ఉగ్రవాదం
మూస:Terrorism ఉగ్రవాదం (ఆంగ్లం Terrorism) అనే పదము ఉగ్రము (Terror) అనే పదము నుండి ఉద్భవించినది. ఉగ్రము - భయం నుండి పుట్టినది. భయం అనేది, భయాన్నికలుగజేసే, భయపెట్టే, లేదా అపాయాన్ని కలుగజేసే విషయాల పట్ల 'మానసిక ప్రతిచర్య'. ఆత్మన్యూనతాభావనలకు, ఉద్రేకాలకు లోనై, ఇతరులకు భయపెట్టి తమ పంతాలను నెగ్గించుకొనువారు, తమ భావాలను, బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించేవారు, తమ స్వీయవిషయాల రక్షణకొరకు, సమాజవ్యతిరేక మార్గాలను ఎంచుకొనువారు - 'ఉగ్రవాదులు'. మానసికంగా చూస్తే ఇదో రుగ్మత. సామాజికంగా చూస్తే ఇదో పైశాచికత్వం, మతపరంగా చూస్తే ఇది నిషిద్ధం. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాల మూలంగా ఎంతో మంది అమాయకులైన ప్రజలు బలవుతున్నారు.
భారతదేశంలో నిషేధింపబడిన సంస్థలు
భారత హోం మంత్రిత్వ విభాగం, ఆగస్టు 2013 నాటికి, తన వెబ్‌సైట్‌లో ఉంచిన నిషేధింపబడ్డ తీవ్రవాద / ఉగ్రవాద సంస్థల జాబితా:[1]
హిందూ రైట్ వింగ్ సంస్థ, మహాత్మాగాంధీ హత్యారోపణలపై 1948 లో నిషేధింపబడింది. అలాగే ఎమర్జెంసీ కాలంలో 1975-77 లోనూ, బాబ్రీమసీధు విధ్వంసం తరువాతనూ 1992 లో నిషేధింపబడింది. తరువాత నిషేధింపులు తొలగింపబడ్డాయి.
ఉగ్రవాదులు గా ముద్రపడ్డవారు
- వ్యక్తులు :
- పురుషులు :
- ఒసామా బిన్ లాదెన్
- అసీమానంద్
- అజ్మల్ కసాబ్
- సయ్యద్ అబ్దుల్ కరీం తుండా
- కోలోనెల్ పురోహిత్
- ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్
- యాసీన్ భట్కల్
- స్త్రీలు :
పొరపాటుగా ఉగ్రవాదులు గా ముద్రపడ్డవారు
- హనీఫ్
బ్లాక్ విడోస్
రష్యా దళాల చేతిలో భర్తలను, లేదా ప్రేమికులను కోల్పోయిన మహిళలు కసితో ఉగ్రవాదులుగా మానవ బాంబులుగా అవతారమెత్తి రష్యాలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. మతం పట్ల ఆసక్తి లేని వారు సైతం బ్లాక్ విడోస్ అవుతున్నారని తేలింది. ఎక్కువమంది వయసు 15 నుంచి 19 సంవత్సరాల మధ్యే ఉంటుంది. కొందరిని తల్లిదండ్రులే ఉగ్రవాదులకు విక్రయిస్తున్నారు. కొన్ని కుటుంబాల వారు బలవంతంగా తమ పిల్లలను ఉగ్రవాదుల్లో చేర్చుతున్నారు. బ్లాక్ విడోస్‌కు ఎలాంటి ఆయుధ శిక్షణ ఉండదు. శరీరానికి పేలుడు పదార్థాలు అమర్చుకుని... మీట నొక్కడమే వారి పని. అమెరికాలో 'బ్లాక్ విడో' అనే ఆడ విషపు సాలె పురుగు సంయోగానంతరం మగ సాలీడును భక్షిస్తుంది. .
ఉగ్రవాదిని చంపిన మహిళ
కాశ్మీర్ తీవ్రవాదులగుండెల్లో బుల్లెట్లు దింపిన మహిళ రుక్సానా (19)..కాశ్మీర్లో తీవ్రవాదుల దుశ్చర్యలు, కల్లోలం, రాత్రి వేళ ఇళ్లల్లోకి చొరబడటం, ఆకస్మిక దాడులకు తెగబడటం, అమ్మాయిల అపహరణలు, లైంగిక వేధింపులు నరకయాతనే. అలాంటి తీవ్రవాదులపై గొడ్డలితో విరుచుకుపడి, ఒకరిని చంపి... మిగిలిన వారిని పరుగులు తీయించింది రుక్సానా.అరుదైన సాహసం. ఆమె హతమార్చింది ఒక కమాండర్ స్థాయి తీవ్రవాది ని. రుక్సానా బాగా చదువుకున్న అమ్మాయి కాదు.తండ్రి వ్యవసాయదారుడు. వ్యవసాయ పనులు లేనప్పుడు రోజుకూలీగా పని చేసేవాడు.సరిహద్దు జిల్లా రాజౌరీ. ఎనిమిదేళ్ల క్రితం ఓసారి రుక్సానా కుటుంబం తీవ్రవాదుల దాడికి గురయింది. తండ్రి గాయాలపాలయ్యాడు. మొన్న సంఘటనలోనూ తల్లిదండ్రులను తీవ్రంగా కొట్టడం, వారు పడిపోవడం గమనించిన రుక్సానా తట్టుకోలేకపోయింది. తీవ్రవాదులను ధైర్యంగా ఎదుర్కొంది.'నేను పెరిగిన వాతావరణం, ఆ క్షణంలో ఉన్న పరిస్థితి, టీవీల్లో తుపాకీ పేల్చడం చూసిన సందర్భాలు నాకు తెలియకుండానే స్పందించేలా చేశాయి. కళ్లు మూసి తెరిచేలోపు బుల్లెట్లు బయటికొచ్చాయి' అందామె.తీవ్రవాదులు తమ కుటుంబంపై ప్రతీకార దాడి చేస్తారని ఆందోళన చెందుతున్న రుక్సానా భవిష్యత్తు లక్ష్యం పోలీసు శాఖలో చేరడం. యువతకు తుపాకీ శిక్షణ ఇవ్వాలన్న వాదనకూ ఆమె మద్దతు పలుకుతుంది. ఆమె తమ్ముడు ధ్యేయమూ రాబోయే రోజుల్లో భారత సైన్యంలో చేరడమే.రుక్సానా సాహసం దేశంలోని మహిళలకు ఎనలేని ప్రేరణనిచ్చింది. 'ప్రాణ, మానాలకు హాని ఎదురైనప్పుడు అపర కాళిక లా మారి అంతు చూడాలన్న రుక్సానా తీరుని మేం అనుసరిస్తాం అంటున్నారు.http://www.eenadu.net/archives/archive-8-10-2009/vasundhara.asp?qry=manulu
ప్రపంచంలో వివిధ ప్రభుత్వాలచే నిషేధింపబడిన సంస్థలు
క్రింద పేర్కొనబడ్డ సంస్థలు, ప్రపంచంలోని పలుదేశాలు, ఉగ్రవాద సంస్థలుగా ప్రకటిస్తూ వీటిని నిషేధించాయి. ఇలాంటి సంస్థల పట్ల అప్రమత్తంగా వుండడం చాలా అవసరం. ఈ పట్టికలో భారతదేశం ప్రకటించిన సంస్థలూ ఉన్నాయి.
ఉగ్రవాదం గురించి కొందరి అభిప్రాయాలు, సంపాదకీయాలు
- యుద్ధాలకు దారితీసే ఉగ్రవాదం
- ముంబాయిలో కనీవినీ ఎరుగని రీతి ఘాతుకాలు జరిపించిన అల్‌ఖాయిదా, లష్కరే-ఎ-తాయిబా, జమాత్-ఉద్- దావావంటి సంస్థల ఆటకట్టించడం, వాటి సారధులను పట్టుకొని శిక్షిం చడం తద్వారా మనకు బెడదగా మారిన ఉగ్రవాద దాడులకు శాశ్వతంగా తెరదించడం యుద్ధంవల్ల సాధ్యమయ్యే పనులుగా తోచడం లేదు. సంప్రదాయ యుద్ధంలో పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పడం సుళువేగాని పోరు ప్రారంభమైన తర్వాత అది సంప్రదాయేతరమైన మలుపు తిరగదని, అణ్వస్త్ర ప్రయో గం వంటి ఊహించనలవి కాని నష్టదాయక పరిణామాలకు దారితీయబోదని అనుకోవడానికి ఎంతమాత్రం వీలులేదు. అమెరికా ఎప్పటి మాదిరిగానే చెరో భుజం మీద చె య్యివేసి తొందరపడవద్దంటూ నెమ్మదిని బోధిస్తున్నది.పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ అష్వక్ పర్వేజ్ కయానీ మాత్రం పాకిస్థాన్‌లో టెరర్రిస్టుల స్థావరాలను నిర్మూలించే ఉద్దేశంతో ఇండియా గనుక తమ భూభాగంపై దాడులకు సమకడితే నిమిషాలలో తిప్పికొడతాం అన్నారు. యుద్ధోన్మాద వాతావరణాన్ని సృష్టించవద్దని ప్రణబ్‌ముఖర్జీ ఆయనకు బదులు పలికారు. జమాత్-ఉద్-దావా ముఖ్య కార్యస్థానమైన లాహోర్ సమీప ప్రాంతంపై ఇండియా వైమానిక దాడి చేయగలదనే వదంతుల నేపథ్యంలో పాక్ వైమానిక దళం జెట్ యుద్ధవిమానాలు రావల్పిండి, లాహోర్ గగనతలంలో యుద్ధ ఘోషతో గిరికీలు కొట్టడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇండియాతో యుద్ధం వస్తే పాక్‌సైన్యానికి అండగా అసంఖ్యాక ఆత్మాహుతిదళాలను రంగంలోకి దింపుతామని తాలిబాన్ `అజ్ఞాత'వాణి ప్రకటించింది. బేనజీర్ భుట్టోను కూడా ఉగ్రవాదమే కబళించిన చేదువాస్తవాన్ని పాక్ గుర్తించలేదనుకోలేము.సున్నితమైన వ్యవహారం. జాగ్రత్తగా గురిపెట్టి లక్ష్యాన్ని ఛేదించేవైపు అడుగులు వేయాలేగాని నిష్ర్పయోజకమైన, నష్టదాయకమైన యుద్ధాన్ని కొని తెచ్చుకోకూడదు.[7]
- మతాన్ని కించపరచడం తప్పు
- హోంమంత్రిగా ఉండగా ముస్లిములంతా ఉగ్రవాదులు కాదు. కానీ, ఉగ్రవాదులంతా ముస్లిములే అని వ్యాఖ్యానించి అపఖ్యాతి పాలయిన అద్వానీ శనివారం తన ప్రసంగంలో తప్పు దిద్దుకున్నారు. ఒక మతాన్ని కించపరచడం తప్పు. అది ప్రతికూల ఫలితాలను ఇస్తుంది అన్నారు.ఉగ్రవాదులు తమ ఈ-మెయిల్స్‌లో ఖురాన్ ను ప్రస్తావించినా మనం ఒక మతాన్ని కించపరచకూడదు. అల్‌ఖైదా తరహా ముఠాలు ఆ గ్రంథానికి తమకు అనుకూలమైన తాత్పర్యాలు తీస్తున్నాయి అన్నారు. హిందువుల గ్రంథాలకు కూడా కొన్ని తమకు అనుకూల తాత్పర్యాలు చెప్పుకొనే అవకాశం ఉంది. ఆ కారణంతో హిందుత్వ ను అవమానిస్తే సహించలేం అని చెప్పారు.[8]
- ముస్లిముల దేశభక్తికి బాల్ ఠాక్రే సెల్యూట్ చేశారు.[9]
- హిందుత్వం తగ్గి, మతాంతరం జరిగిన చోటే ఉగ్రవాదం ఉంది---ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ 21.2.2010
- ఉగ్రవాదం అన్ని మతాలకూ శత్రువే.క్షమను పెంచడానికి, ఉగ్రవాదాన్ని తుంచడానికి సమైక్యంగా కూడిరావాలి.---- ఐక్యరాజ్యసమితి సదస్సులో సౌదీరాజు అబ్దుల్లా
- "అమెరికా ఎన్నడూ ఇస్లాంపై యుద్ధం ప్రకటించదు.మాశత్రువు ఉగ్రవాద సంస్థ అల్ కాయిదాయే.ఉగ్రవాద శక్తులు వివిధ మత విశ్వాసాల మధ్య ఘర్షణ సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి.గ్రౌండ్ జీరో వద్ద చర్చి లేదా హిందూ దేవాలయం నిర్మించడానికి లేని అభ్యంతరం మసీదు నిర్మాణానికి ఎందుకు?అమెరికాకు అసలైన శత్రువులు ఉగ్రవాదులే తప్పించి ముస్లింలు కారు.---అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా[10]
భారత్ పాక్ పరస్పర ఆరోపణలు
- భారత్‌లో మరిన్ని ముంబయి తరహా దాడులు జరిగే అవకాశం ఉంది--- ప్రధాని మన్మోహన్‌సింగ్ హెచ్చరిక
- ముంబయి దాడులలో జమాత్-ఉద్-దవా సంస్థ అధినేత హఫీజ్ సయీద్ పాత్ర ఉంది ---హోంమంత్రి చిదంబరం
- భారత్ పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. పాక్ భూభాగంపై ఎలాంటి ఘాతుకాలు జరిగినా అందుకు భారతే బాధ్యత వహించాలి.మా దేశంలో జరిగిన ప్రతి ఉగ్రవాద దాడి వెనుక భారత్ ప్రమేయం ఉన్నట్లు మా దగ్గర బలమైన సాక్ష్యాధారాలున్నాయి.భారత్ పాక్ ను తప్పుపట్టడమే పనిగా పెట్టుకుంది.---పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహ్మాన్ మాలిక్ (ఈనాడు23.10.2009)
ఉమ్మడిపోరు
ఉగ్రవాదంపై భారత్-పాక్‌లు సంయుక్త పోరు జరపాలని పాక్ విదేశాంగమంత్రి షా మహ్మద్ ఖురేషీ పిలుపునిచ్చారు. పాక్ భూభాగంపై ఏ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదచర్యలను అనుమతించే ప్రసక్తే లేదన్నారు.ఉభయదేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం కోసం చర్చలే శరణ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. (ఈనాడు2.11.2009)
పాదపీఠికలు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-04-25. Retrieved 2013-08-24.
- ↑ Australia has designated the Izz ad-Din al-Qassam Brigades, the military wing of Hamas, as a terrorist organization.
- ↑ Australia has designated the Hizballah External Security Organisation as a terrorist organization.
- ↑ The UK has designated the military wing of Hizballah as a terrorist organization.
- ↑ The European Union has also designated 'Cellula Contro Capitale, Carcere i suoi Carcerieri e le sue Celle', 'Solidarietà Internazionale', 'Cooperativa Artigiana Fuoco ed Affini — Occasionalmente Spettacolare' and the 'July 20 Brigade' as terrorist organizations, all supposedly linked to the Informal Anarchist Federation. See http://www.interno.it/mininterno/export/sites/default/it/sezioni/sala_stampa/interview/Interventi/_sottosegretarioxprecedenti/intervista_233.html_2100293813.html Archived 2009-08-13 at the Wayback Machine
- ↑ 'Shining Path' (స్పానిష్: [Sendero Luminoso] Error: {{Lang}}: text has italic markup (help)) is the name given by Peruvian mass media and government sources to the Maoist Communist Party of Peru.
- ↑ సూర్య సంపాదకీయం 24.12.2008 నుండి
- ↑ ఈనాడు5.10.2008
- ↑ http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=230151&Categoryid=1&subcatid=32
- ↑ ఆంధ్రజ్యోతి 12.9.2010
బయటి లింకులు
- START Global Terrorism Database (also contains data from the defunct MIPT Terrorism Knowledge Base
- Public Safety Canada – Sécurité publique Canada (Currently listed entities)
- US Department of State's Foreign Terrorist Organizations, released April 8, 2008 Fact Sheet.
- US Department of the Treasury, Office of Foreign Assets Control, 'What you need to know about U.S. Sanctions' Archived 2007-07-10 at the Wayback Machine
- European Union list of terrorist groups and individuals, 2007
- Official text of the Terrorism Act 2000 as enacted
- Home office independent reviews of the Act
- Lord Carlile's review of the Act in 2005
- Review of definition of "Terrorism" in British Law published
మూలాలు
- http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=122856&categoryid=1&subcatid=33
- http://www.tribuneindia.com/2008/20081110/main3.htm
- http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=127959&categoryid=1&subcatid=32
- https://web.archive.org/web/20081204053616/http://www.eenadu.net/story.asp?qry1=5&reccount=43