కందుల ఓబుల్ రెడ్డి

కందుల ఓబుల్ రెడ్డి (1901 జూలై 7 - 1993 జనవరి 3) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఓబుల్ రెడ్డి 1955 నుంచి 1978 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు. అలాగే ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా పని చేశాడు. ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమరయోధుల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశాడు. అతను 1955 నుండి 1962 వరకు మార్కాపురం శాసనసభ నియోజకవర్గం[1], 1972లో యెర్రగొండపాలెం నియోజకవర్గం[2], 1978లో కంభం నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించాడు.[3]

ప్రధాని ఇందిరా గాంధీతో కందుల ఓబుల్ రెడ్డి
భారత మాజీ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు తో ఓబుల్ రెడ్డి
గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ఓబుల్ రెడ్డి

కందుల ఓబుల్ రెడ్డి కుటుంబం ప్రకాశం జిల్లా కంబం నియోజకవర్గంలో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది.

కందుల ఓబుల్ రెడ్డి రిజర్వాయర్ ప్రాజెక్ట్[4] మార్చు

కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్ట్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుకు ఓబుల్ రెడ్డి జ్ఞాపకార్థం కందుల ఓబుల్ రెడ్డి ప్రాజెక్టుగా నామకరణం చేశారు. దివంగత శ్రీ కందుల ఓబుల్ రెడ్డి పేరు మీద ఉన్న ఈ ప్రాజెక్ట్ రబీ కింద 80060 ఎకరాలు (32400 హెక్టార్లు) ఖరీఫ్ కింద 62368 ఎకరాలు (25240 హెక్టార్లు) ఆయకట్టుకు సాగునీటి సౌకర్యాన్ని అందిస్తుంది. కందుల ఓబుల్ రెడ్డి ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లాలోని 6 మండలాల్లో భూములకు 43 గ్రామాలకు త్రాగునీటిని అందిస్తుంది.

మూలాలు మార్చు

  1. "Andhra Pradesh Assembly Election Results in 1955". Elections in India. Retrieved 2024-02-14.
  2. "Andhra Pradesh Assembly Election Results in 1972". Elections in India. Retrieved 2024-02-14.
  3. "Andhra Pradesh Assembly Election Results in 1978". Elections in India. Retrieved 2024-02-14.
  4. "Kandula Obula Reddy Gundlakamma Reservoir Project :-". irrigationap.cgg.gov.in. Retrieved 2024-02-14.