కుందేరు నది, ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్న ఎర్రమల కనుమలలో పుట్టి దక్షిణ దిశలో ప్రవహించి వైఎస్ఆర్ జిల్లా, కమలాపురం సమీపములో పెన్నా నదిలో కలుస్తుంది. దీనిని కుందూ, కుముద్వతి అని పేర్లతో కూడా వ్యవహరిస్తుంటారు.ఈ నదీతీరాన ఉన్న పట్టణాలలో నంద్యాల ముఖ్యమైంది, అతి పెద్దది.కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు, మిడుతూరు, గడివేముల, నంద్యాల, గోస్పాడు, కోయిలకుంట్ల, దొర్నిపాడు, చాగలమర్రి, వైఎస్ఆర్ జిల్లాలోని మైదుకూరు మండలాలు కుందేరు నది నీటి పరీవాహక పరిధిలో ఉన్నాయి.

నంద్యాల-కర్నూలు మార్గంలో కుందూనది - 2009 అక్టోబరు మాసంలో వరదలు వచ్చినప్పుడు తీయబడిన చిత్రము

కుందేరులో నీళ్లు పశ్చిమాన మద్దులేరు, జుర్రేరు నుండి తూర్పున కాళి, వక్కలేరు నుండి చేరతాయి. కుందేరు, మద్దులేరు నిండా నీటితో ప్రవహించినప్పుడు వాటి మధ్యన ఉన్న జలకనూరు వంటి గ్రామాలు నీటితో నిండిపోతాయి. జుర్రేరు బనగానపల్లె ప్రాంతం నుండి ప్రవహించి కుందేరులో చేరుతుంది.కుందేరు నదీ అడుగున ఎక్కవ భాగం రాతిమయంతో ఉంటింది.ఇక్కడ సున్నపురాళ్లను త్రవ్వి తీస్తారు.నది అడుగు శిలల పొరలతో ఉంటాన నీరు భూమిలోకి ఇంకక పోవడం ఈ నది విశేషం. దీనివల్ల నది వెంబడి ఉన్న బావుల్లో నీరు తాగే యోగ్యంగా లేదు.నంద్యాల వద్ద కుందేరు కర్నూలు - కంభం రహదారి దాటే చోట 1864లో ఒక వంతెన నిర్మించారు.

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కుందేరు&oldid=2984360" నుండి వెలికితీశారు