కంకిపాడు

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, కంకిపాడు మండలం లోని జనగణన పట్టణం

కంకిపాడు (ఆంగ్లం: Kankipadu), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామం, మండలం. పిన్. కోడ్ నం. 521 151., ఎస్టీడీ కోడ్ = 08676.

కంకిపాడు
—  రెవిన్యూ గ్రామం  —
కంకిపాడు is located in Andhra Pradesh
కంకిపాడు
కంకిపాడు
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°26′12″N 80°45′47″E / 16.436553°N 80.763080°E / 16.436553; 80.763080
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం కంకిపాడు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 14,616
 - పురుషుల సంఖ్య 6,565
 - స్త్రీల సంఖ్య 6,461
 - గృహాల సంఖ్య 3,210
పిన్ కోడ్ 521151
ఎస్.టి.డి కోడ్ 08676

గ్రామ భౌగోళికంసవరించు

సముద్రమట్టానికి 24 మీ. ఎత్తు.[1]

సమీప గ్రామాలుసవరించు

గొడవర్రు 1 కి.మీ, ప్రొద్దుటూరు 1 కి.మీ, కోలవెన్ను 2 కి.మీ, దావులూరు 3 కి.మీ, చినపులిపాక 3 కి.మీ

సమీప మండలాలుసవరించు

పెనమలూరు, తోట్లవల్లూరు, వుయ్యూరు, గన్నవరం

గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు

 • జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
 • మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, లాకుగూడెం.
 • సెయింట్ మేరీస్ పాఠశాల.
 • కృషి ప్రాథమికోన్నత పాఠశాల.
 • ఎస్.ఎస్. ప్రగ్న్య జూనియర్ పాఠశాల.

గ్రామంలో జన్మించిన ప్రముఖులుసవరించు

 
వాగార్జున సాగర్ వద్ద ఉన్న కె.ఎల్.రావు విగ్రహం

రవాణా సౌకర్యాలుసవరించు

కంకిపాడు, మానికొండ, పెనమలూరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ.

ప్రధాన గ్రామీణ రహదారులుసవరించు

బ్యాంకులుసవరించు

 1. ది కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్.
 2. ది కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్., కంకిపాడు-
 3. సప్తగిరి గ్రామీణ బ్యాంక్.
 4. ది కంకిపాడు మండల కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్.

కంకిపాడు డైరీసవరించు

కంకిపాడులో ఈ డైరీని 2011లో 3 కోట్లరూపాయల వ్యయంతో ఏర్పాటు చేసినారు. తొలిదశలో లక్ష్యాన్ని మించి పాలసేకరణ జరిగినది. కానీ రెండు సంవత్సరాల అనంతరం, ఇది, నిర్వహణపరమైన లోపాలతో మూతబడినది.

రైతు బజార్సవరించు

స్థానిక రహదారి బంగళా ఆవరణలో, 2013, మార్చి‌లో 20 రైతు దుకాణాలు, నాలుగు డ్వాక్రా దుకాణాలతో ప్రారంభమైన ఈ రైతుబజార్, ప్రస్తుతం 37 దుకాణాలకు చేరింది. మొదటి సంవత్సరం రోజుకు సగటున ఒక లక్ష రూపాయల కొనుగోళ్ళు జరుగగా, ఇప్పుడు నాలుగు లక్షల రూపాయలకు పెరిగింది. ఈ రైతుబజారులో దుకాణాన్ని కేటాయించడానికి, రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు జియో ట్యాగింగ్ విధానాన్ని అనుసరించుచున్నారు. దీనితో వాస్తవంగా కూరగాయలు సాగుచేయుచున్నవారికే ఇక్కడ దుకాణం లభించుచున్నది. అందువలననూ, ప్రభుత్వం జరీ చేసిన మార్గదర్శకాలు కఠినంగా ఉండటంతో, దళారుల బెడద చాలా తగ్గిపోయింది. 50 గ్రామాలకు ప్రధాన కూడలి అయిన ఈ రైతు బజార్ లో, విజయవాడ రైతుబజారులోని ధరలనే అమలుచేస్తున్నారు.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

చాలా సంవత్సరాల తరువాత, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా, ఈ చెరువు ప్రక్షాళన పనులను, 2016, మే-10న ప్రారంభించారు.

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కాయగూరలు.

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

 1. శ్రీ గంగాపార్వతీ సమేత రామలింగేశ్వరాలయం.
 2. శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం (విష్ణాలయం).
 3. శ్రీ గొంతేనమ్మ అమ్మవారి ఆలయం.
 4. శ్రీ కోదండ రామాలయం (పాత పెట్రోలు బానికి ఎదుట ఉంది)
 5. శ్రీ రమా సహిత సత్యనారాయణస్వామివారి ఆలయం.
 6. స్థానిక గన్నవరం రహదారి విస్తరణలో భాగంగా తొలగించిన పోతురాజు విగ్రహాన్ని, గంగానమ్మ ఆలయంలో శాస్త్రోక్తంగా పునఃప్రతిష్ఠించారు.

మూలాలుసవరించు

 1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kankipadu/Kankipadu". Retrieved 18 June 2016. External link in |title= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=కంకిపాడు&oldid=3306296" నుండి వెలికితీశారు