కందరెడ్డి (సత్తి భాస్కర రెడ్ఢి), తూర్పు గోదావరి జిల్లా, కడియం మండలం దుళ్ళ గ్రామానికి చెందిన ఆదర్శ రైతు.[1] ఆ గ్రామంలో అతను కోసం వెళ్లినవారు సత్తిరెడ్డి ఇల్లు ఎక్కడ అని అడిగితే తెలియదంటారు.అదే కందరెడ్డి ఇల్లు ఎక్కడ అని అడిగితే చిన్న పిల్లలుతె సహా అదిగో కాటన్ దొర విగ్రహం ఎదురు మేడ అని చెపుతారు.దానికి కారణం ధవళేశ్వరం ఆనకట్టను నిర్మించిన కాటన్ విగ్రహం స్వంతంగా కందరెడ్డి ఇంటివద్ద నిర్మించి, ప్రతి సంవత్సరం జయంతి ఉత్సవాలు జరుపుతాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కందపంట పండించటంలో పేరొందిన రైతు. ఇతను అసలు పేరు సత్తి భాస్కరరెడ్డి.[2]

కష్టాల సత్తిరెడ్డి

మార్చు

అసలు సత్తిరెడ్డి భాస్కరరెడ్డి తల్లిదండ్రులు స్వంతవూరు రావులపాలెం.ఆ గ్రామంలో వీరు నిరుపేద కుటుంబీకులు. భాస్కరరెడ్డి చదువుకోవటానికి పరిస్థితులు కలసిరాలేదు.ఇల్లు గడవటానికి ఆ గ్రామానికి చెందిన మోతుబరి దగ్గర పాలికాపుగా 11 సంవత్సరాల వయస్సులో నెలకు 15 రుపాయల జీతంపై పనికి కుదిరాడు.అతని పేదరికపై కసిపెంచుకున్నాడు.తను రైతు కూలిగా జీవించకూడదనే ఆశయంతో 5 సంవత్సరాలు పాలెకాపుగా పనిచేసి, వ్వవసాయంలో అన్ని మెలుకువలు పసిగట్టాడు.16 సంవత్సరాల వయస్సులో రావులపాలెంలో తన స్తోమతకు తగినవిధంగా ఒక అర ఎకరం పొలం కౌలుకు తీసుకున్నాడు.అలా నాలుగు సంవత్సరాలు గడిచాక తిరిగి కష్టాలు తలెత్తాయి.కౌలుకు భూమి దొరకని పరిస్థితి.అలాంటి పరిస్థితులలో దుళ్ల గ్రామానికి మకాం మార్చాడు. కసితో రెండుకరాలు భూమిని కౌలుకు తీసుకుని, ఆ గ్రామంలో ఎవరూ వేయని కందపంటను దానిలో సాగుబడి చేసాడు.తను ఊహించని పంట చేతికందింది. దానితో భాస్కరరెడ్డి ఆర్థిక కష్టాలు గట్టెక్కాయి.

బాస్కరరెడ్డి కందరెడ్డిగా పేరు మారిన వైనం

మార్చు

దానితో వ్యవసాయంలో వెనుతిరిగి చూడలేదు.రెండు ఎకరాల నుండి 100 ఎకరాల సాగు రైతుగా ఎదిగాడు.కందసాగు భాస్కరరెడ్డి జీవితాన్ని మార్చి వేసింది. అంతటితో ఆగకుండా ప్రజలమదిలో సత్తి భాస్కరరెడ్డిని కందరెడ్డిగా మార్చింది.రాను,రాను కందపంటతో పాటు, అరటి, పెండలం, ఇతర కూరగాయలు రకాలతో కలుపుకుని ఇలా దాదాపు 20 రకాల బహుళపంటలు సాగుచేసి, ఏడాదికి పంట దిగుబడులు 200 లారీలకు పెంచాడు.ఇంత ఎదిగినా సెంటు స్వంత భూమి లేకుండా జాగత్తపడ్డాడు.ఎడాదికి అతను కౌలు రౌతులకు 50 లక్షలు కౌలుకింద చెల్లిస్తాడు.

అవార్డులు, పురస్కారాలు

మార్చు

కందరెడ్డి సాధించిన విజయాలు గుర్తించిన అనేక సంస్థలు అతనిని అవార్డులతో సత్కరించాయి.పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల నుంచి పలు ప్రతిష్టాత్మకమైన పురస్కారాలతో పాటు గౌరవ డాక్టరేట్‌ పొందారు. ముప్పవరపు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రైతునేస్తం అవార్డుల ప్రధానోత్సవంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు నుంచి రైతునేస్తం అవార్డును అందుకున్నాడు.[3]

సమాజసేవలో కందరెడ్డి

మార్చు

కందరెడ్డి అతను సంపాజించిన ఆదాయంలో 50% ఆదాయ సౌమ్మును సమీప గ్రామాలు వికలాంగుల పిల్లలకు బస్సు పాసులు ఉచితంగా అందిస్తాడు. మూడు గ్రామాలు పేదరైతులకు ట్రాక్టర్లు అందచేసాడు.కరోనా సమయంలో నిత్యావసర వస్తువులు అనేకమందికి అందిచ్చాడు. దుళ్ళ గ్రామంతో పాటు మురమండ, వీరవరం, ఆలమూరు మండలం చొప్పెల్ల వంటి పరిసర గ్రామాల్లో పార్కులు, ఆలయాల అభివృద్ధికి విరాళాలు అందజేసాడు.

మూలాలు

మార్చు
  1. ABN (2020-12-17). "కందరెడ్డికి రైతునేస్తం అవార్డు". Andhrajyothy Telugu News. Retrieved 2023-01-26.
  2. ఆదివారం, ఆంధ్రజ్వోతి (12 సెప్టెంబరు 2021). "కందరెడ్డి కథే వేరు": 6. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  3. ABN (2020-12-17). "కందరెడ్డికి రైతునేస్తం అవార్డు". Andhrajyothy Telugu News. Retrieved 2023-01-26.

వెలుపలి లంకెలు

మార్చు