కంచిలోని దేవాలయాల జాబితా

వికీమీడియా పట్టిక

కాంచిపురం ను కంచి, కాంచి అని కూడా అంటారు. తమిళనాడు  రాష్ట్రంలోని ఈ పట్టణం దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. పల్లవుల రాజధానిగా కూడా వెలుగొందింది ఈ పట్టణం. పూర్వం ఈ పట్టణాన్ని కాంజీవరం, కాంచీ పట్టణం అని వ్యవహరించేవారు. "వేయి ఆలయాల పట్టణం" అని కూడా పిలిచేవారు.[1] ప్రస్తుతం కాంచీపురం జిల్లకు రాజధానిగా ఉంది. చెన్నై నుంచి దాదాపు 72 కిలోమీటర్ల దూరంలో ఉంది కంచి.

హిందువులకు మోక్షప్రదానమైన ఏడు నగరాల్లో కాంచీపురం ఒకటి. మోక్షభూమి, శక్తి భూమిగా ఈ క్షేత్రం ఎంతో పవిత్రమైనదిగా హిందువుల నమ్మకం. గరుడ పురాణం ప్రకారం మోక్షన్ని ఇచ్చే నగరాలు ఏడు  అవి వరసగా అయోధ్యమధురహరిద్వార్కాశీ, అవంతికా, ద్వారక,  కంచి. అంత ప్రాముఖ్యత కలిగిన ఈ నగరంలో అడుగడుగునా  దేవాలయాలే దర్శనమిస్తాయి.

ఆలయాల జాబితా

మార్చు

హిందువుల ముఖ్యమైన దేవాలయాల్లో చాలావరకు కాంచీపురంలోనే ఉండటం విశేషం, ప్రముఖ వైష్ణవాలయం వరదరాజస్వామి ఆలయం, శైవాలయం ఏకాంబ్రేశ్వరస్వామి గుడి, శక్తి క్షేత్రం కామాక్షి దేవి ఆలయం, కుమార కొట్టం, కచెపేశ్వర దేవాలయం, కైలాసనాథ ఆలయం వంటి దివ్య ఆలయాలు కంచిలో ఉన్నాయి.

దివ్య దేశాలు - దివ్య ప్రబంధంలో పేర్కొన్న వైష్ణవాలయాలను దివ్య దేశాలని పిలుస్తారు. 6-9 శతాబ్దాల మధ్య ఉన్న ఆళ్వారులు రాసిన దివ్య ప్రబంధాలలో ఈ క్షేత్రాల ప్రస్తావన వస్తుంది. కాంచీపురం ఒక్కదానిలోనే 15 దివ్య దేశాలుండటం విశేషం. పదల్ పెట్ర స్థలం - 63 నాయనార్లలో ప్రముఖులైన ముగ్గురు నాయనార్లు అప్పర్, సుందరర్, తిర్గుణ సంబంధర్ లు రాసిన తమిళ శైవ సాహిత్యం తేవరంలో ప్రస్తావించిన శైవ పుణ్యక్షేత్రాల్లో 11 పాదల్ పెట్ర స్థలాలు కాంచీపురంలోనే ఉన్నాయి. వీరు 7-8 శతాబ్దాల మధ్యలోని వారు.

అటు వైష్ణవాలయాలు, ఇటు శైవాలయాలు, అష్టాదశ పీఠాల్లో ఒకటైన  కామాక్షీ ఆలయాలతో ఎంతో ప్రాశస్త్యం ఉంది ఈ నగరానికి.

ఆలయం ఫోటో నిర్మాణ కాలం నోట్స్
శివాలయాలు
ఏకాంబ్రేశ్వరాలయం
 
600 సంవత్సరం, పల్లవులు నిర్మించారు, తంజావూరు నాయక రాజులు పునర్మించారు. నగరానికి ఉత్తర దిక్కులో ఉండే ఈ గుడి కంచిలోని అన్ని దేవాలయాలకన్నా పెద్దది.[2] ఈ ఆలయ గోపురం దాదాపు 59 మీటర్ల ఎత్తు. [3] పంచభూతాత్మక లింగాలలో ఈ లింగం పృధ్వీలింగం.[4] [5]
కైలాశనాథాలయం
 
567వ సంవత్సరంలో కట్టారు, రాజసింహ పల్లవ రాజు 7వ శతాబ్దంలో విస్తరించారు.[6] పల్లవులు నిర్మించిన ఈ ఆలయం అతిపురాతనమైనది. ఈ ఆలయం వాస్తు సంపదకూ, శిల్ప సంపదకూ ఎంతో ప్రసిద్ధమైనది. [by whom?][6]
కర్చపేశ్వర దేవాలయం
 
పల్లవులు నిర్మించారు.[7] తంజావూరు నాయకరాజులు పునర్మించారు.[8] కూర్మరూపంలో ఈ శివాలయంలోని శివలింగాన్ని విష్ణువు పూజించాడని ప్రతీతి[6] కొన్ని గ్రంథాల్లో ఈ ఆలయాన్ని కచిపెడు అని కూడా ప్రస్తావించారు.[6] కంతకొట్టం ఆలయం పక్కనే ఉంటుంది ఈ గుడి.
సత్యనాదేశ్వర దేవాలయం
 
7వ శతాబ్దంలో తిర్గుణ సంబంధర్ తెవరం అనే తమిళ శైవ ప్రబంధంలో మొదటి పదల్ పెట్ర స్థలం (దివ్య శైవ క్షేత్రం) గా దీనిని పేర్కొన్నారు.
మెట్రలేశ్వర్ ఆలయం అప్పర్, సంబంధర్ లు ఈ ఆలయాన్ని పదల్ పెట్ర (దివ్య శైవ క్షేత్రం) స్థలంగా పేర్కొన్నారు.
ఒణ కంఠేశ్వర ఆలయం
 
[9]
అనెకథంగవదేశ్వర దేవాలయం
 
ఈ ఆలయం చుట్టూ ఒకప్పుడు అడవి ఉండేదిట.[9] ప్రస్తుతం కైలాశనాథాలయం ఆవరణలో చిన్న గుడిగా ఉంది.
కురంగణిల్ముట్టం పల్లవులు నిర్మించారు.[10] కంచికి దక్షిణ దిక్కులో మమందుర్ కు దగ్గరగా ఉంటుంది ఈ గుడి. ఈ గుళ్ళో కోతి, ఉడుత, కాకిల రాతి విగ్రహాలు ఉన్నాయి.[10] కంపనాథర్ ఈ గుడిని పునర్మించారు.[10]
జలనాథేశ్వరాలయం, తక్కోళం పల్లవ రాజు అబరాజిత వర్మ కాలంలో 876వ సంవత్సరంలో నిర్మించిన రాతి ఆలయం ఇది. రాజగోపురం మాత్రం విజయనగర రాజు వీర ప్రధబ సదాశివ మహారయర్ కాలంలో 1543లో నిర్మించారు. ప్రధాన దేవతామూర్తులు జలనాథేశ్వరుడు, అమ్మవారు గిరిరాజ కణ్ణిగాంబ. దక్షిణాయన కాలంలో ఈ లింగం తెల్లగానూ, ఉత్తరాయణ కాలంలో లేత ఎరుపు రంగులోనూ ఉండటం ఇక్కడి విశిష్టత.
తిరుమగరలేశ్వరాలయం
 
కంపనాథర్ ఈ ఆలయాన్ని ఎన్నో ప్రబంధాల్లో కీర్తించారు. [11]
వేదపురేశ్వర ఆలయం, చెయ్యార్ ఈ ప్రదేశం అంతకుముందు జైనాలయం, కంపనాథర్ కాలంలో ఇది శైవాలయంగా మార్చబడింది. ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే తాటిచెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది.
తిరుమర్పెరు ఈ ఆలయంలోని లింగాన్ని విష్ణువు పూజించాడు కాబట్టి ఈ ఆలయానికి తిరుమర్పెరు అని పేరు వచ్చింది. ఈ గుడి రాజగోపురానికి నాలుగు అంతస్తులు ఉన్నాయి. రాజరాజ చోళ I (985 – 1014) కు చెందిన శాసనాలు ఈ ఆలయంలో లభించాయి. ఈ ఆలయాన్ని హరిచక్రపురం అని కూడా అంటారు. ఇతర శివాలయాల్లో లాగా ఇక్కడి నంది కూర్చొని ఉండడు. నుంచుని ఉండే నందిని మనం ఇక్కడ మాత్రమే చూడగలం.
శ్రీ తలపురేశ్వర, కృబంధేశ్వర, పనగట్టు ఈశ్వరాలయం సుందరర్ నాయనార్ ఈ ఆలయం గురించి తన తేవరం పద్యాలలో ప్రస్తావించారు.
ముక్తేశ్వర్ ఆలయం నందివర్మ II పల్లవుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. ఇక్కడి మండపం వద్ద ఉన్న శిల్పాలు నామమాత్రంగానే కనిపిస్తున్నాయి.[9]
వళకరుతేశ్వరాలయం వళక్కు అంటే వ్యవహారాలకు చెందిన పూజ అని అర్ధం ఈ ఆలయాన్ని దర్శించినవారికి అన్ని రకాల కోర్టు కేసుల్లో, వ్యవహారాల్లో విజయం లభిస్తుందని భక్తుల నమ్మిక.[12] తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కళానిథి కుమార్తె కనిమొళి పై కేసులు ఉన్న సమయంలో ఆ పార్టీకి చెందిన వసంతి స్తన్లీ ఈ ఆలయం దర్శించుకున్నారు. దాంతో కనిమొళి కేసు వ్యవహారాల్లో కొంత ఉపశమనం పొందారు. దాంతో ఈ ఆలయం గురించి మళ్ళీ ప్రజల ప్రాచుర్యం పొందింది. ఈ కేసు కన్నా ముందే కోర్టు వ్యవహారల విషయంలో ఈ ఆలయన్ని దర్శించుకునేవారట స్థానికులు.[12]
ఐరవత్నేశ్వర ఆలయం
 
పల్లవులు 8వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అధ్బుతమైన నిర్మాణ సౌందర్యం ఉన్న ఈ ఆలయ విమాన గోపురం చాలా ప్రసిద్ధి చెందింది. [13] పల్లవ రాజు నరసింహవర్మ II ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ గుడిని జాతీయ పురావస్తు శాఖ అపురూప కట్టడంగా కాపాడుతోంది.[14]
శక్తి పీఠం
కామాక్షీ ఆలయం
 
6వ శతాబ్దంలో పల్లవులు అమ్మవారికి గుడిని కట్టారు (శక్తి పీఠం అయిన ఈ ఆలయం పురాణకాలం నుండే ఉండేదనీ, పల్లవులు ప్రస్తుత రూపంలో నిర్మించారని భక్తుల విశ్వాసం). 14 -17 శతాబ్దాల మధ్య పునర్మించారు. [15] అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఈ ఆలయంలో కామాక్షిదేవి మూలమూర్తిగా పూజలందుకుంటున్నారు. ఎక్కడైనా అమ్మవారు యంత్రంపై ఉంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం అమ్మవారు పీఠంపై ఉంటారు, శ్రీచక్ర యంత్రం అమ్మవారి ముందు నేలపై ఉంటుంది. [16] ఈ ఆలయానికి ఆదిశంకరాచార్యులు వచ్చి అమ్మవారి కళలను తగ్గించి, భక్తుల సందర్శనానికి వీలుగా చేశారని భక్తులు చెబుతారు. ఈ అమ్మవారి పేరుమీదనే కాలడిలో కంచి మఠం ప్రారంభించారట శంకరాచార్యులు. 5వ శతాబ్దంలో ప్రారంభించిన ఈ మఠానికి ప్రస్తుత అధిపతిగా జయేంద్ర సరస్వతీ స్వామి విజయం చేస్తున్నారు. ఈయన 69వ మఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు.[17]
విష్ణువు ఆలయాలు
వరదరాజస్వామి ఆలయం
 
1053 లో, చోళులు నిర్మించగా, 14-15 శతాబ్దాల మధ్య తంజావూరు నాయకరాజులు పునర్మించారు. చోళుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం, [18] కుళోత్తుంగ చోళ I, విక్రమ చోళుల కాలంలో విస్తరించారు. 14వ శతాబ్దంలో తరువాతి చోళరాజుల సమయంలో ఇంకో గోడ, గోపుర నిర్మాణం జరిగాయి. విష్ణువు యొక్క 108 దివ్య దేశాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఇది చాలా పురాతనమైన ఆలయం. ఎక్కువ విష్ణ్యాలయాలు కలిగిన కాంచీపుర ప్రాంతమైన విష్ణు కాంచిలో ఉంది ఈ ఆలయం. విశ్వకర్మ నిర్మాణ తరహాలో ఉండే ఈ ఆలయ నిర్మాణం చాలా విశిష్టంగా ఉంటుంది. 23-ఎకరం (93,000 మీ2) ఈ ఆలయంలో బంగారు బల్లి, వెండి బల్లీ ఉన్నాయి. వీటిని జీవితంలో ఒక్కసారి ముట్టుకుంటే ఇక బల్లి మీదపడటం వల్ల ఉండే ఏ దోషాలు ఉండవని హిందువుల నమ్మకం. ఈ బల్లి రూపాలు పైకప్పుపై తాపడం చేసి ఉంటాయి.[19]
అష్టభుజకరం - శ్రీ ఆదికేశవ స్వామి ఆలయం అష్టభుజకరం అంటే 8 చేతులుండే దేవుడు అని అర్ధం.
తిరువెక్కా - శ్రీ యోథత్కరీ ఆలయం
 
ఈ స్వామిని సొన్న వన్నం సెయితీ పెరుమాళ్ అని అంటారు. అంటే నిజం చెప్పేవాడు అని అర్ధం. వరదరాజ ఆలయానికి పడమరన ఉంటుంది ఈ ఆలయం[20]
తిరుతుకంఠ - శ్రీ దీప ప్రకాశ పెరుమాళ్ ఆలయం
 
ఈ ఆలయంలో లక్ష్మీదేవి, హయగ్రీవ, ఆండాళ్, వేదాంత దేశికా, ఆళ్వారుల గుళ్ళు కూడా ఉన్నాయి.
తిరువెళుక్కాయ్ - శ్రీ అళగియ సింగర్ ఆలయం
 
నరసింహస్వామి ఆలయం ఇది.
తిరుకళ్వనూర్ - శ్రీ ఆది వరాహ స్వామి ఆలయం ఈ ఆలయంలో కామాక్షి అమ్మవారి ఆలయం కూడా ఉంది.
ఉళగలంత పెరుమాళ్ ఆలయం
 
846-869 మధ్యకాలంలో, నందివర్మన్ III నిర్మించారు.[21] చోళ రాజు కరికళుడు నిర్మించారు.[22] ఈ నాలుగు ఆలయాలనూ ఒకే ప్రాంగణంలో ఉంటాయి.[20]
తిరునేరగం - శ్రీ జగదేశ్వర ఆలయం
తిరుకారగం - శ్రీ కరుణగర పెరుమాళ్ ఆలయం
తిరుకార్వానం - శ్రీ తిరుకావర్నర్ ఆలయం
Tiruparamechura Vinnagaram - Sri Vaikunda Perumal Temple
 
Late 8th century, Nandivarman II[23] The place is the birthplace of the azhwar saint, Poigai Alvar.[23] The central shrine has tiers of 3 shrines, one over the other, with Vishnu depicted in each of them.[23] The prakaram (corridors round the sanctum) has series of sculptures depicting the Pallava rule and conquer.[23]
Tirupavalavannam - Sri Pavala Vanar Temple
 
The temple faces west and the twin aswins have worshipped the deity here.[20]
Tirupaadagam - Sri Pandava Thoodar Temple
 
Expanded in 1070-1120 CE, Kulothunga Chola I[24][22] The temple has a set of inscriptions associated with Cholas. A record of the Chola king, Rajakesari Varaman alais Kulothunga Chola I, dated in his fifth year.[22]
Tirunilaaththingalthundam - Sri Nilathingal Thundathan Perumal Temple The temple is a small shrine close to the sanctum sanctorum of the Ekambranathar temple.
Tirupputkuzhi - Sri Vijaya Raghava Perumal Temple
 
Other Temples
కుమారకొట్టం
 
ఇది సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం. శివ పార్వతుల కొడుకైన కుమారస్వామి వారిద్దరికీ మధ్యలో ఉంటాడు. అప్పుడు ఆయనను సోమస్కంధుడు అంటారు. ఈ ఆలయం కూడా ఏకాంబ్రేశ్వరస్వామి ఆలయం, కామాక్షీ ఆలయాల మధ్యలో ఉండట విశేషం. సంస్కృత స్కాందపురాణాన్ని 1625లో కచిప్ప శివాచార్య ఈ ఆలయంలో కూర్చుని తమిళంలో కుందపురాణం పేరుతో అనువదించారు.[8]
చిత్రగుప్తుని ఆలయం
 
9వ శతాబ్దంలో చోళులు ఈ ఆలయాన్ని నిర్మించారు.[24][25] హిందూ పురాణాల ప్రకారం యముని తమ్ముడైన చిత్రగుప్తుడు మనుషుల పాప, పుణ్యాలను లెక్కకట్టి స్వర్గార్హులా, నరకార్హులా అని నిర్ణయిస్తుంటాడు.[25] చిత్రగుప్తుని ఈ ఆలయం అతి అరుదైనది. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద చిత్రగుప్తునికి అతి తక్కువ ఆలయాలు ఉన్నాయి.[25] 1911లో పురావస్తు శాఖ తవ్వకాల్లో ఈ పంచలోహ విగ్రహం బయటపడింది.[25]
Parithiyur- Kalyana Varadharaja Perumal Temple
Sri Aadhi Kesava Perumal - Kooran [about 8 to 9 km from Kanchipuram]
Vamanar temple (very near to Kamakshi Temple)
Dhrmalingeswarar Temple (Kayaar Kulam)
Neervalur - Sri Veetrirunda Lakshmi Narayana Perumal Temple
Sangupani Vinayakar Temple
Satyanadeeswara Temple
Kanaka Durga Temple, Koneri Kuppam
Upanishada Bramham Mutt - Place where Lalitha Sahasrama was revealed. Rama Yantra has been installed by Sage Narada
Jain Temples
Trilokyanatha Temple - Jain Temple
 
8th century CE, Pallavas[7] Trilokyanatha/Chandraprabha temple is a twin jain temple having inscriptions from Pallava king, Narasimhavarman II and the Chola kings Rajendra Chola I, Kulothunga Chola I and Vikrama Chola, and the Kanarese inscriptions of Krishnadevaraya. The temple is maintained by Tamil Nadu archaeological department.[26]

నోట్స్

మార్చు
  1. "Tourist Places" Archived 2012-04-23 at the Wayback Machine.
  2. Let's Go (2004), Let's Go India & Nepal 8th Edition, NY: Let's Go Publications, p. 584, ISBN 0-312-32006-X
  3. Sajnani 2001, pp. 305
  4. Ramaswamy 2007 , pp. 301-302
  5. A dictionary, Canarese and EnglishWilliam Reeve, Daniel Sanderson
  6. 6.0 6.1 6.2 6.3 Ayyar 1991, pp. 73
  7. 7.0 7.1 "Tmple". 2001. Archived from the original on 2012-01-06. Retrieved 2016-10-04.
  8. 8.0 8.1 Rao 2008, p. 110
  9. 9.0 9.1 9.2 Ayyar 1991. p. 86
  10. 10.0 10.1 10.2 Soundara Rajan 2001, p. 27
  11. K. R. 2002, p. 40
  12. 12.0 12.1 "DMK distances itself from poojas for Kanimozhi by Party MP". Archived from the original on 2016-03-04. Retrieved 2016-10-04.
  13. Ayyar 1991, p. 74
  14. "List of protected monuments in Tamil Nadu maintained by ASI".
  15. Abram, David; Edwards, Nick; Ford, Mike; Jacobs, Daniel; Meghji, Shafik; Sen, Devdan; Thomas, Gavin (2011), The Rough guide to India, Rough Guides, p. 456, ISBN 978-1-84836-563-6
  16. Ayyar 1991, pp. 70-71
  17. "Kamakoti.org".
  18. "Abodes of Vishnu - Thirukkachchi".
  19. "Gateway to Kanchipuram district - Varadaraja Temple". Archived from the original on 2013-07-30. Retrieved 2016-10-04.
  20. 20.0 20.1 20.2 Ayyar 1991, p. 539
  21. Rao 2008, p. 109
  22. 22.0 22.1 22.2 Ayyar 1991, p. 75
  23. 23.0 23.1 23.2 23.3 Ayyar 1991, p. 80
  24. 24.0 24.1 Rao 2008, p. 111
  25. 25.0 25.1 25.2 25.3 "The Hindu : Shrine for Chitragupta". 2003. Archived from the original on 2013-04-27. Retrieved 2016-10-04.
  26. "Deprived of original élan". 2011.