కంసాలి

(కంసలి నుండి దారిమార్పు చెందింది)

వెండి, బంగారం, మొదలైన లోహాలతో ఆభరణాలు చేయు అతనిని స్వర్ణశిల్పి అంటారు. సువర్ణ శిల్పుల లలో వీరంతా, గ్రామంలో ఒక స్థలంలో ఈ ఐదు వృత్తులనూ చేస్తూ గ్రామానికి కావల్సిన వస్తువులను సమకూర్చేవారు. ఆ స్థలాన్నే విశ్వకర్మశాల అని ఆ రోజుల్లో వ్యవహరించేవాళ్ళు. క్రమేణా ఆ పేరు కాస్తా 'కర్మశాల'గా మారి, 'కమశాల'గా మారి, స్వర్ణకారు లుగా పేరు పొందారు

కుల చరిత్ర

మార్చు
 
కంసాలిగా పిలిచే స్వర్ణకారుడు

వ్యుత్పత్తి:కంసాలీలు విరాట్ విశ్వకర్మ సంతతికి చెందినవారు. విరాట్ విశ్వకర్మ పంచ ముఖాల నుండి

ఈ పంచ బ్రహ్మల నుండి

అయోకారుడు

మార్చు

అయో కారుడు ముడి ఇనుంను సంగ్రహించడం, ఇనుంను తయారు చెయ్యడం, ఆ ఇనుంతో వ్యవసాయానికి కావల్సిన కర్రు, పార, పలుగు, గునపం, గొడ్డలి, బండికట్టు మొదలైనవి, దేశానికి కావల్సిన వంతెనలు, పరిశ్రమలు, పడవలు, ఫిరంగులు మొదలైనవి. ఇనుప వస్తువుతో ప్రతిదీ చేసి ఇచ్చే మొట్ట మొదటి మెటల్ ఇంజనీర్ , ఆ రోజుల్లోనే వీరు చేసిన ఇనుంలోని స్వచ్ఛత ఈ రోజుకీ నేటి విదేశీ ఇంజనీర్లు సైతం రాబట్టలేకున్నారు.ఉదాహరణకి ఢిల్లీ లోని విఠోబా స్థంబం తయారు చేసి వందల సంవత్సరాలు ఐనా, అది ఈ రోజుకీ తుప్పు పట్టలేదు.ఆ ఇనుం స్వచ్ఛత గురించి ఈరోజుకీ ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు.

ధారుకారుడు

మార్చు

దారు కారుడు (వడ్రంగి) వ్యవసాయానికి కావల్సిన కాడి, మేడి, నాగలి, బండి..మొదలైనవీ, ప్రజలు బ్రతకడానికి కావల్సిన ఇల్లు,తలుపు ద్వారా బందం, పీట, మంచం మొదలగు మానవ జీవితానికి అవసరమైన పరికరాలు చరిత్రలో అభివృద్ధికి మొట్ట మొదటి మెట్టైన 'చక్రం'.చెక్కతో తయారయ్యే ప్రతిది...పిల్లలు ఆడుకున్నే బొంగరం నుండి దేవుణ్ణి ఊరేగించే రథం వరకూ, ఊయల నుండి పడవల వరకు..తయారు చేసే మొట్ట మొదటి చెక్క ఇంజనీర్ .

కాంస్యకారుడు

మార్చు

కాంస్యకారుడు ప్రజలకు కావల్సిన ఇత్తడి, రాగి, కంచు పాత్రలు ఉగ్గు గిన్నెల దగ్గర్నుండి గంగాళాల వరకు ... ముడి ఇత్తడి సంగ్రహించడం దగ్గర్నించి, దానిని రాగిగా, కంచుగా మార్చి కరిగించి కావల్సిన ఆకారం లోకి పోత పోసే వరకు ఉద్ధరిణిల దగ్గరినుండి ఊరేగింపు వాహనాల వరకూ... ప్రతి పని చేసే మొట్ట మొదటి మెటల్ అల్లాయ్ ఇంజనీర్.

శిల్పకారుడు

మార్చు

శిల్పకారుడు (శిల్పి) అంటే రాళ్ళను విగ్రహాలుగా చేసేవాడు అని కాదు.ఏదైనా తయారు చేసే వాడు (క్రియేటర్)అని అర్థం.దురదృష్టవశాత్తూ, శిల్పి అంటే శిల్పాలు చెక్కే వాడు అని అర్థం మారి పోయింది.శిల్పి గురించి ఎంత చెప్పినా తక్కువే.ఈ నాడు భారతదేశంలో మనం చూస్తున్న విగ్రహాలు, అద్భుతమైన దేవాలయాలు, మహా మహా నిర్మాణాలు, వంతెనలు, శిలా శాసనాలు, అజంతా ఎల్లోరా గుహలు, కోటలు, మహల్ లు, చెరువులు, ఏకశిలా రథాలు ఇలాంటివి..... ఎన్నో చేశారో మహానుభావులు.వీరినే 'స్థపతులు' అని అంటారు.జంతర్ మంతర్, నలందా విశ్వ విద్యాలయం, తాజ్ మహల్, చార్మినార్, మహా బలిపురం, తిరుపతి, శబరిమల, ఎర్రకోట, గోమఠేశ్వర, మధుర మీనాక్షి..... శిలా నిర్ణయం దగ్గర నుండి విగ్రహాలు చెయ్యడం దగ్గర నుండి, స్థల పరీక్ష దగ్గర నుండి, వాస్తు పూజ దగ్గర నుండి, భవన లేదా దేవాలయ ప్లాన్ దగ్గర నుండి... గృహ ప్రవేశం లేదా దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపనాధికార పర్యంతం...వీరు చెయ్యలేని పని లేదు. వీరు ప్రపంచ దేశాలలో భరత ఖండాన్ని సగర్వంగా తల ఎత్తుకునేలా చేసిన పుణ్య మూర్తులు.భారత దేశానికి పర్యాటకం మీద ఆదాయం రావడానికి మూలకారణం వీరి చలవే.వీరి కట్టాడాలలోని నైపుణ్యాన్ని, రహస్యాలను ఈనాటికీ మేటి విదేశీ సైంటిస్ట్ లు సైతం అందుకోలేక పోతున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి అసలైన ఇంజనీర్లు.

స్వర్ణకారుడు

మార్చు

స్వర్ణకారుడు అంటే ముడి బంగారాన్ని సేకరించి దాని నుండి అసలైన బంగారం గ్రహించి, దానికి రత్న మాణిక్యాలను కూర్చి, దాన్ని అనుభవ యోగ్యంగా, ఆభరణాలుగా మార్చగలిగిన వాడు. పురాతన దేవాలయాల్లో ఎటువంటి యంlllll

త్ర సహాయం లేకుండా చేసిన కిరీటం, నగలు, వస్తువులు అలనాటి విశ్వబ్రాహ్మణ వృత్తికి నిదర్శనం. తిరుపతి వేంకటేశ్వరస్వామి నగలు ఈ రోజుకి చెక్కు చెదరక పోవడం నిదర్సనం

పంచార్షేయుల్లో ప్రసిద్దులు

మార్చు

ఇటువంటి ఇంటి పేరు కలిగిన సాహితీకారుడు బొల్లోజు బసవలింగం.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కంసాలి&oldid=4296530" నుండి వెలికితీశారు