలాసవంతమైన జీవితాన్ని విమర్శించినందుకు దేశబహిష్కరణకు గురయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ వీరుడిగా, అమెరికా విరోధిగా ఎదిగాడు. కుటుంబంతోనూ, రాజకుటుంబంతోనూ బంధాలు వీడలేదు.[1]

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. http://naprapamcham.blogspot.com/2009/03/blog-post_09.html